
Jabardasth Rakesh : జబర్దస్త్ .. పదేళ్లుగా ఫ్లాప్ అనేది లేకుండా ప్రేక్షకులను నవ్విస్తూ దూసుకెళ్తోన్న కామెడీ షో. ఈ కామెడీ షో ఎంతోమంది ఆర్టిస్టులకు జీవితాన్నిచ్చింది. అలాంటివారిలో రాకేష్ కూడా ఒకడు. మెజీషియన్, మిమిక్రీ ఆర్టిస్ట్ గా కెరియర్ మొదలుపెట్టిన రాకేష్.. జబర్దస్త్ లో చేరాక రాకింగ్ రాకేష్ గా మారాడు. చిన్నపిల్లలతో స్కిట్స్ చేస్తూ అందరినీ మెప్పించి బయటికెళ్లాడు. కొన్ని సినిమాల్లో కమెడియన్ గా నటించిన రాకేష్.. ఇటీవల నిర్మాతగా.. మెయిన్ లీడ్ లో ఒక సినిమా చేశాడు.
“గరుడవేగ” అంజి దర్శకత్వంలో రాకింగ్ రాకేష్ మెయిన్ లీడ్ గా కేసీఆర్ (కేశవ్ చంద్ర రమావత్) అనే సినిమాను ప్రకటించారు. ఈ సినిమా పోస్టర్ ను మంత్రి మల్లారెడ్డి చేతులమీదుగా లాంచ్ చేయించారు. అయితే ఈ పోస్టర్ ను చూస్తే తెలంగాణ సీఎం కేసీఆర్ లాగే ఉండటంతో.. వైరల్ అయింది. తెలంగాణ ఎన్నికల సమయానికంటే ముందే.. నవంబర్ చివరిలో సినిమా విడుదలకు ప్లాన్ చేశారు. ఫస్ట్ కాపీ రెడీ అయి.. సెన్సార్ కూడా పూర్తయింది. కానీ.. ఇంతలోనే ఎలక్షన్ కమిషన్ రాకేష్ కు ఊహించని షాకిచ్చింది.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు పూర్తయ్యేంతవరకూ రాకేష్ నిర్మించిన కేసీఆర్ (కేశవ్ చంద్ర రమావత్)సినిమాను విడుదల చేయవద్దని నోటీసులు పంపింది. ఈ సినిమాకు కేసీఆర్ అని పేరు పెట్టడం, పాలిటిక్స్ మీదే సినిమా ఉంటుందని తెలియడంతో.. ఎలక్షన్ కమిషన్ రాకేష్ సినిమా విడుదలను వాయిదా వేయాలని నోటీసులు జారీ చేసింది. ఈ విషయాన్ని రాకేష్.. తన సోషల్ మీడియా అకౌంట్ ద్వారా లైవ్ లోకి వచ్చి వెల్లడించాడు. తానొకటి తలిస్తే.. దైవం మరొకటి తలిచిందన్నాడు.
రాకేష్ తన ఇల్లు తాకట్టు పెట్టి మరీ ఈ సినిమాను నిర్మించినట్లు చెప్పాడు. తన భార్య సుజాత కూడా తను దాచుకున్న డబ్బుని సినిమాకోసం ఇచ్చేసిందని, దీనిపైనే తన జీవితం ఆధారపడి ఉందని ఓ ఇంటర్వ్యూలో ఎమోషనల్ అయ్యాడు. ఎన్నికలు పూర్తయ్యాక సినిమా రిలీజ్ కు కొత్తడేట్ ప్రకటిస్తానని రాకేష్ తెలిపాడు.
https://www.instagram.com/tv/Czljymexp1V/?igshid=MzRlODBiNWFlZA==