Empuraan Day 1 Collections : ఈ మధ్య మలయాళ ఇండస్ట్రీకి లక్కీ టైం మొదలైంది. ఇండస్ట్రీ నుంచి ఎటువంటి సినిమా వచ్చిన సరే బాక్సాఫీస్ వద్ద ప్రభంజనాన్ని సృష్టిస్తున్నాయి. కేవలం మౌత్ నాకు మాత్రమే కాదు అటు కలెక్షన్స్ కూడా సునామీ సృష్టించేలా వసూలు చేస్తున్నాయి. తాజాగా ఆ లిస్టులోకి మరో మూవీ వచ్చి చేరింది. మలయాళం స్టార్ హీరో మోహన్ లాల్ నటించిన లేటెస్ట్ మూవీ L2 : ఎంపురాన్.. 2019 రిలీజ్ అయ్యి బాక్సాఫీస్ ను షేక్ చేసిన మోహన్ లాల్ సూపర్ హిట్ మూవీ లూసీఫర్ చిత్రానికి సీక్వెల్ ఈ మూవీ వచ్చింది. నిన్న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో రిలీజ్ అయిన ఈ మూవీ మొదటి రోజు రికార్డు స్థాయిలో కలెక్షన్స్ ని వసూలు చేసింది. గతంలో ఎన్నడు లేని విధంగా మోహన్ లాల్ సినిమాకు కలెక్షన్స్ రావడం విశేషం. మరి మొదటి రోజు ఎన్ని కోట్లను వసూలు చేసిందో ఒకసారి మనం తెలుసుకుందాం..
ఎంపురాన్ ఫస్ట్ డే కలెక్షన్స్..
మోహన్‌లాల్ హీరోగా పృథ్వీరాజ్ సుకుమార్ దర్శకత్వం వహిస్తూ నటించిన మూవీ `ఎల్ 2 ఎంపురాన్`. ఈ చిత్రం గురువారం విడుదలైంది.. భారీ అంచనాలతో రిలీజ్ అయిన ఈ మూవీ బాక్స్ ఆఫీస్ వద్ద ఊచకోత మొదలుపెట్టింది. గతంలో వచ్చిన లూసీఫర్ మూవీ తో పోలిస్తే ఈ చిత్రానికి కలెక్షన్స్ ఎక్కువగానే రాబట్టింది. ఎంపురాన్ డే1 వరల్డ్ వైడ్ గా రూ.58 కోట్ల గ్రాస్ అందుకుందని తెలుస్తోంది. కేవలం ఇండియాలోనే రూ.22 కోట్ల నెట్ వసూల్ చేసి ఆశ్చర్యపరించింది. ఇందులో మలయాళం స్టేట్ లో రూ.19.45 కోట్ల నెట్, తెలుగులో రూ.1.2 కోట్లు, తమిళంలో రూ.8 లక్షలు, హిందీలో రూ.5 లక్షలు, కేరళలో రూ.5 లక్షలు వరకు వసూల్ చేసింది. అంటే ఓవరాల్ గా మొదటి రోజు 25 కోట్ల వరకు కలెక్షన్స్ ను రాబట్టిందని తెలుస్తుంది. రెండో రోజు కూడా ఓపెనింగ్ భారీగానే జరిగినట్లు తెలుస్తుంది ఇక ఈ వీకెండ్ ఈ సినిమాకి 100 కోట్లు వచ్చిన ఆశ్చర్యపోనవసరం లేదని ట్రేడ్ పంతులు అంచనా వేస్తున్నారు.
Also Read : కాస్టింగ్ కౌచ్ పై మొదటిసారి స్పందించిన కల్పిక.. సూసైడ్ చేసుకోవాలకున్న..
ఈ మూవీ స్టోరీ విషయానికొస్తే..
శ్రీ గోకుళమ్ మూవీస్, ఆశీర్వాద్ సినిమాస్ ప్రైవేట్ లిమిటెడ్, లైకా ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మించాయి. లూసీఫర్ 2 : ఎంపురాన్ చిత్రానికి 150 కోట్ల బడ్జెట్ వెచ్చించారు. ఎంపురాన్ ప్రపంచ వ్యాప్తంగా రూ.100 కోట్ల ప్రీ రిలీజ్ థియేట్రికల్ బిజినెస్ జరిగింది. టొవినో థామస్, మంజూ వారియర్, అభిమన్యు సింగ్, సాయి కుమార్, సూరాజ్ వెంజరాముడు, ఫాజిల్, సచిన్ ఖేడ్కర్, సానియా అయ్యప్పన్, గేమ్ ఆఫ్ థ్రోన్స్ ఫేమ్ జెరోమ్ ఫ్లిన్ కీలక పాత్రలు పోషించారు.. స్టోరీ కొత్తగా ఆకట్టుకోవడంతో ప్రేక్షకులకు చిత్రం బాగా నచ్చేసింది. ఆరేళ్ల క్రితం వచ్చిన లూసిఫర్ మూవీకి కంటిన్యూగా దీన్ని తెరకెక్కించారు పృథ్వీరాజ్ సుకుమారన్. పీఆకేఆర్ వారసత్వంగా వచ్చిన జితిన్ తప్పుదారి పట్టడం, రాష్ట్రాన్ని అవినీతి మయంగా చేసి తాను స్వలాభం పొందే ప్రయత్నం చేయగా దాన్ని లూసిఫర్, ప్రియదర్శిని రామ్ దాస్ ఎలా ఎదుర్కొన్నారనేది మూవీ స్టోరీ.. మొత్తం దేశంలో జరిగిన కొన్ని పరిస్థితులను చూపించారు. మోహన్ లాల్ నటిస్తున్న చిత్రాలు ఇటీవల కమర్షియల్ హిట్ అవుతున్నాయి..