Best Hair Oils: పూర్వం గోరువెచ్చని నూనెతో తలకు సున్నితంగా మసాజ్ చేసి ఆ తర్వాత తలస్నానం చేసేవారు. ఈ సంప్రదాయం చాలా సంవత్సరాలుగా కొనసాగుతోంది. ఇది జుట్టు అందానికి అతిపెద్ద రహస్యం అని చెబుతుంటారు. ఇదిలా ఉంటే జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తాయని చెప్పుకునే అనేక రకాల నూనెలు ప్రస్తుతం మార్కెట్లో అందుబాటులోకి వచ్చాయి. అందులో ఏ హెయిర్ ఆయిల్ జుట్టుకు మేలు చేస్తుందనే సందేహం చాలా మందిలో ఉంటుంది. ఇలాంటి సమయంలో మీ జుట్టు పెరుగుదలకు సహాయపడే అలాగే జుట్టుకు సంబంధించిన సమస్యలను తొలగించడంలో సహాయపడే కొన్ని సహజ హెయిర్ ఆయిల్స్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
బాదం నూనె :
బాదం గింజల్లో ప్రోటీన్, విటమిన్ల వంటి అనేక పోషకాలు ఉంటాయి. ఈ పోషకాలు జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తాయి. అంతే కాకుండా ఈ ఆయిల్ తలలోని కణజాలాలలోకి సులభంగా శోషించబడుతుంది. జుట్టు పెరుగుదలకు ఎంతగానో ఉపయోగపడుతుంది.
అప్లై చేయడానికి సరైన మార్గం: మీరు బాదం ఆయిల్‌ను మీ జుట్టు, తలపై నేరుగా అప్లై చేయవచ్చు. ఈ నూనెను రాత్రంతా అలాగే ఉంచి.. మరుసటి రోజు షాంపూతో తలస్నానం చేయండి. ఇలా చేయడం వల్ల మంచి ఫలితం ఉంటుంది.
కొబ్బరి నూనె :
విటమిన్లు, ఖనిజాలు,కార్బోహైడ్రేట్లు , కొవ్వు ఆమ్లాలు సమృద్ధిగా ఉన్న కొబ్బరి నూనె జుట్టు పెరుగుదలకు చాలా బాగా ఉపయోగపడుతుంది.ఇది తలకు పోషణనిస్తుంది. అంతే కాకుండా జుట్టుకు లోతుగా పోషణను అందిస్తుంది. ఒత్తైన జుట్టు కోసం కొన్ని రకాల పదార్థాలను మీరు మీ కొబ్బరి నూనెలో కలిపి ఉపయోగించవచ్చు.
జుట్టుకు ఎలా అప్లై చేయాలి: కొబ్బరి నూనెలో 10-15 కరివేపాకు వేసి, ఆకులు చిటపటలాడే వరకు తక్కువ మంట మీద వేడి చేయండి. ఇది కొద్దిగా వెచ్చగా అయిన తర్వాత, మీ జుట్టుకు 15 నిమిషాలు బాగా మసాజ్ చేయండి. ఒకటి లేదా రెండు వారాలలో మీరు తేడాను చూడటం ప్రారంభిస్తారు. దీన్ని వారానికి రెండు లేదా మూడు సార్లు అప్లై చేయండి. ఇలా చేయడం వల్ల మంచి ఫలితం ఉంటుంది.
ద్రాక్ష గింజల నూనె :
ద్రాక్ష గింజల నూనె జుట్టు పెరుగుదలకు ముఖ్యమైన అనేక పోషకాలు, యాంటీఆక్సిడెంట్లతో నిండి ఉంటుంది. ఇది మీ తలపై చర్మం, జుట్టుకు మేలు చేస్తుంది. చుండ్రు సమస్యతో ఇబ్బంది పడే వారు తరచుగా ఈ ఆయిల్ వాడటం వల్ల మంచి ఫలితం ఉంటుంది.
జుట్టుకు ఎలా అప్లై చేయాలి: దీనిని అప్లై చేయడానికి.. ఒక చిన్న కప్పులో నూనె పోసి.. ఆపై దానిని తలకు, జుట్టుకు అప్లై చేసి మీ జుట్టు దెబ్బతిన్న ప్రాంతాలపై బాగా అప్లై చేసి 5 నుండి 10 నిమిషాలు మసాజ్ చేసి, ఆపై వేడి టవల్ తో జుట్టును కప్పండి. ఈ నూనెను అరగంట పాటు అప్లై చేసిన తర్వాత షాంపూతో జుట్టును శుభ్రం చేసుకోండి. దీనిని వారానికి రెండు లేదా మూడు సార్లు కూడా ఉపయోగించవచ్చు.
Also Read: ఈ ఫేస్ సీరం వాడితే.. అమ్మాయిలే అసూయపడే అందం మీ సొంతం
ఆముదం :
ఆముదంప్రోటీన్, ఖనిజాలు , విటమిన్ E యొక్క ఉత్తమ మూలం. ఇది మీ తల, జుట్టుకు అద్భుతంగా పనిచేస్తుంది. దీనివల్ల జుట్టు దట్టంగా, మందంగా ,పొడవుగా మారుతుంది. అంతేకాకుండా ఇది జుట్టును మృదువుగా చేస్తుంది.