Empuraan: మోహన్‌లాల్ హీరోగా, పృథ్వీరాజ్ సుకుమారన్ ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తూ డైరెక్ట్ చేసిన సినిమా ‘L2: ఎంపురాన్’. ఆరేళ్ల క్రితం వచ్చిన సూపర్ హిట్ లూసిఫర్ సినిమాకి సీక్వెల్ గా తెరకెక్కిన ఈ మూవీ 2025 మార్చి 27న భారీ అంచనాల మధ్య విడుదలైంది. లూసిఫర్ సినిమాని మలయాళ ఫిల్మ్ ఇండస్ట్రీ వరకే పరిమితం చేసిన మోహన్ లాల్, పృథ్విరాజ్… ఎంపురాన్ సినిమాని మాత్రం పాన్ ఇండియా బాక్సాఫీస్ టార్గెట్ గా రిలీజ్ చేసారు.
హైలైట్స్:
ప్రేక్షకుల స్పందన:
సినిమా విడుదలైన తర్వాత ప్రేక్షకుల నుండి మిశ్రమ స్పందన వచ్చింది. కొంతమంది సినిమా కథనాన్ని, మోహన్‌లాల్ నటనను ప్రశంసిస్తుండగా, మరికొందరు సినిమా నిడివి, లాగ్ ఉంది అంటూ విమర్శలు చేస్తున్నారు. అయితే, భారీ యాక్షన్, పొలిటికల్ థ్రిల్లర్ నేపథ్యంలో సినిమా ఆసక్తికరంగా ఉందని మలయాళ ప్రేక్షకులు, మోహన్‌లాల్ అభిమానులు సోషల్ మీడియాలో ప్రశంసలు కురిపిస్తున్నారు.
కలెక్షన్స్:
‘L2: ఎంపురాన్’ సినిమా పృథ్వీరాజ్ సుకుమారన్ దర్శకత్వంలో, మోహన్‌లాల్ నటనతో, ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. కానీ, వివాదాలు మరియు మిశ్రమ స్పందనలు ఉన్నప్పటికీ, సినిమా బాక్సాఫీస్ దగ్గర మలయాళ ఫిల్మ్ ఇండస్ట్రీలో ముందున్న ఓపెనింగ్ రికార్డ్స్ అన్నింటినీ బ్రేక్ చేస్తోంది.ప్రీబుకింగ్స్ తోనే 50 కోట్ల మార్క్ ని చేరిన ఎంపురాన్ సినిమా డే 1 వరల్డ్ వైడ్ రికార్డ్ బ్రేకింగ్ గ్రాస్ ని కలెక్ట్ చేసింది. రీజనల్ బ్రేక్ డౌన్ తీస్తే ఓవరాల్ ఇండియాలో 22 కోట్ల నెట్ కలెక్ట్ చేసిన ఈ సినిమా మలయాళంలో రూ. 19 కోట్లు, తెలుగులో రూ. 1.2 కోట్లు, తమిళంలో రూ. 80 లక్షలు, హిందీలో రూ. 50 లక్షలు, కన్నడలో కేవలం రూ. 5 లక్షలు వసూలు చేసింది. వీకెండ్, ఉగాది ఫెస్టివల్, రంజాన్ పండగలు ఉన్నాయి కాబట్టి బాక్సాఫీస్ దగ్గర ఇదే జోష్ కొనసాగితే ఎంపురాన్ సినిమా మండేకి వంద కోట్లకి పైగా కలెక్ట్ చేయడం గ్యారెంటీ. ఇదే జరిగితే దాదాపు 60%-70% బిజినెస్ ని ఎంపురాన్ సినిమా రిటర్న్ రాబట్టినట్లే. మోహన్ లాల్ కెరీర్ లోనే కాకుండా మొత్తం మలయాళ ఫిల్మ్ ఇండస్ట్రీ హిట్ గా ఎంపురాన్ నిలిచే అవకాశం ఉంది.