BigTV English

Puri- Sethupathi: బెగ్గర్ కాస్తా భిక్షాందేహి అయ్యిందే ?

Puri- Sethupathi: బెగ్గర్ కాస్తా భిక్షాందేహి అయ్యిందే  ?

Puri- Sethupathi: డేరింగ్ అండ్ డ్యా షింగ్ డైరెక్టర్  పూరి జగన్నాథ్ గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. బద్రి, పోకిరి, బిజినెస్ మేన్, కెమెరామెన్ గంగతో రాంబాబు లాంటి సినిమాలతో ఇండస్ట్రీని షేక్ చేసిన డైరెక్టర్ పూరి. అయితే కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు అన్నట్లు ఒకప్పుడు అంత మంచి మంచి హిట్స్ అందించిన ఈ డైరెక్టర్ ఇప్పుడు ఒక మంచి విజయం కోసం విశ్వ ప్రయత్నాలు చేస్తున్నాడు. ఎప్పటికప్పుడు పూరి పని అయిపోయింది అని అనుకున్న వారి చేతనే.. పూరి అంటే ఇది అని అనిపించుకోవడం అలవాటుగా మార్చుకున్నాడు.


 

ఇస్మార్ట్ శంకర్ లాంటి భారీ విజయం తర్వాత లైగర్ అంటూ ఒక సినిమా తీసి భారీ డిజాస్టర్ ను అందుకున్నాడు. ఆ డిజాస్టర్ నుంచి బయటపడడానికి డబుల్ ఇస్మార్ట్ అంటూ వచ్చి మరో భారీ పరాజయాన్ని చవి చూశాడు. ఇక ఇండస్ట్రీలో చాలామంది పూరికి కథల మీద పట్టు తగ్గిందని, ఇక అతను రిటైర్ అయితే మంచిదని చాలా విమర్శించారు. అయినా కూడా సినిమా తప్ప ఏమీ తెలియని పూరి ఎలాగైనా ఇందులోనే నిలబడాలి అని ఎట్టకేలకు ఒక సినిమాను పట్టాలెక్కించాడు.


 

కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ సేతుపతి హీరోగా పూరి ఒక సినిమాను అధికారికంగా ప్రకటించాడు. విజయ్ సేతుపతి హీరో అనగానే అసలు ఏ కథ చెప్పి పూరి.. అంత మంచి హీరోను ఒప్పించాడు అని అప్పట్లో చాలా మాటలు వినిపించాయి. కానీ,  పూరీ చెప్పిన విధానానికి విజయ్ సేతుపతి ఫ్లాట్ అయ్యాడని, అందుకే వెంటనే సినిమాను సెట్స్ మీదకు తీసుకువెళ్లాడని కోలీవుడ్ మీడియా చెప్పుకొచ్చింది. ఇక ఈ సినిమాను పూరి – ఛార్మి కలిసి పూరి కనెక్ట్ బ్యానర్ లో నిర్మిస్తున్నారు.  ఈసారి పూరి..ఈ సినిమాతో గట్టిగా కొట్టాలని చూస్తున్నాడు. అందుకే ఈ చిత్రంలో స్టార్ క్యాస్టింగ్ ను కూడా చాలా పకడ్బందీగా ప్లాన్ చేశాడు.

Samantha: నాగచైతన్యను జన్మలో కలవను.. ఏ ఈవెంట్ కు రాను ?

ఇక ఈ సినిమాలో కన్నడ నటుడు దునియా విజయ్, బాలీవుడ్ హాట్ బ్యూటీ టబు, టాలెంటెడ్ బ్యూటీ సంయుక్త మీనన్ కీలకపాత్రలో నటిస్తున్నట్లు పూరి అధికారికంగా ప్రకటించాడు. అయితే ఎప్పటినుంచో ఈ సినిమాకు బెగ్గర్ అనే టైటిల్ ను అనుకుంటున్నట్లు వార్తలు వినిపించాయి. ఈ సినిమా కథాంశం మొత్తం బెగ్గర్స్ చుట్టూనే తిరుగుతుందని తెలుస్తుంది. అందుకే సినిమాకు యాప్ట్ గా ఉంటుందని బెగ్గర్ అనే టైటిల్ ను ఖరారు చేసినట్లు ఇండస్ట్రీ వర్గాల్లో గుసగుసలు వచ్చాయి.

 

అయితే  ఇంగ్లీష్ టైటిల్ అయితే అటు కోలీవుడ్లో ఇటు టాలీవుడ్ లో మార్చాల్సి వస్తుందని, ఇది కాకుండా అన్ని భాషల్లో ఒకటే టైటిల్ ను పెడితే బాగటుందని విజయసేతుపతి సలహా ఇవ్వడంతో పూరి బెగ్గర్ టైటిల్ ని మార్చి భిక్షాందేహి అనే టైటిల్ ను ఖరారు చేసినట్లు తెలుస్తుంది. మొదట భవతీ భిక్షాందేహి అనే టైటిల్ ని అనుకున్నా అది కొంచెం లెంత్ ఎక్కువ అవుతుందని  కేవలం భిక్షాందేహి అని మాత్రమే ఫైనల్ చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. త్వరలోనే ఈ టైటిల్ ను పూరి అధికారికంగా ప్రకటించనున్నట్లు తెలుస్తుంది. ఏది ఏమైనా ఈ సినిమాపై పూరి బాగా ఫోకస్ చేశాడని సమాచారం. మరి ఈ సినిమాతో నైనా ఈ డేరింగ్ అండ్ డ్యాషింగ్ డైరెక్టర్ బౌన్స్ బ్యాక్ అవుతాడా లేదా అనేది తెలియాల్సి ఉంది.

Related News

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Ali Wife : కొత్త బిజినెస్ మొదలుపెట్టిన అలీ వైఫ్ జుబేదా…మీ సపోర్ట్ కావాలంటూ?

Big Stories

×