Ester Noronha: ఎస్తర్ నోరోన్హా గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. వెయ్యి అబద్దాలు అనే సినిమాతో ఆమె హీరోయిన్ గా తెలుగుతెరకు ఎంట్రీ ఇచ్చింది. మెగా బ్రదర్ నాగబాబు, పూరి జగన్నాథ్ తమ్ముడు సాయిరామ్ శంకర్ హీరోలుగా నటించిన ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. ఇక ఈ సినిమా తరువాత ఎస్తర్ మంచి హీరోయిన్ గా ఎదుగుతుంది అనుకున్నారు. కానీ, అవకాశాలు రాకనో.. లేక వేరే ఏం జరిగిందో తెలియదు కానీ.. హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన ఆమె సపోర్టివ్ రోల్స్ చేయడం మొదలుపెట్టింది. ఇక కెరీర్ పీక్స్ లో ఉన్నప్పుడే ఎస్తర్.. సింగర్ నోయల్ ను వివాహం చేసుకుంది.
పెళ్లి తరువాత ఎస్తర్.. గృహిణిగా సెటిల్ అవుతుంది అనుకున్నారు. అది కూడా జరగలేదు. ఎవరైనా పెళ్లి అయ్యి కొన్నేళ్లు అన్యోన్యంగా ఉండి.. ఆ తరువాత విభేదాలతో విడాకులు తీసుకుంటారు. కానీ, ఎస్తర్ మాత్రం పెళ్లి అయిన నెల లోపే.. నోయల్ తో విడిపోయి సంచలనం సృష్టించింది. అయిది లవ్ మ్యారేజ్ చేసుకున్న ఈ జంట నెలలోపు ఎలా విడిపోయారు అని అందరూ ఆశ్చర్యపోయారు. కానీ, తమది లవ్ మ్యారేజ్ కాదని, నోయల్ అసలు స్వరూపం పెళ్ళైన తరువాత తెల్సింది అని ఎస్తర్ ఒక ఇంటర్వ్యూలో చెప్పుకోచ్చింది.
ప్రస్తుతం ఎస్తర్ సింగిల్ గానే ఉంటుంది. టాలీవుడ్ లో ఎలాంటి పాత్రలో అయినా ఆమె నటించడానికి సిద్దమయ్యింది.చాలా సినిమాల్లో బోల్డ్ క్యారెక్టర్స్ లో నటించింది. ఇక నిత్యం ఏదో ఒక ఇంటర్వ్యూ లో కనిపిస్తూ నోయల్ గురించి మాట్లాడుతూ ఉంటుంది. అయితే నోయల్ మాత్రం.. ఆమె గురించి మాట్లాడడం తనకు ఇష్టం లేదని, ఆమె ఫేమస్ అవ్వడానికి తన గురించి నీచంగా మాట్లాడుతుందని చెప్పుకొచ్చాడు. ఇక తెలుగు, తమిళ్ భాషల్లో కొన్ని సినిమాలు చేస్తూ బిజీగా ఉన్న ఎస్తర్.. నిర్మాతగా కూడా మారింది. ది వాకెంట్ హౌస్ అనే పేరుతో ఎస్తర్ కన్నడలో ఒక సినిమా చేసింది. ఆ సినిమాకు ఆమెనే దర్శకత్వం వహించి నిర్మించింది. గతేడాది రిలీజ్ అయిన ఈ సినిమా ఎలాంటి రిజల్ట్ ను అందుకుందో ఎవరికీ తెలియదు.
ఇక తాజాగా ఒక ఇంటర్వ్యూలో ఎస్తర్ వేశ్యల గురించి మాట్లాడడం సంచలనం సృష్టిస్తోంది. మగాళ్లు లేకపోతే ఈ వేశ్య వృత్తి ఉండేది కాదని, ఇదంతా వాళ్లు సృష్టించిన ప్రపంచం అని చెప్పుకొచ్చింది. ” వేశ్యలను చులకనగా చూస్తూ ఉంటారు. వారు కూడా మనుషులే. ఇలాంటి వృత్తిలోకి రావాలని వారెవ్వరికీ ఉండదు. ఆర్థిక పరిస్థితులు వేరే దారిలేక వేశ్యా వృత్తిలోకి తీసుకొస్తాయి. సమాజంలో వారిపై నిందలు వేయమంటే.. వారిని చులకనగా చూడమంటే చూస్తారు. మగాళ్లు వేశ్యల దగ్గరకు వెళ్లి కామం తీర్చుకోకుండా డబ్బులు ఇచ్చి రండి.. చూద్దాం. అలా చేయరు. వారిలా ఆ వృత్తిలో ఉండి చూడండి.. ఆ బాధ తెలుస్తుంది. ఇలాంటి ఒక వృత్తి ఉంది అంటే.. అది వారిని కూడా వాడుకుంటున్నారని అర్ధం. అసలు మగాళ్లే కనుక వేశ్యల వద్దకు వెళ్లకపోతే ఇలాంటి వృత్తే ఉండేది కాదు. ఇలాంటి వేశ్యా వ్యవస్థను పెంచి పోషిస్తుంది మగాళ్లే. మళ్లీ వారిని చులకనగా చూసేది కూడా మగాళ్లే ” అని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి.