BigTV English
Advertisement

Nani : నెక్స్ట్ టైం నుంచి నానిని నమ్మకండి, నాని నుంచి ఇది అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు

Nani : నెక్స్ట్ టైం నుంచి నానిని నమ్మకండి, నాని నుంచి ఇది అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు

Nani : అసిస్టెంట్ డైరెక్టర్ గా కెరియర్ మొదలుపెట్టి అష్టా చమ్మా (Ashta Chemma) సినిమాతో నటుడుగా అడుగులు వేసుకున్నాడు నాని. బాక్సాఫీస్ వద్ద ఆ సినిమా డీసెంట్ హిట్గా నిలిచింది. నానికి కూడా మంచి పేరుని తీసుకొచ్చింది. ఆ సినిమా దర్శకుడు ఇంద్రగంటి మోహన్ కృష్ణ (Indraganti Moahankrishna) నానితో మూడు సినిమాలను కూడా చేశారు. ఇకపోతే నాని ప్రస్తుతం ఏ రేంజ్ లో ఉన్నాడు కొత్తగా చెప్పక్కర్లేదు. ప్రస్తుతం పాన్ ఇండియా స్థాయిలో ఉంది నాని గుర్తింపు. కేవలం నటుడిగానే కాకుండా, నిర్మాతగా కూడా అవతారమెత్తి చాలామంది కొత్త దర్శకులకు అవకాశం ఇస్తున్నాడు. అలానే తానే హీరోగా చాలామంది దర్శకులను కూడా పరిచయం చేస్తున్నాడు. ప్రస్తుతం నాని హిట్ 3 సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా ట్రైలర్ నేడు విడుదలైంది. ఈ సినిమా ట్రైలర్ కు విపరీతమైన రెస్పాన్స్ వచ్చింది. మే 1న ఈ సినిమా విడుదల కానుంది.


నానిని నమ్మకండి

నాని ఒక సినిమా తనకు నచ్చినట్లయితే ఆ సినిమా గురించి ఏ రేంజ్ లో ఎలివేషన్ ఇస్తాడు చాలా సందర్భాల్లో రుజువు అవుతూ వచ్చింది. ఇక రీసెంట్ గా నాని ప్రొడ్యూస్ చేసిన కోర్టు సినిమా విషయంలో కూడా మాట్లాడుతూ.. ఈ సినిమా నచ్చకపోతే నా నెక్స్ట్ సినిమా చూడకండి అంటూ చెప్పుకొచ్చాడు. అయితే నానికి అదే ప్రశ్న నేడు ఎదురైంది. మరి ఈ సినిమా విషయంలో ఏమి చెబుతారు అని అడిగినప్పుడు నాని చాలా తెలివిగా సమాధానం ఇచ్చాడు. నేను కోర్టు సినిమా బాలేక పోతే నా నెక్స్ట్ సినిమా చూడొద్దని చెప్పాను. ఎందుకంటే హిట్ 3 సినిమా ప్రొడ్యూసర్ నేనే, కానీ హిట్ త్రీ విషయంలో నేను అంత గట్టిగా చెప్పలేను. ఎందుకంటే నా నెక్స్ట్ సినిమా ప్రొడ్యూసర్ నేను కాదు కాబట్టి. ఈ సినిమా విషయంలో ఏమి చెప్పగలను అంటే ఈ సినిమా మీకు నచ్చకపోతే నానిని నమ్మకండి అంటూ ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు నాని.


అంత గట్స్ కావాలి

మామూలుగా ఏ యాక్టర్ కూడా ఈ సినిమా బాగోకపోతే నా నెక్స్ట్ సినిమా చూడకండి అని చెప్పరు. అలా చెప్పడానికి చాలా గట్స్ కావాలి. అంతేకాకుండా ఒక సినిమా మీద విపరీతమైన నమ్మకం ఉండాలి. అన్ని సినిమాలు అందరికీ నచ్చుతాయి అని రూల్ లేదు, అలానే నాని చేసిన కొన్ని సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద ఊహించిన సక్సెస్ సాధించలేకపోవచ్చు. కానీ ఆ సినిమాలు ఫెయిల్ అయిన ఒక నటుడుగా నాని ఫెయిల్ కాలేదు. నాని స్టేట్మెంట్స్ ఇవ్వడం ఇది మొదటిసారి కాదు ఆంధ్రప్రదేశ్లో అప్పట్లో టికెట్లు విషయంలో కూడా ముందుకు వచ్చి మాట్లాడిన నటుడు నాని. ఇక ప్రస్తుతం నాని వరుస సినిమాలు చేసుకుంటూ బిజీగా మారిపోయాడు.

Also Read : Hit 3 : చాగంటిని క్రైమ్ లో ఇరికించిన శైలేష్ కొలను, మనోభావాలు దెబ్బ తినే టైం వచ్చిందా.?

Tags

Related News

Tejaswini Nandamuri: నందమూరి వారసురాలు వైరల్ యాడ్ డైరెక్టర్ ఎవరో తెలుసా? ఇంత బ్యాక్గ్రౌండ్ ఉందా?

Film industry: ఘనంగా సినిమాటిక్ ఎక్స్ పో 3వ ఎడిషన్!

CM Revanth on Movie Tickets: సినిమా టికెట్ డబ్బుల్లో సినీ కార్మికులకు వాటా… సీఎం సంచలన ప్రకటన

Bandla Ganesh: బండ్ల గణేష్ ఇల్లు చూడండి.. ఎంత అద్భుతంగా ఉందో!

Telugu Heroes : సినిమాలతో పాటు హోటల్స్… లగ్జరీ రెస్టారెంట్స్ ఉన్న హీరోలు వీళ్లే

Salman Khan: పాక్ ను కెలికిన సల్లు భాయ్.. తెలుగు సినిమాలు బాగా చూస్తారంటూ..

Siva Jyothi: బేబీబంప్ తో పెళ్లి పీటలు ఎక్కిన శివ జ్యోతి.. ఇలా కూడా చేస్తారా?

Kantara 2: వైకల్యాన్ని జయిస్తూ.. నోటితోనే కాంతార బిజీఎం!

Big Stories

×