OTT Movie : తాంత్రిక శక్తులతో ఎన్నో వెబ్ సిరీస్ లు, సినిమాలు వస్తున్నాయి. వీటిని చూడటానికి కూడా చాలామంది ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. సస్పెన్స్ థ్రిల్లర్ జానర్ లోనే ఎక్కువగా ఇవి వస్తుంటాయి. రీసెంట్ గా వచ్చిన ఇటువంటి స్టోరీలు మంచి టాక్ తెచ్చుకుంటున్నాయి. ఇప్పుడు మనం చెప్పుకోబోయే వెబ్ సిరీస్ బెంగాలీ ఇండస్ట్రీ నుంచి వచ్చింది. ఇందులో ఒక అఘోరి తాంత్రిక విద్యలతో దడ పుట్టిస్తాడు. ఈ వెబ్ సిరీస్ చివరి వరకు సస్పెన్స్ తో టెన్షన్ పెట్టిస్తుంది. దీని పేరు ఏమిటి ? ఎందులో స్ట్రీమింగ్ అవుతుంది ? అనే వివరాల్లోకి వెళితే…
రెండు ఓటిటిలలో స్ట్రీమింగ్
ఈ బెంగాలీ సూపర్‌న్యాచురల్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ పేరు ‘నికోష్ ఛాయ’ (Nikosh Chhaya). దీనికి పరంబ్రత చటోపాధ్యాయ్ దర్శకత్వం వహించారు. ఈ సిరీస్ సౌవిక్ చక్రబర్తీ రాసిన కథ ఆధారంగా రూపొందింది. ‘పర్ణశవరీర్ శాప్’ సిరీస్‌కు సీక్వెల్‌గా ఇది వచ్చింది. ఇందులో చిరంజీత్ చక్రబర్తీ, గౌరవ్ చక్రబర్తీకంచన్ మల్లిక్, సురంగనా బందోపాధ్యాయ్, అనిందితా బోస్, అనుజోయ్ చటోపాధ్యాయ్ వంటి నటులు నటించారు. ఇది హోయ్‌చోయ్ (Hoichoi), అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon prime video) ఓటీటీ ప్లాట్ ఫామ్ లలో 2024 అక్టోబర్ 31న విడుదలైంది. భదూరి మోషాయ్ అనే ఆకల్టిస్ట్ చుట్టూ ఈ వెబ్ సిరీస్ స్టోరీ తిరుగుతుంది.
స్టోరీలోకి వెళితే
భదూరి మోషాయ్ ఒక ప్రసిద్ధ ఆకల్టిస్ట్‌గా ఉంటాడు. చంద్రునిరూపం యర్రగా మారుతున్న సమయంలో ఒక అఘోరి తాంత్రికుడు పూజలు చేయడం మొదలుపెడతాడు. అతను భదూరి మోషాయ్‌కు సన్నిహితులైన వారికి ప్రమాదకరమైన ముప్పుగా మారతాడు. ఒక ఆసుపత్రి నుండి రెండు మృతదేహాలు అదృశ్యమవడం, ఒక పోలీసు అధికారి కుమార్తె కనిపించకుండా పోవడం వంటి రహస్యమైన సంఘటనలు జరుగుతాయి. ఈ సంఘటనల వెనుక ఒక రాక్షసుడు ఉన్నాడనే పుకార్లు వ్యాపిస్తాయి. పోలీసు అధికారి అమియా ఈ కేసును పరిశోధించడానికి, భదూరి మోషాయ్ సహాయం తీసుకుంటాడు. విచారణలో ఒక రాక్షసుడు గురించి సమాచారం బయటపడుతుంది. సంజయ్ అనే ఆ అమ్మాయిల స్నేహితుడు చెప్పిన కథతో అందరూ షాక్ అవుతారు.
స్టోరీ ముందుకు సాగుతున్న కొద్దీ, సూపర్‌న్యాచురల్, తాంత్రిక శక్తులతో వాతావరణం మరోలా మారపోతుంది. అదృశ్యమైన మృతదేహాలు, అఘోరి తాంత్రికుడి ఆధీనంలో ఉంటాయి. చివరికి ఆ శవాలను ఎత్తుకెళ్లిన రాక్షసుడు ఎవరు ? అఘోరి తాంత్రిక పూజలు ఎందుకు చేస్తున్నాడు ? భదూరి మోషాయ్ వీటిని ఎలా ఎదుర్కుంటాడు ? ఈ విషయాలను తెలుసుకోవాలి అనుకుంటే, ఈ బెంగాలీ సూపర్‌న్యాచురల్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ ను మిస్ కాకుండా చూడండి. ఈ సిరీస్ ప్రస్తుతం, ‘నికోష్ ఛాయ’ తెలుగు డబ్బింగ్, సబ్‌టైటిల్స్‌తో అధికారికంగా అందుబాటులో లేదు. కానీ హోయ్‌చోయ్ యాప్‌లో ఇంగ్లీష్ సబ్‌టైటిల్స్ తో అందుబాటులో ఉంది.
Read Also : గతం మరిచిపోయే పోలీస్ … ఊహకందని ట్విస్ట్ లతో మర్డర్ ఇన్వెస్టిగేషన్ .. మెంటలెక్కించే యాక్షన్ థ్రిల్లర్