BigTV English

Abbavaram’s KA movie: దాదాసాహెబ్ ఫాల్కే ఫిలిం ఫెస్టివల్ కి కిరణ్ అబ్బవరం మూవీ… కెరీర్‌లో ఫస్ట్ టైం..?

Abbavaram’s KA movie: దాదాసాహెబ్ ఫాల్కే ఫిలిం ఫెస్టివల్ కి కిరణ్ అబ్బవరం మూవీ… కెరీర్‌లో ఫస్ట్ టైం..?

Abbavaram’s KA movie:భారతీయ సినిమాకు గణనీయమైన సేవ చేసిన వారికి ప్రతి ఏడాది ఇచ్చే అత్యున్నత పురస్కారం దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు (Dadasaheb Phalke Award) . భారతీయ సినిమా పితామహుడిగా భావించబడే దాదాసాహెబ్ ఫాల్కే శత జన్మదినం సందర్భంగా 1969 లోనే ఈ పురస్కారాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇక ఒక సంవత్సరానికి సంబంధించిన పురస్కారం మరుసటి ఏడాది చివర్లో వచ్చే జాతీయ సినిమా అవార్డులతో పాటు అందిస్తారు. అయితే ఇప్పుడు ఇంత గౌరవమైన అత్యున్నత పురస్కారమైన దాదాసాహెబ్ ఫాల్కే ఫిలిం ఫెస్టివల్ కి యంగ్ హీరో కిరణ్ అబ్బవరం (Kiran Abbavaram) ‘క’ (KA)మూవీ నామినేట్ అయ్యింది. దాదాసాహెబ్ ఫాల్కే ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ (DPIFF) కు నామినేట్ చేయబడింది. కిరణ్ అబ్బవరం కెరియర్ లోనే ఫస్ట్ టైం ఇలా దాదాసాహెబ్ ఫాల్కే ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ కి తన సినిమా నామినేట్ అవ్వడంతో హీరోకి పలువురు సెలబ్రిటీలు అభినందనలు తెలియజేస్తున్నారు. ఇకపోతే ఢిల్లీలో ఈ నెలాఖరున జరిగే అవార్డుల ప్రధానోత్సవంలో ఉత్తమ చిత్రాన్ని ప్రకటించనున్నారు.


చిన్న సినిమాగా వచ్చి భారీ సక్సెస్..

క మూవీ విషయానికి వస్తే.. కిరణ్ అబ్బవరం హీరోగా.. సుజీత్, సందీప్ కాంబినేషన్లో గత ఏడాది అక్టోబర్ 31న విడుదలైంది. చిన్న సినిమాగా వచ్చి బాక్సాఫీస్ వద్ద రూ.55 కోట్లకు పైగా కలెక్షన్లు రాబట్టి రికార్డు సృష్టించింది. ఇందులో నయన్ సారిక, తన్వీ రామ్ హీరోయిన్ లుగా నటించారు. చింత గోపాలకృష్ణారెడ్డి సినిమాను నిర్మించగా సామ్ పీ.ఎస్ సంగీతాన్ని అందించారు.


క మూవీ స్టోరీ..

ఈ సినిమా స్టోరీ విషయానికి వస్తే.. ఈ సినిమా కథంతా 1977లో జరుగుతుంది. అభినయ వాసుదేవ్ (కిరణ్ అబ్బవరం) ఒక అనాధ చిన్నప్పటి నుంచి తన స్నేహితులకు తల్లిదండ్రులు రాసే ఉత్తరాలు చదివి తనకు తల్లిదండ్రులు లేరు అనే లోటును తీర్చుకుంటూ ఉంటారు. అలా పక్క వాళ్ళ ఉత్తరాలు చదివే అలవాటు ఏర్పడుతుంది. వయసుతో పాటు అలవాటు కూడా పెరుగుతూ వస్తుంది. ఆఖరికి పోస్ట్మాన్ అయితే అన్ని ఉత్తరాలు చదవచ్చు అనే ఆశతో ఆ ఉద్యోగంలో చేరుతాడు. ఇక ఆ ఉద్యోగంలో చేరడానికి తన పెంపుడు కుక్క రామ్ తో కలిసి కృష్ణగిరి అనే గ్రామానికి వెళ్తాడు. అక్కడ పోస్ట్ మాస్టర్ రామారావు (అచ్యుత్ కుమార్) అనుమతితో పోస్ట్ మాన్ అసిస్టెంట్ గా జాయిన్ అవుతాడు
అదే గ్రామంలో ఉంటూ రామారావు కూతురు సత్యభామ (నయన్ సారిక)తో ప్రేమలో పడతాడు. అనాధ అయిన వాసుదేవ్ కి ఆ ఊరి ప్రజలే తన కుటుంబముగా బ్రతుకుతూ ఉంటాడు..అయితే ఆ గ్రామంలో అమ్మాయిలు అనుకోకుండా మిస్ అవుతూ ఉంటారు.. వారిని కిడ్నాప్ చేసేది ఎవరు? క్రిష్ణగిరి గ్రామానికి చెందిన అమ్మాయిలే ఎందుకు మిస్ అవుతున్నారు..? ఇక ఉత్తరాలు చదివే అలవాటున్న వాసుదేవ్ కి తెలిసిన నిజం ఏమిటి..? వాసుదేవుని ఒక ముసుగు వ్యక్తి , అతడు గ్యాంగ్ ఎందుకు వెంటాడుతున్నారు..? చీకటి గదిలో బంధించబడ్డ రాధ ఎవరు ? ఆమెకు , వాసు దేవ్ కి ఉన్న సంబంధం ఏంటి? ఇలా పలు ఆసక్తికర అంశాలతో ఈ సినిమాను చాలా చక్కగా తెరకెక్కించారు. ఈ సినిమా కథ చూస్తే పాతదే అనిపించినా.. దానికి ఇచ్చిన ట్రీట్మెంట్ చాలా కొత్తగా అనిపించింది. ముఖ్యంగా చివరి 20 నిమిషాల వరకు ప్రేక్షకుడికి ఒక రకమైన అభిప్రాయం ఉంటే క్లైమాక్స్ తర్వాత అభిప్రాయం మొత్తం పూర్తిగా మారిపోతుంది. అలా ఈ సినిమాను చాలా అద్భుతంగా తెరకెక్కించారు.

Related News

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Ali Wife : కొత్త బిజినెస్ మొదలుపెట్టిన అలీ వైఫ్ జుబేదా…మీ సపోర్ట్ కావాలంటూ?

Big Stories

×