BigTV English

Burger King: ‘అయ్యో సగం తినేశానే’.. చికెన్ బర్గర్ లో పురుగు!

Burger King: ‘అయ్యో సగం తినేశానే’.. చికెన్ బర్గర్ లో పురుగు!

Burger King: ముంబైకి చెందిన ఫుడ్ వ్లాగర్ అన్షికా ఇటీవల తన ఇన్స్‌టా గ్రామ్ లో ఒక వీడియో షేర్ చేశారు. ఆ వీడియోకు విపరీతమైన వ్యూస్ వస్తున్నాయి. ఈ వీడియోలో ఆమె ఒక బర్గర్ కింగ్ అవుట్ లెట్ నుంచి ఒక చికెన్ బర్గర్ ఆర్డర్ చేస్తే.. ఆ బర్గర్ లో ఒక పురుగు ఉన్నట్లు తెలిపింది. పైగా తాను బర్గర్ ను సగం తినేనినట్లు అంగీకరించింది.


బర్గర్ తినే సమయంలో అనుకోకుండా ఆమె చూపు బర్గర్ లో ఏదో నల్లగా ఉన్నదానిపై పడిందని.. దగ్గరగా చస్తే అదో పెద్ద పురుగులా కనిపించదని చెప్పింది. అది చూసిన వెంటనే తనకు వాంతులు చేసే ఫీలింగ్ కలిగిందని తెలిపింది.

ఈ వీడియో షేర్ చేస్తూ ఆమె ఒక పోస్టు కూడా చేశారు. ”ఈ చికెన్ బర్గర్ ముంబైలోని ఒక అవుట్ లెట్ నుంచి ఆర్డర్ చేశాను. బర్గర్ కింగ్ లాంటి పెద్ద కంపెనీలో పరిశుభ్రతను పట్టించుకోకపోతే.. మేము ఎవరిని నమ్మాలి. ఇలా జరిగితే మాకు పెద్ద బ్రాండ్స్ పై కూడా నమ్మకం పోతుంది.” అని రాసింది.


Also Read: ‘కలియుగం.. ఆడవాళ్లు ఇలా కూడా చేస్తున్నారు’.. పాకిస్తాన్ లో డివోర్స్ పార్టీపై ట్రోలింగ్

జూలై 21, 2024న తాను ఈ వీడియో సోషల్ మీడియాలో షేర్ చేస్తే.. ఇప్పటిరకు దానికి 12 లక్షలకు పైగా వ్యూస్ వచ్చాయి.

ఇలాంటి అనుభవమే మరొక ఇన్స్‌టా గ్రామ్ యూజర్‌కి కూడా ఇటీవలే ఎదురైంది.. ఆ యూజర్ తన బర్గర్ కింగ్ ఆర్డర్ లో సజీవంగా ఉన్న కాక్ రోచ్ ఉందని పోస్ట్ పెట్టాడు.

సోషల్ మీడియాలో ఈ వీడియోలకు ఫన్నీ కామెంట్స్ వస్తున్నాయి. ఒకరేమో ‘ఈ అమ్మాయి తప్పకుండా క్లాస్ లీడర్ అయి ఉంటుంది,’ అని రాస్తే.. మరొకరు ‘బర్గర్ కింగ్ కాదు ఇన్ సెక్ట్ కింగ్’ అని రాశారు. మరో యూజర్ అయితే ‘చైనా వాళ్లు బర్గర్ తోపాటు పురుగు ఫ్రీగా వచ్చిందని సంతోషపడతారు’ అని రాశారు. ఇంకో యూజర్.. ‘ఏం పర్లేదు.. పురుగు కుడి పక్క ఉంది కదా.. ఎడమ వైపు నుంచి తినేయ్’ అని రాశాడు.

Also Read: నీటిపై తేలియాడుతూ ఎప్పుడైనా డిన్నర్ చేశారా?.. ప్రపంచంలో టాప్ టెన్ ఫ్లోటింగ్ రెస్టారెంట్స్ ఇవే..

Related News

NTR: సారీ నన్ను క్షమించండి.. ఈవెంట్ తర్వాత ఎన్టీఆర్ స్పెషల్ వీడియో

Mother’s Love: అమ్మకు ప్రేమతో.. హ్యాపీ మదర్స్ డే..!

Cm Revanth Reddy: నేడు పాల‌మూరుకు సీఎం.. రూ.110 కోట్ల‌తో ఎలివేటెడ్ కారిడార్ రోడ్డుకు శంకుస్థాప‌న‌!

Pawan Kalyan: ఇష్టం వ‌చ్చిన‌ట్టు మాట్లాడితే తొక్కిప‌ట్టి నార‌ తీస్తాం.. రోజా, కోడాలికి ప‌వ‌న్ స్ట్రాంగ్ వార్నింగ్!

Chadrababu Naidu vs YS Jagan: తిరుమల డిక్లరేషన్ రగడ.. గెలిచిందెవరు?

Chiranjeevi: చిరు చేసిన పనికి గుండె ఆగిపోయినంత పనైంది- తెలుగు హీరోయిన్..!

Big Stories

×