BigTV English

AA 22: అల్లు అర్జున్‌తో మృణాల్ ఠాకూర్.. సీన్‌లోకి మరో ఇద్దరు బాలీవుడ్ హీరోయిన్స్

AA 22: అల్లు అర్జున్‌తో మృణాల్ ఠాకూర్.. సీన్‌లోకి మరో ఇద్దరు బాలీవుడ్ హీరోయిన్స్

AA 22: పాన్ ఇండియా సినిమాల్లో హీరోల సరసన నటించే హీరోయిన్లపై కూడా ప్రేక్షకుల్లో ప్రత్యేకమైన ఫోకస్ ఉంటుంది. ఒక పాన్ ఇండియా ప్రాజెక్ట్ ప్రకటించినప్పటి నుండి అందులో హీరోయిన్ ఎవరు, ఒక హీరోయినా లేక ఇద్దరు హీరోయిన్సా.. ఇలాంటి చర్చలు మొదలవుతాయి. అలా ప్రస్తుతం ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారిన పాన్ ఇండియా ప్రాజెక్ట్ ‘ఏఏ 22’. ‘పుష్ప’ లాంటి క్రేజీ హిట్ తర్వాత అల్లు అర్జున్ అసలు ఏ సినిమాలో నటిస్తాడా, ఆ సినిమా ఎలా ఉండబోతుందా అని అందరిలో ఆసక్తి ఎక్కువయ్యింది. ఫైనల్‌గా తమిళ దర్శకుడు అట్లీతో మూవీ అనౌన్స్‌మెంట్ తర్వాత దీనిపై మరింత ఫోకస్ పెరిగింది.


ఎన్నో రూమర్స్

అట్లీ దర్శకత్వంలో అల్లు అర్జున్ నటించే సినిమా పాన్ ఇండియా రేంజ్‌లో కాదు.. పాన్ వరల్డ్ రేంజ్‌లో ఉంటుందని ఇప్పటికే క్లారిటీ వచ్చేసింది. ఈ మూవీ అనౌన్స్‌మెంట్‌నే ఒక రేంజ్‌లో ఇచ్చి ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారారు. అయితే ఈ సినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటన రాకముందే దీనిపై ఎన్నో రూమర్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతూ వచ్చాయి. అందులో ఒకటి.. అల్లు అర్జున్ ఇందులో డబుల్ రోల్ చేస్తున్నాడని, అందులో ఒక క్యారెక్టర్‌కు చాలా నెగిటివ్ షేడ్స్ ఉంటాయని. అయితే డబుల్ రోల్ అంటే హీరోయిన్స్ కూడా డబులే ఉండాలి కదా. అందుకే ఈ మూవీలో హీరోయిన్స్ వీళ్లే అంటూ కొత్తగా ఒక ప్రచారం వెలుగులోకి వచ్చింది.


రిఫ్రెషింగ్ పెయిర్

ఇప్పటికే అట్లీ (Atlee), అల్లు అర్జున్ (Allu Arjun) కాంబినేషన్ మూవీలో మృణాల్ ఠాకూర్ (Mrunal Thakur) హీరోయిన్‌గా ఫిక్స్ అయ్యిందని వార్తలు వినిపిస్తున్నాయి. తాజాగా ఈ సినిమా కోసం లుక్ టెస్ట్ కూడా పూర్తి చేసుకుందట మృణాల్. దీంతో స్క్రీన్‌పై అల్లు అర్జున్, మృణాల్ పెయిర్ చాలా రిఫ్రెషింగ్‌గా అనిపిస్తుందని అప్పుడే ప్రేక్షకులు ఊహించుకోవడం మొదలుపెట్టారు. అయితే ఈ మూవీలో ఒకరు కాదు, ఇద్దరు కాదు, ఏకంగా ముగ్గురు హీరోయిన్స్ ఉంటారని వార్తలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం ఒక హీరోయిన్ రోల్ కోసం మృణాల్‌ను ఫైనల్ చేయగా మరొక రెండు పాత్రల్లో బాలీవుడ్ స్టార్ల పేర్లను పరిగణనలోకి తీసుకోనున్నట్టు తెలుస్తోంది.

Also Read: గుడికి వెళ్తా.. మసీదుకూ వెళ్తా.. బెల్లంకొండ హీరోియన్ స్ట్రాంగ్ కామెంట్స్

ఆ ఇద్దరే

ఎన్‌టీఆర్, కొరటాల శివ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ‘దేవర’ సినిమాతో తెలుగులోకి అడుగుపెట్టింది జాన్వీ కపూర్. ఆ సినిమాలో తన పాత్ర ప్రేక్షకులకు పెద్దగా రెజిస్టర్ కాకపోయినా బ్యాక్ టు బ్యాక్ తెలుగు ఆఫర్లు రావడం మాత్రం ప్రారంభమయ్యింది. ఇప్పటికే రామ్ చరణ్ హీరోగా నటిస్తున్న ‘పెద్ది’లో కూడా జాన్వీ హీరోయిన్‌గా కన్ఫర్మ్ అయ్యింది. ఇప్పుడు అట్లీ, అల్లు అర్జున్ మూవీలో కూడా జాన్వీ కపూర్‌ను మరో హీరోయిన్‌గా కన్ఫర్మ్ చేసే ఆలోచనలో ఉన్నారట మేకర్స్. మూడో హీరోయిన్‌గా దీపికా పదుకొనె నటిస్తే బాగుంటుందని భావిస్తున్నారట. మరి ఈ ఇద్దరు బాలీవుడ్ బ్యూటీస్ అల్లు అర్జున్‌తో కలిసి నటించడానికి ఏ మాత్రం ఇంట్రెస్ట్ చూపిస్తారో చూడాలి.

Related News

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Ali Wife : కొత్త బిజినెస్ మొదలుపెట్టిన అలీ వైఫ్ జుబేదా…మీ సపోర్ట్ కావాలంటూ?

Big Stories

×