
IND vs AUS Final : వన్డే వరల్డ్ కప్ 2023 సెమీఫైనల్ మ్యాచ్ లో ఆ అంపైర్ లేడని అంతా సంకలు గుద్దుకున్నారు. అందుకు తగినట్టుగానే కివీస్ తో జరిగిన మ్యాచ్ లో ఇండియా గెలిచింది…ఆ అంపైర్ లేకపోవడం కూడా ఒక కారణమేనని అనుకున్నారు.
కానీ ఆ ఆనందం ఎంతో సేపు నిలవ లేదు…ఎక్కడికి రాకూడదని అనుకున్నారో మళ్లీ అక్కడికే వచ్చాడు. రేపు జరగబోయే ఫైనల్ మ్యాచ్ కి ఇండియన్స్ పాలిట ఐరన్ లెగ్ అంపైర్ గా బిరుదు అందుకున్న రిచర్డ్ కెటిల్‌బరో వచ్చేశాడు. ఇంగ్లండ్ కి చెందిన రిచర్డ్ ఐసీసీ అంపైర్ల ప్యానల్ లో కీలక సభ్యునిగా ఉన్నాడు.
అందుకే ప్రతిష్టాత్మక ఐసీసీ ట్రోఫీ ఫైనల్స్ మ్యాచ్ అఫీషియల్స్ జాబితాలో ప్రతిసారి రిచర్డ్ కి చోటు దక్కుతోంది. ఐసీసీకి అతని అంపైరింగ్ పై అంత నమ్మకం. అందుకే అతన్ని పంపిస్తుంటారు. అందువల్ల తను వస్తున్నాడు గానీ, తను రావడం వల్ల ఇండియా ఓడిపోతుందని చెప్పడం కరెక్టు కాదని కొందరంటున్నారు.
రేపు భవిష్యత్తులో జరగబోయే ఐసీసీ నిర్వహించే ఏ మెగా టోర్నమెంట్లలోనైనా కీలక మ్యాచ్ లకు రిచర్డ్ వస్తాడు. ఇందులో తిరుగులేదు. దానికేమంటారని ప్రశ్నిస్తున్నారు. ఆడలేక మద్దెల దరువు అంటే ఇదేనని చెబుతున్నారు.
టీమ్ ఇండియా సరిగ్గా ఆడకపోతే , అంపైర్ మాత్రం ఏం చేస్తాడు? కాకపోతే అతను తీసుకున్న తప్పుడు నిర్ణయాల వల్ల ఇండియా ఓటమి పాలైతే అప్పుడు నిందించవచ్చు గానీ, అతన్ని అకారణంగా నిందించడం తగదని చెబుతున్నారు.
ఇప్పటికైనా ఈ మూఢనమ్మకాలను వదలమని చెబుతున్నారు.
పోనీ ఏ అంపైర్ లెగ్ బాగుంటే అతన్ని తీసుకొస్తే ,ఇండియా గెలిచేస్తుందా? అని కూడా రివర్స్ పంచ్ లు ఇస్తున్నారు.
ఇప్పుడు ఇండియా పదికి పది గెలిచింది. ఏ సెంటిమెంట్ తో గెలిచింది. కష్టపడింది. అందరూ బాగా ఆడుతున్నారు కాబట్టి గెలిచింది కానీ అంపైర్ల వల్ల కాదని గుర్తు చేస్తున్నారు. కొంచెం ఇలాంటి మూఢనమ్మకాల ప్రచారాన్ని తిప్పి కొట్టాల్సిన అవసరం మీడియాకి ఎంతైనా ఉందని అంటున్నారు.
Yuvraj Singh : ప్లేయర్ ఆఫ్ ది టోర్నీ అతనే: యూవీ