BigTV English

Emergency : ఆ సీన్లు కట్ చేస్తేనే ‘ఎమర్జెన్సీ’కి సెన్సార్ సర్టిఫికెట్… కంగనాకు ఎదురు దెబ్బ

Emergency : ఆ సీన్లు కట్ చేస్తేనే ‘ఎమర్జెన్సీ’కి సెన్సార్ సర్టిఫికెట్… కంగనాకు ఎదురు దెబ్బ

Emergency : మాజీ ప్రధాని ఇందిరా గాంధీ జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కిన బాలీవుడ్ చిత్రం ‘ఎమర్జెన్సీ’ విడుదల పెద్ద సవాల్ గా మారింది. ఎప్పుడో రిలీజ్ కావాల్సిన ఈ సినిమా పలు వివాదాల కారణంగా ఇంకా థియేటర్లలోకి రాలేదు. సెన్సార్ బోర్డ్ సర్టిఫికెట్ జారీ చేయకపోవడంతో దీనికి నిర్మాతగా ఉన్న కంగనా కోర్టు మెట్లు ఎక్కింది. అయితే తాజాగా సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ సినిమాలో కొన్ని మార్పులు చేర్పులు చేస్తేనే సెన్సార్ సర్టిఫికెట్ ను జారీ చేస్తామని కోర్టుకు తెలిపింది.


వివాదం ఏంటంటే?

బాలీవుడ్ నటి కంగనా రనౌత్ ఇటీవల జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ తరపున గెలుపొందారు. ప్రస్తుతం ఎంపీగా ఉన్న ఆమె ఎన్నికల కంటే ముందే ‘ఎమర్జెన్సీ’ చిత్రాన్ని నిర్మించి, దర్శకత్వం వహించారు. అందులో ప్రధాన పాత్రను పోషించారు. ‘ఎమర్జెన్సీ’ని సెప్టెంబరు 6న విడుదల చేయడానికి ప్లాన్ చేశారు. సర్టిఫికేషన్ విషయంలో CBFCతో కొనసాగుతున్న వివాదాల కారణంగా ఈ చిత్రం ఆలస్యమైంది. కంగనా రనౌత్ రానున్న హర్యానా ఎన్నికల నేపథ్యంలో సినిమా విడుదలను అడ్డుకునేందుకు CBFC ఉద్దేశపూర్వకంగా సెన్సార్ ప్రక్రియను నిలిపివేసిందని ఆరోపించారు. ‘ఎమర్జెన్సీ’ రిలీజ్ కు కొన్ని రోజుల ముందు మాజీ ప్రధాని ఇందిరాగాంధీ జీవితం ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమాపై సిక్కుల్లో తీవ్ర వ్యతిరేకత వచ్చింది. ముఖ్యంగా శిరోమణి అకాలీదళ్‌తో సహా సిక్కు సంస్థల నుండి ఈ చిత్రం తమ సమాజాన్ని తప్పుగా చిత్రీకరిస్తుందిని, చారిత్రక వాస్తవాలను వక్రీకరించిందనే ఆరోపణలు విన్పించాయి. దీంతో సెన్సార్ టీమ్ సినిమాపై అభ్యంతరాలను వ్యక్తం చేస్తూ సెన్సార్ సర్టిఫికెట్ ను ఆపేసింది. ఈ నేపథ్యంలోనే బాంబే హైకోర్టును ఆశ్రయించిన కంగనా టీం సినిమా విడుదల చేసేందుకు సెన్సార్ సర్టిఫికేట్‌ను కోరారు.


న్యాయస్థానం CBFCని వీలైనంత త్వరగా సర్టిఫికెట్ జారీ చేయాలని ఆదేశించింది. ఈ నేపథ్యంలోనే రివిజన్ కమిటీ ఇప్పుడు కొన్ని మార్పులను సూచించింది. తాజాగా సిక్కు గ్రూప్ అభ్యంతరం వ్యక్తం చేసిన సన్నివేశాలకు సంబంధించి సినిమాలో మొత్తం 13 మార్పులు చేస్తే బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ (CBFC) సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇస్తామని వెల్లడించింది. నిన్న (సెప్టెంబర్ 26) సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ బాంబే హైకోర్టుకు ఇచ్చిన వివరణలో చిత్రం నుండి కొన్ని సన్నివేశాలను తొలగించాలని సిఫార్సు చేసింది. ఈ కేసులో జీ ఎంటర్‌టైన్‌మెంట్ తరఫు న్యాయవాది మాట్లాడుతూ సినిమా నుంచి తొలగించాలని సూచించిన సన్నివేశాలను తొలగించాలా వద్దా అనే దానిపై ఆదేశాలు రావడానికి సమయం అవసరమన్నారు. దీనిని అంగీకరిస్తూ న్యాయమూర్తులు పిపి కొలబావాలా, ఫిర్దోష్ పి పూనివాలాతో కూడిన ధర్మాసనం కేసు విచారణను సెప్టెంబర్ 30కి వాయిదా వేసింది.

ఆ మార్పులు చేస్తేనే సినిమా రిలీజ్ 

సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ సూచించిన 13 మార్పులలో ఇద్దరు అగ్ర రాజకీయ నాయకుల మధ్య జరిగిన సంభాషణ నుండి ఇసుక, భింద్రన్‌వాలే పదాలను తొలగించడం, భింద్రన్‌వాలేను ప్రశంసిస్తూ ఒక పదబంధాన్ని తొలగించడం, కొన్ని సన్నివేశాలు, డైలాగ్‌లను తొలగించడం వంటి 6 మార్పులు ఉన్నాయి. అలాగే 4 సీన్లకు కత్తెర వేయనున్నారు. ‘ఖలిస్తాన్’ అనే ఉపశీర్షికను తొలగించి, సిక్కులను చిత్రీకరించే కొన్ని సన్నివేశాలను తగ్గించి, సన్నివేశాలు, డైలాగ్‌లలో 3 మార్పులు చేయాలని సెన్సార్ బోర్డు మేకర్స్‌ను కోరింది.

Related News

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Ali Wife : కొత్త బిజినెస్ మొదలుపెట్టిన అలీ వైఫ్ జుబేదా…మీ సపోర్ట్ కావాలంటూ?

Big Stories

×