BigTV English

Euphoria Glimpse: డ్రగ్స్, రేప్స్.. యో గుణశేఖర్.. నువ్వేనా..

Euphoria Glimpse: డ్రగ్స్, రేప్స్.. యో గుణశేఖర్.. నువ్వేనా..

Euphoria Glimpse: గుణశేఖర్.. తెలుగు ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేని పేరు. ఇప్పటి జనరేషన్ కిడ్స్  గురించి పక్కన పెడితే.. అప్పట్లో  గుణశేఖర్ సినిమాలకు సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. చూడాలని ఉంది,  మనోహరం, ఒక్కడు, అర్జున్, వరుడు, రుద్రమదేవి.. ఇలాంటి సినిమాలను ఇండస్ట్రీకి అందించింది   గుణశేఖరే.  బడ్జెట్ అంటే ఇప్పుడు శంకర్ గుర్తొస్తున్నాడు కానీ, తెలుగులో బడ్జెట్ అంటే   గుణశేఖర్ మాత్రమే గుర్తొస్తాడు. ఆ సెట్స్,  విజువల్స్.. నెక్స్ట్ లెవెల్ అని చెప్పొచ్చు. ఇక గతేడాది శాకుంతలం అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన  గుణశేఖర్ భారీ పరాజయాన్ని అందుకున్నాడు.


సమంత హీరోయిన్ గా నటించిన ఈ సినిమాపై హైప్ వచ్చినా.. కథ, తీసిన విధానం ప్రేక్షకులను అంతగా మెప్పించలేకపోయింది. ఇక ఎప్పటిలా అయితే ఎదగలేము అనుకున్నాడో ఏమో కానీ,   గుణశేఖర్ తన ఫంథా మార్చాడు. ఈ జనరేషన్ కిడ్స్ ను దృష్టిలో పెట్టుకొని  యుఫోరియా అనే యూత్‌ఫుల్ సోషల్ డ్రామాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. విఘ్నేష్, లిఖిత, పృథ్వీ, శ్రీనిక ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రంలో సీనియర్ బ్యూటీ భూమిక కీలక పాత్రలో కనిపిస్తుంది. గుణ హ్యాండ్‌మేడ్ ఫిలిమ్స్ బ్యాన‌ర్‌పై నీలిమ గుణ నిర్మించిన ఈ సినిమా మొదటి గ్లింప్స్ ను మేకర్స్ నేడు రిలీజ్ చేశారు.

గ్లింప్స్ లో డ్రగ్స్ కు యువత ఎలా బానిసలుగా మారుతున్నారు.. ? డ్రగ్స్  మత్తులో యువత ఎలాంటి దారుణాలకు ఒడిగడుతున్నారు.. ? ఇలాంటివి  చూపించారు. అమ్మాయిలు, అబ్బాయిలు డ్రగ్స్ తీసుకోవడం.. కారులో అమ్మాయిని నలుగురు అబ్బాయిలు రేప్ చేయడం చూపించారు.  ఇలాంటివి బయట కూడా జరగడంతో.. సినిమాపై ఒక హైప్ క్రియేట్ అయ్యింది. ఈ గ్లింప్స్ చూసాకా.. అసలు ఇలాంటి సినిమా తీస్తుంది గుణశేఖర్ యేనా అనే అనుమానం రాకమానదు.


ఇక ఈ గ్లింప్స్ ఈవెంట్ లో గుణశేఖర్ మాట్లాడుతూ.. ” అంతా కొత్త వారితో ఈ చిత్రం చేశాను. తొంభై శాతం అంతా కొత్త వాళ్లే కనిపిస్తారు.  ఏడాదిన్నర క్రితం ఈ ప్రాజెక్ట్ అనుకున్నాం. ఆరు నెలలు ప్రీ ప్రొడక్షన్ చేశాం.  ఇప్పటి వరకు అరవై శాతం షూట్ పూర్తయింది. యుఫోరియా అంటే ఏంటి? అని అందరు అడుగుతున్నారు. దానికి సమాధానమే ఈ గ్లింప్స్. సమాజంలో ఓ రెండు ఘటనలు నన్ను కదిలించాయి. ప్రతీ వారం అలాంటి ఘటనలే జరుగుతున్నాయి. ఇప్పుడున్న టైంలో ఇలాంటి కథను చెప్పాలని అనిపించింది.

కథను రాస్తున్న కొద్దీ.. బయట కూడా ఇలాంటి ఘటనలే జరుగుతూ వచ్చాయి. ఈ కథ అనుకున్న తరువాత నీలిమకు చెప్పాను. ఇప్పుడు ట్రెండ్‌కు తగ్గట్టుగా ఉందని నా కూతురు చెప్పింది. యూత్, పేరెంట్స్ మధ్య జరిగే సంఘర్షణ నేపథ్యంలో ఈ చిత్రం ఉంటుంది. ఇప్పుడున్నయూత్ మైండ్ సెట్‌కు తగ్గట్టుగా సినిమా చాలా కొత్తగా ఉండబోతోంది. మంచి కంటెంట్‌తో వస్తే స్టార్ హీరో ఉన్నాడా? ఏ భాషలో వచ్చింది? అనేది ఆడియెన్స్ చూడటం లేదు. కథ బాగుంటే ఆడియెన్స్ ఆదరిస్తున్నారు. ఈ సినిమా పెద్ద కమర్షియల్ సక్సెస్ అవుతుందని నమ్మకం ఉంది” అని చెప్పుకొచ్చాడు. మరి ఈ సినిమాతో గుణశేఖర్ ఎలాంటి హిట్ ను అందుకుంటాడో చూడాలి.

Related News

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Ali Wife : కొత్త బిజినెస్ మొదలుపెట్టిన అలీ వైఫ్ జుబేదా…మీ సపోర్ట్ కావాలంటూ?

Big Stories

×