Big TV Exclusive:ఈ మధ్యకాలంలో సీక్వెల్స్ హవా ఎక్కువగా ట్రెండ్ అవుతోందని చెప్పవచ్చు. ఒక హీరో ఒక సినిమా చేసి,ఆ సినిమా మంచి హిట్ కొడితే, అదే సినిమాకు సీక్వెల్ ప్రకటిస్తూ.. అభిమానులలో అంచనాలు పెంచేస్తున్నారు. అయితే సీక్వెల్ అన్ని సందర్భాలలో హిట్ కొట్టిన దాఖలాలు చాలా తక్కువ అని చెప్పాలి. ఒకటి రెండు చిత్రాలకు మాత్రమే సీక్వెల్స్ వర్క్ అవుట్ అవుతున్నాయి. అయినా సరే కొంతమంది హీరోలు, దర్శకులు మాత్రం తమ సినిమాలకు సీక్వెల్ తీసుకొస్తూ అందరినీ ఆశ్చర్యపరుస్తూ ఉంటారు. ఇదిలా ఉండగా ఒక సినిమా మొదట మిక్స్డ్ టాక్ తెచ్చుకొని, ఆ తర్వాత స్లోగా విజయం సాధించి, మొదట్లోనే ప్రేక్షకులకు బోర్ కొట్టించింది. దాంతో ఈ సినిమా సీక్వెల్ ప్రకటించినప్పుడు, అభిమానులు కూడా నిరాశ వ్యక్తం చేశారు. ఫ్లాప్ సినిమాకు సీక్వెల్ ఎందుకు అంటూ పెద్ద ఎత్తున ట్రోల్స్ చేశారు నెటిజన్స్. దీంతో దేవర సీక్వెల్ ఇక లేనట్టే అని అనుకున్నారు. కానీ మళ్ళీ సీక్వెల్ కన్ఫామ్ అవ్వడంతో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
దేవర 2 సీక్వెల్ షూటింగ్ ప్రారంభం ఆ రోజే..
యంగ్ టైగర్ ఎన్టీఆర్ (NTR), రాజమౌళి (Rajamouli) దర్శకత్వంలో రామ్ చరణ్ (Ram Charan) తో కలిసి చేసిన సినిమా ‘ఆర్ఆర్ఆర్’. ఈ సినిమా ద్వారా ఏకంగా ప్రపంచ స్థాయి గుర్తింపును సొంతం చేసుకున్నారు. ఇక ఈ సినిమా తర్వాత కొరటాల శివ (Koratala Siva) దర్శకత్వంలో దేవర(Devara ) సినిమా చేశారు ఎన్టీఆర్. ఈ సినిమా మిక్స్డ్ టాక్ తెచ్చుకుంది . అయినా సరే ఫుల్ రన్ ముగిసే సరికి రూ. 600 కోట్ల క్లబ్లో చేరిపోయింది. దీంతో అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఇదిలా ఉండగా దేవర సినిమా సమయంలోనే సీక్వెల్ కూడా ఉంటుందని మేకర్స్ ప్రకటించడంతో అందరూ తలలు పట్టుకున్నారు. ఇలాంటి సినిమా మళ్ళీ అవసరమా? ఎవరు చూస్తారు? అంటూ కామెంట్ చేశారు. కానీ కొరటాల శివ మాత్రం పుష్ప 2 రేంజ్ లో సినిమాను తెరకెక్కిస్తామని, మాస్ ,యాక్షన్ పర్ఫామెన్స్ తో ఈసారి ఊహించని కథతో మీ ముందుకు రాబోతున్నారని వార్తలు వినిపించాయి. మరికొంతమంది ఇక ఈ సినిమాకి సీక్వెల్ తీయడం అనవసరమని భావిస్తున్నారు మేకర్స్ అని కూడా అనుకున్నారు. ఇలా పలు అనుమానాల మధ్య తాజాగా ఈ సినిమా సీక్వెల్ ఉంటుందని.. జూలైలో మొదటి షెడ్యూల్ ప్రారంభం కాబోతోందని సమాచారం. ఇక ప్రస్తుతం ఈ విషయం తెలిసి ఒక వర్గం అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
సీక్వెల్ తోనైనా కొరటాల శివ కంబ్యాక్ అవుతారా..?
మరి కొరటాల శివ నుండి రాబోయే దేవర 2 ఏ రేంజ్ లో ప్రేక్షకులను మెప్పిస్తుందో చూడాలి. ముఖ్యంగా పుష్ప 2 రేంజ్ లో సినిమా ఉంటుందని కామెంట్లు చేస్తున్న నేపథ్యంలో కొరటాల శివ ఈ సినిమా కోసం ఇంకా ఎంత ఎఫర్ట్ పెట్టాలో అర్థమవుతోంది. గతంలో వరుస సినిమాలతో భారీ విషయాన్ని అందుకున్న కొరటాల శివ.. ‘ఆచార్య’ తర్వాత పెద్దగా కలిసి రావడం లేదు. ఆయన తెరకెక్కిస్తున్న ప్రతి చిత్రం కూడా హిట్ టాక్ తెచ్చుకోలేకపోతోంది. ఇలాంటి సమయంలో సీక్వెల్ తో రిస్క్ చేస్తున్నారేమో అని నెటిజన్స్ కూడా కామెంట్లు చేస్తున్నారు. మొత్తానికైతే దేవర 2 జూలైలో ప్రారంభం కాబోతోందని చెప్పవచ్చు.
Vijay Sethupathi: సినీ కార్మికుల కోసం హీరో పెద్ద మనసు.. భారీ విరాళం..!