BigTV English

Re-release : బాలయ్య మూవీ కూడా పోయింది… ఆడియన్స్‌కు మోజు తగ్గిందా..?

Re-release : బాలయ్య మూవీ కూడా పోయింది… ఆడియన్స్‌కు మోజు తగ్గిందా..?

Re-release : తెలుగులో రీ రిలీజ్ అయిన సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద ఒకప్పుడు భారీగా కలెక్షన్స్ వసూలు చేశాయి. కానీ ఇప్పుడు ఊహించిన స్థాయిలో కలెక్షన్స్ రావట్లేదు అన్నది నిజం. ఒకప్పుడు పోకిరి, జల్సా లాంటి సినిమాలు రీ రిలీజ్ చేసి బాక్స్ ఆఫీస్ వద్ద భారీ కలెక్షన్స్ ని వసూలు చేశాయి. ఇతర భాషల్లో కంటే తెలుగులోనే రీ రిలీజ్ హడావుడి ఎక్కువగా కనిపిస్తుంది. సినిమా ప్రేక్షకుల ముందుకి కొన్ని సంవత్సరాలు తర్వాత వచ్చిన కూడా ఈ స్థాయిలో కలెక్షన్స్ వస్తాయా అని అందరూ ఆశ్చర్యపోయే విధంగా కలెక్షన్స్ వచ్చాయి.


ఏ హీరో పుట్టినరోజు వచ్చిన ఆ హీరో హిట్ మూవీ రీ రిలీజ్ చేయడం కామన్ అయిపోయింది. కానీ ఇప్పుడు ప్రేక్షకులు రీ రిలీజ్ కి పెద్దగా ఇంట్రస్ట్ చూపడం లేదు. దానికి కారణం ప్రతి సినిమా ఓటీటీలలో HD క్వాలిటీ తో పాటు ఇతర సైట్స్ లో కూడా అందుబాటులోకి రావడం. ఎప్పుడు కావాలంటే అప్పుడు సినిమాని మొబైల్ లోనే చూడడం వల్ల రీ రిలీజ్ కి ఇంట్రెస్ట్ తగ్గిందని చెప్పొచ్చు. తాజాగా మన ముందుకి వచ్చిన రీ రిలీజ్ మూవీస్ గురించి చూద్దాం..

నాయక్ మూవీ రీ రిలీజ్..


రీసెంట్ గా మార్చి 27న రామ్ చరణ్ బర్త్ డే సందర్భంగా నాయక్ మూవీని రీ రిలీజ్ చేశారు. రామ్ చరణ్ డ్యూయల్ రోల్ లో నటించిన ఈ సినిమాలో బ్రహ్మానందం కామెడీ ప్రత్యేకంగా ఆకట్టుకుంటుంది. ఇప్పటికి సినిమాలోని కామెడీ సీన్స్ ఆకట్టుకుంటున్నాయి. కాజల్, అమలాపాల్ హీరోయిన్స్ గా ఈ సినిమాలో నటించారు. చార్మి ఒక ప్రత్యేకమైన పాటలో నటించి మెప్పించింది. 2013 సంక్రాంతి పండుగకు ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. రామ్ చరణ్ అంతకుముందు నటించిన ఆరంజ్ మూవీ కూడా రిలీజ్ చేశారు. ఆ సినిమా ఆశించిన స్థాయిలో కలెక్షన్స్ ని రాబట్టింది. నాయక్ సినిమా కూడా అదే రేంజ్ లో కలెక్షన్స్ రాబడుతుందని నిర్మాతలు ఊహించినా, ప్రేక్షకులు ఆదరించలేదని చెప్పొచ్చు.

బాలకృష్ణ మూవీ రీ రిలీజ్..

తాజాగా ఏప్రిల్ 4వ తేదీన రీ రిలీజ్ అయిన ఆదిత్య 369 మూవీ ఆశించిన స్థాయిలో కలెక్షన్స్ రాబట్టలేదని టాక్ . నందమూరి బాలకృష్ణ హీరోగా సింగీతం శ్రీనివాస్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది. టైం మిషన్ కథాంశంతో ప్రస్తుత, భవిష్యత్తు, వర్తమాన కాలాన్ని లింక్ చేస్తూ తీసిన సినిమా ఆదిత్య 369. దాదాపు 34 ఏళ్ల క్రితం ఈ సినిమా అభిమానులను ఎంతగానో అలరించింది. ఈ జనరేషన్ ఆడియన్స్ కి మరోసారి అలరించడానికి ఈ సినిమా థియేటర్లలోకి ఏప్రిల్ 4 వ తేదీ న ( శుక్రవారం) 4k క్వాలిటీలో రిలీజ్ అయింది. అనుకున్న స్థాయిలో ఈ సినిమా కూడా ఆడియన్స్ ని ఆదరించలేకపోయింది. ఇటీవల జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్ లో బాలకృష్ణ మాట్లాడుతూ ఆదిత్య 999 మాక్స్ అనే టైటిల్ తో ఈ సినిమా సీక్వెల్ మోక్షజ్ఞతో ప్లాన్ చేస్తున్నట్లు తెలిపారు.

ఈరోజు రీ రిలీజ్ అయిన అల్లు అర్జున్ మూవీ..

ఏప్రిల్ 5వ తేదీ ఆర్య 2 సినిమా రీ రిలీజ్ కానుంది. ఐ కాన్ స్టార్ అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్ లో వచ్చిన భారీ బడ్జెట్ సూపర్ హిట్ మూవీ ఆర్య 2. ఈ మూవీ 2009లో విడుదలై బన్నీని మరో స్థాయిలో నిలబెట్టిన చిత్రం. మ్యూజికల్ హిట్ గా యూత్ ని బాగా ఆకట్టుకున్న సినిమా ఆర్య 2. ఈ మూవీ మరోసారి ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. అల్లు అర్జున్ పుట్టినరోజు ఏప్రిల్ 8 వ తేదీ నేపథ్యంలో ఈ సినిమాను ఏప్రిల్ 5వ తేదీన రిలీజ్ చేయనున్నారు. ఆశించిన స్థాయిలో ఈ మూవీ కూడా హైప్ క్రియేట్ చేయలేదని టాక్.

తెలుగులో రీ రిలీజ్ ట్రెండు ఎప్పటినుండో కొనసాగుతుంది. పోటీపడి హీరోల సినిమాలు తెలుగులో రీ రిలీజ్ చేస్తున్నారు. ఈ నెలలో థియేటర్లలో రిలీజ్ కి సిద్ధంగా ఉన్న సినిమాలు చాలానే ఉన్నాయి. వాటికి పోటీగా ఈ నెలలో మూడు సినిమాలు రీ రిలీజ్ అయ్యాయి. ఏ మూవీ కూడా ఆశించిన స్థాయిలో కలెక్షన్స్ రాబట్టలేకపోయింది. చూడాలి ఇకముందు అయినా నిర్మాతలు సినిమాలను రిలీజ్ చేయడానికి మొగ్గు చూపుతారో లేదో..

Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×