Drishyam 3: మలయాళం స్టార్ హీరో మోహన్ లాల్ (Mohan Lal) హీరోగా జీతూ జోసెఫ్ డైరెక్షన్లో వచ్చిన క్రైమ్ థ్రిల్లర్ మూవీ దృశ్యం.. ఈ సినిమా 2013 లో వచ్చి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది. ఇక ఎప్పుడైతే మలయాళంలో హిట్ అయిందో ఆ తర్వాత మిగతా భాషల్లో కూడా ఈ సినిమాని రీమేక్ చేశారు. అలా తెలుగులో వెంకటేష్ (Venkatesh) , హిందీ లో అజయ్ దేవగన్ (Ajay devagan) లు హీరోలుగా ఈ సినిమాలో నటించారు. ఇప్పటికే దృశ్యం సినిమాకి సంబంధించి దృశ్యం, దృశ్యం 2 సిరీస్ లు కూడా పూర్తయ్యి బాక్సాఫీస్ వద్ద మంచి విజయం అందుకున్నాయి. కేవలం మలయాళం లోనే కాదు తెలుగు, హిందీ భాషల్లో కూడా దృశ్యం,దృశ్యం 2 కి మంచి రెస్పాన్స్ వచ్చింది.దాంతో దృశ్యం-3 (Drushyam-3) సినిమా చేయబోతున్నట్టు జీతూ జోసెఫ్ అనౌన్స్ చేశారు.
త్వరలో దృశ్యం 3..
అయితే ఈ ప్రాజెక్ట్ ఇప్పట్లో ఉండదని, ఈ ప్రాజెక్టు తెరకెక్కాలంటే మరికొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే అంటూ డైరెక్టర్ చెప్పారు.కానీ సడన్గా దృశ్యం -3 పై అప్డేట్ ఇచ్చారు. “గతం ఎప్పటికీ నిశ్శబ్దంగా ఉండలేదు.త్వరలోనే దృశ్యం-3 రాబోతుంది” అంటూ ట్వీట్ చేయడంతో ఈ ట్వీట్ కాస్త మీడియాలో వైరల్ గా మారింది. దాంతో దృశ్యం-3 అనుకున్న దాని కంటే ముందుగానే వస్తుందని ఈ సినిమా లవర్స్ అనుకున్నారు. ఈ నేపథ్యంలోనే వచ్చే నెల నుండి ఈ సినిమాకి సంబంధించి రెగ్యులర్ షూటింగ్ కూడా స్టార్ట్ అవ్వబోతున్నట్టు మలయాళ ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తుంది.ఇక మలయాళ ఇండస్ట్రీ సంగతి అటుంచితే తెలుగులో దృశ్యం, దృశ్యం 2 సినిమాలలో వెంకటేష్ (Venkatesh) తన నటనతో ఆకట్టుకున్నారు.
Big TV Exclusive: దేవర 2 వచ్చేస్తున్నాడు… షూటింగ్ ముహూర్తం ఎప్పుడంటే?
మరి వెంకటేష్ పరిస్థితి ఏంటి..?
దీంతో మోహన్ లాల్ నటించబోయే దృశ్యం 3 లాగే తెలుగులో కూడా దృశ్యం-3లో వెంకటేష్ నటిస్తారనే వార్తలు వినిపించినప్పటికీ ప్రస్తుతం ఆయన ఆ సినిమాలో చేస్తారో లేరో అనే అనుమానాలు తలెత్తుతున్నాయి. వాస్తవానికి దృశ్యం సినిమా ప్రేక్షకులను మెప్పించినంతగా దృశ్యం 2 ఆకట్టుకోలేదు. సంక్రాంతికి వస్తున్నాం వంటి ఫ్యామిలీ ఎంటర్టైనర్ తో ప్రేక్షకులను ఆకట్టుకున్న మళ్లీ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ చిత్రం దృశ్యం 3 తో వస్తే ప్రేక్షకులు ఆదరిస్తారా అని అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. కానీ మరి కొంతమంది ఏమో సంక్రాంతికి వస్తున్నాం సినిమా తర్వాత వెంకటేష్ చేతిలో మరో చిత్రం లేదు. ఇక సంక్రాంతికి వస్తున్నాం సీక్వెల్ కూడా అటు అనిల్ రావిపూడి(Anil ravipudi) చిరంజీవి (Chiranjeevi) తో సినిమా పూర్తి చేసిన తర్వాతనే ఉండబోతోంది.అప్పటివరకు వెంకీ ఖాళీగానే ఉండబోతున్నట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే వెంకటేష్ దృశ్యం 3 సినిమాని కంప్లీట్ చేస్తారని సమాచారం. మరి వెంకటేష్ ఖాళీగా ఉన్న సమయాన్ని ఫిల్ చేయడానికి దృశ్యం 3 చేస్తారా? లేక దృశ్యం 2 పరిణామాలను దృష్టిలో పెట్టుకొని దూరం అవుతారా? అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఏది ఏమైనా ఈ విషయంపై పూర్తి వివరాలు త్వరలోనే తెలియనున్నాయి అని చెప్పవచ్చు.