Dragon Fruit: డ్రాగన్ ఫ్రూట్‌లో అనేక పోషకాలు ఉంటాయి. డ్రాగన్ ఫ్రూట్ తినడం వల్ల కొన్ని రకాల ఆరోగ్య సమస్యలు రాకుండా ఉంటాయి. వీటిలో యాంటీ ఆక్సిడెంట్లు, ఫైబర్స్ , విటమిన్ సి ఉంటాయి. ఇవి రోగనిరోధక శక్తిని బలపరుస్తాయి. అంతే కాకుండా జీర్ణ సంబంధిత సమస్యలు రాకుండా చేస్తాయి.
డ్రాగన్ ఫ్రూట్స్ దక్షిణ అమెరికాలో ఎక్కువగా పండిస్తారు. దీని శాస్త్రీయ నామం హైలోసెరియస్ ఉండటస్. ఇది కాక్టేసి కుటుంబానికి చెందినది. డ్రాగన్ ఫ్రూట్‌లో బీటా కెరోటిన్, లైకోపీన్ వంటి పోషకాలు కూడా ఉంటాయి. కెరోటినాయిడ్లు అధికంగా ఉండే డ్రాగన్ ఫ్రూట్ తినడం వల్ల క్యాన్సర్ , గుండె జబ్బుల ప్రమాదం తగ్గుతుంది. మీ శరీరంలో ఐరన్ లోపం ఉన్న వారు డ్రాగన్ ఫ్రూట్ తినడం వల్ల అద్భుత ప్రయోజనాలు ఉంటాయి. మరి డ్రాగన్ ఫ్రూట్ శరీరానికి ఎలా ఉపయోగపడుతుందో ఇప్పుడు తెలుసుకుందాం.
మధుమేహg తగ్గుతుంది:
డ్రాగన్ ఫ్రూట్‌లో ఫ్లేవనాయిడ్స్, ఫినోలిక్ ఆమ్లాలు, ఆస్కార్బిక్ ఆమ్లం, ఫైబర్ ఉంటాయి. వీటితో పాటు సహజ యాంటీఆక్సిడెంట్ లక్షణాలు కూడా ఎక్కువగా ఉంటాయి. ఇవి రక్తంలో చక్కెర స్థాయిని నియంత్రించడంలో సహాయపడతాయి. అంతే కాకుండా భవిష్యత్తులో డయాబెటిస్ రాకుండా ఉండాలంటే.. డ్రాగన్ ఫ్రూట్ తప్పకుండా తినాలి.
గుండెకు మేలు చేస్తుంది:
డ్రాగన్ ఫ్రూట్‌లో ఉండే చిన్న నల్లటి విత్తనాలు ఒమేగా-3, ఒమేగా-9 కొవ్వు ఆమ్లాలకు మంచి మూలం. ఇవి గుండెను ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడతాయి. అంతే కాకుండా గుండె సంబంధిత సమస్యలను తగ్గించడంలో కూడా చాలా బాగా ఉపయోగపడతాయి.
కొలెస్ట్రాల్‌ను నియంత్రిస్తుంది:
డ్రాగన్ ఫ్రూట్ శరీరంలో ట్రైగ్లిజరైడ్స్, తక్కువ సాంద్రత కలిగిన లిపోప్రొటీన్ కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తుంది. అంతే కాకుండా ఇది మంచి కొలెస్ట్రాల్‌ను పెంచడంలో కూడా సహాయపడుతుంది.
జీర్ణ సంబంధిత సమస్యలు:
డ్రాగన్ ఫ్రూట్ జీర్ణక్రియను ఆరోగ్యంగా ఉంచుతుంది. ఇది కడుపు, ప్రేగులలో మంచి మైక్రోబయోమ్‌ను ప్రోత్సహిస్తుంది. అంతే కాకుండా జీర్ణ సంబంధిత సమస్యలు రాకుండా చేస్తుంది. ప్రేగులను ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడుతుంది. డ్రాగన్ ఫ్రూట్‌లో ఫైబర్ , అనేక విటమిన్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి మలబద్దకం సమస్యలు రాకుండా చేస్తాయి.
ఆర్థరైటిస్‌కు మేలు:
డ్రాగన్ ఫ్రూట్‌లో యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి ఆర్థరైటిస్ నుండి ఉపశమనం పొందడంలో సహాయపడతాయి.
రోగనిరోధక శక్తిని పెంచుతుంది:
రోగనిరోధక శక్తిని పెంచడంలో డ్రాగన్ ఫ్రూట్ చాలా సహాయపడుతుంది. డ్రాగన్ ఫ్రూట్‌లో ఉండే విటమిన్ సి రోగనిరోధక శక్తిని బలపరుస్తుంది. దీనితో శరీరాన్ని అనేక రకాల వ్యాధుల నుండి రక్షించుకోవచ్చు.
ఎముకలు, దంతాలకు మేలు:
డ్రాగన్ ఫ్రూట్ ఎముకలు, దంతాలను బలపరుస్తుంది. ఇది కాల్షియం , భాస్వరం యొక్క మంచి మూలం. డ్రాగన్ ఫ్రూట్ తరచుగా తినడం వల్ల ఎముకలు, పళ్లకు ప్రయోజనకరంగా ఉంటుంది. డ్రాగన్ ఫ్రూట్‌లో ఉండే మెగ్నీషియం ఎముకలు ,దంతాలకు కూడా మేలు చేస్తుంది.
Also Read: జుట్టు పెరగాలంటే.. ఈ ఒక్కటి వాడితే చాలు !
ఆస్తమా తగ్గుతుంది:
ఆస్తమా ఉన్న వారు కూడా డ్రాగన్ ఫ్రూట్ తినవచ్చు. డ్రాగన్ ఫ్రూట్ ని క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల ఆస్తమా , దగ్గు నుండి ఉపశమనం లభిస్తుందని ఒక పరిశోధనలో తేలింది.