IND-W vs WI-W: వెస్టిండీస్ – భారత్ మహిళల మూడు వన్డేల సిరీస్ లో భాగంగా సొంత గడ్డపై భారత మహిళా క్రికెట్ జట్టు విజయకేతనం ఎగురవేస్తోంది. అంతకుముందు వెస్టిండీస్ తో జరిగిన {IND-W vs WI-W} టి-20 సిరీస్ ని సొంతం చేసుకున్న భారత మహిళల జట్టు.. తాజాగా మరో వన్డే మ్యాచ్ మిగిలి ఉండగానే సిరీస్ ని సొంతం చేసుకుంది. మొదటి వన్డేలో ఏకంగా 211 పరుగుల భారీ తేడాతో వెస్టిండీస్ పై విజయం సాధించింది.
Also Read: Manu Bhaker: మనూ భాకర్ వివాదం ఏంటి… మోడీ ప్రభుత్వంపై ఆమె తండ్రి సంచలన ఆరోపణలు ?
ఇక మంగళవారం జరిగిన రెండవ వన్డేలో {IND-W vs WI-W} భారత జట్టు 115 పరుగుల భారీ తేడాతో విజయం సాధించింది. ఈ విజయంతో 3 వన్డేల సిరీస్ ని 2-0 తో సొంతం చేసుకుంది. మొదట టాస్ గెలిచిన భారత జట్టు బ్యాటింగ్ ఎంచుకుంది. ఓపెనర్లు స్మృతి మందాన (53), ప్రతీకా రావల్ (76) పరుగులతో దూకుడుగా ఆడారు. వీరిద్దరూ కలిసి 110 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పాక 16.3 ఓవర్ లో స్మృతి మందాన రన్ అవుట్ అయింది. ఆ తర్వాత వన్ డౌన్ లో వచ్చిన హార్లిన్ డియోల్ (115) వీరోచిత ఇన్నింగ్స్ ఆడింది. 103 బాల్స్ లో 115 పరుగులు చేయడంతో భారత్ భారీ స్కోరు సాధించింది.
దీంతో భారత జట్టు నిర్ణీత 50 ఓవర్లలో ఐదు వికెట్లు కోల్పోయి 358 పరుగులు చేసింది. అయితే వన్డే క్రికెట్ లో హార్లీన్ కి ఇది మొదటి సెంచరీ. {IND-W vs WI-W} ఇక వెస్టిండీస్ బౌలర్లలో అఫీ ప్లేచర్, జైదా జేమ్స్, జోసెఫ్, డాటిల్ చెరో వికెట్ పడగొట్టారు. ఇక 359 పరుగుల భారీ లక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన వెస్టిండీస్ మహిళలు 46.2 ఓవర్లలో కేవలం 243 పరుగులకే ఆల్ అవుట్ అయ్యారు.
భారత బౌలర్లలో ప్రియా మిశ్రా 49 పరుగులు ఇచ్చి మూడు వికెట్లు పడగొట్టింది. దీప్తి శర్మ 2, టిటాస్ సధు 2, రేణుక సింగ్ ఒక వికెట్ తీశారు. అయితే ఈ మ్యాచ్ లో తన బ్యాటింగ్ తో అద్భుత ప్రదర్శన చేసిన హార్లీన్ డియోల్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ మ్యాచ్ లో హార్లిన్ డియోల్ తన బ్యాట్ తోనే కాదు.. తన అందంతోను అదరగొట్టింది. తన అద్భుతమైన లుక్స్, స్టైలిష్ తో ప్రేక్షకుల చూపుని ఆకర్షించింది.
Also Read: Boxing Day Test: బాక్సింగ్ డే పేరు ఎలా వచ్చింది? క్రికెట్ కు బాక్సింగ్ కు ఏం సంబంధం?
ఇప్పటిదాకా భారత మహిళా క్రికెట్ టీమ్ లో అందం గురించి టాపిక్ వస్తే.. స్మృతి మందాన పేరు వినిపించేది. కానీ ఇప్పటినుండి హార్లీన్ డియోల్ పేరు వినిపించేలా ఎంతోమంది కుర్రాళ్ళ హృదయాన్ని దోచుకుంది. 2019 ఫిబ్రవరి 22న హార్లిన్ వాంఖడేలో ఇంగ్లాండ్ తో జరిగిన వన్డే మ్యాచ్ తో అంతర్జాతీయ క్రికెట్ లోకి అరంగేట్రం చేసింది. ఇక 2020 జనవరిలో ఆస్ట్రేలియాతో జరిగిన మహిళల t-20 ప్రపంచ కప్ లో భారత జట్టులో చోటు దక్కించుకుంది పంజాబ్ కి చెందిన ఈ ఆల్ రౌండర్.