11. 55 am: హర్యానాలో 48 స్థానాల్లో బీజేపీ ముందంజ, కాంగ్రెస్ 36 స్థానాల్లో ముందంజలో ఉంది. అయితే, ఆమ్ ఆద్మీ పార్టీ ఇప్పటివరకు ఒక్క స్థానంలో కూడా లీడ్‌లో లేదు. చూస్తుంటే.. చీపురు పార్టీ పూర్తిగా తుడిచిపెట్టుకుపోయినట్లే కనిపిస్తోంది.
జమ్మూ కాశ్మీర్ లో కాంగ్రెస్ లీడ్
50సీట్ల ఆధిక్యంలో కాంగ్రెస్ కూటమి
జమ్మూ కాశ్మీర్ లో స్పష్టమైన ఆధిక్యం దిశగా కాంగ్రెస్
కాంగ్రెస్ 50, బీజేపీ 24, ఇతరులు 16 స్థానాల్లో ముందంజ
హర్యానాలో బీజేపీ లీడ్
10 : 00 am – హర్యానాలో బీజేపీ 44, కాంగ్రెస్ 41, , ఇతరులు 5 స్థానాల్లో ముందంజ
హర్యానాలో హోరాహోరీ
హర్యానాలో హోరాహోరీగా మారిన పోరు
రౌండ్ రౌండ్ కి మారుతున్న ఆధిక్యాలు
లీడ్లోకి వచ్చిన బీజేపీ.. ఉత్కంఠగా మారిన కౌంటింగ్
కాంగ్రెస్ హవా
హర్యానాలో కాంగ్రెస్ హవా, జమ్మూ కాశ్మీర్ లో కాంగ్రెస్ కూటమి హవా
9 : 50 am – హర్యానాలో కాంగ్రెస్ 51, బీజేపీ 34, ఇతరులు 5 స్థానాల్లో ముందంజ
కాశ్మీర్ లో 47 స్థానాల ఆధిక్యంలో ఎన్ సీ
ఎగ్జిట్ పోల్స్ అంచనాల దిశగా పరుగుతీస్తున్న రిజల్ట్
జమ్మూ కాశ్మీర్ లో కాంగ్రెస్ 45, బీజేపీ 31, ఇతరులు 14 స్థానాల్లో ముందంజ
9 : 40 am – హర్యానాలో కాంగ్రెస్ 54, బీజేపీ 31, ఇతరులు 5 స్థానాల్లో ముందంజ
కాంగ్రెస్ సంబరాలు
స్వీట్లు పంచి సంబరాలు చేసుకుంటున్న కాంగ్రెస్ నేతలు
ఏఐసీసీ కార్యాలయాల ముందు నేతల సందడి
కాంగ్రెస్ కార్యకర్తల్లో మెుదలైన సంబరాలు
హర్యానాలో కాంగ్రెస్ లీడ్
హర్యానాలో మ్యాజిక్ ఫిగర్ 46
కాశ్మీర్లో మ్యాజిక్ ఫిగర్ దాటి దూసుకుపోతున్న కాంగ్రెస్
హర్యానాలో కాంగ్రెస్ 56, బీజేపీ 29, ఇతరులు 6 స్థానాల్లో ముందంజ
9 : 30 am – జమ్మూ కాశ్మీర్ లో కాంగ్రెస్ 45, బీజేపీ 31, పీడీపీ 05, ఇతరులు 3 స్థానాల్లో ముందంజ
హర్యానాలో కాంగ్రెస్ 60, బీజేపీ 24, ఇతరులు 6 స్థానాల్లో ముందంజ
నేతల జోరు
9 : 20 am – గందెర్ బాల్లో ఒమర్ అబ్దుల్లా ముందంజ
పోటీ చేసిన 2 స్థానాల్లో మెహబూబా మఫ్తీ ముందంజ
జమ్మూ కాశ్మీర్ లో కాంగ్రెస్ 48, బీజేపీ 30, పీడీపీ 05, ఇతరులు 3 స్థానాల్లో ముందంజ
హర్యానాలో కాంగ్రెస్ 62, బీజేపీ 21, ఇతరులు 2 స్థానాల్లో ముందంజ
9 : 15 am – హర్యానాలో మ్యాజిక్ ఫిగర్ దాటి లీడ్లో కొనసాగుతున్న కాంగ్రెస్
హర్యానా(జులానా)లో రెజ్లర్ వినేష్ ఫోగాట్ ముందంజ
9 : 05 am – జమ్మూ కాశ్మీర్ లో కాంగ్రెస్ 43, బీజేపీ 28, పీడీపీ 05, ఇతరులు 3 స్థానాల్లో ముందంజ
కైతాలాలో ఆదిత్య సుర్జేవాలా ముందంజ
గర్హి సంప్లా – కిలోయ్ లో భూపేందర్ సింగ్ హుడా ముందంజ
నౌషిరాలో జమ్మూ కాశ్మీర్ బీజేపీ చీఫ్ రవిందర్ రైనా లీడ్
జమ్మూలో కాంగ్రెస్ కూటమి ఆధిక్యం
జమ్మూ కాశ్మీర్లో కాంగ్రెస్ + ఎన్ సీ ఆధిక్యం
కాశ్మీర్లో ఆర్టికల్ 370 రద్దు అనంతరం జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికలు
జమ్మూ కాశ్మీర్ లో కాంగ్రెస్ 47, బీజేపీ 24, ఇతరులు 3 స్థానాల్లో ముందంజ
8:55 am – హర్యానాలో కాంగ్రెస్ 65, బీజేపీ 23, ఇతరులు 2 స్థానాల్లో ముందంజ
అంబాలా కంటోన్మెంట్లో బీజేపీ మంత్రి అనిల్ విజ్ ముందంజ
8:50 am -హర్యానాలో కాంగ్రెస్ 63, బీజేపీ 24, ఇతరులు 2 స్థానాల్లో ముందంజ
లాడ్వాలో హర్యానా సీఎం నాయబ్ సింగ్ సైనీ లీడ్
కాశ్మీర్ లో రెండు చోట్ల లీడ్ లో ఉన్న ఒమర్ అబ్దుల్లా
జమ్మూ కాశ్మీర్ లో కాంగ్రెస్ 45, బీజేపీ 25, ఇతరులు 3 స్థానాల్లో ముందంజ
8:45 am -హర్యానాలో కాంగ్రెస్ 62, బీజేపీ 24, ఇతరులు 2 స్థానాల్లో ముందంజ
హర్యానా మాజీ ముఖ్యమంత్రి భూపేంద్ర హూడా ముందంజ
8:40 am -హర్యానాలో కాంగ్రెస్ 55, బీజేపీ 28, ఇతరులు 2 స్థానాల్లో ముందంజ
రెండు రాష్ట్రాల్లో కాంగ్రెస్ ముందంజ
హర్యానాలో కాంగ్రెస్ 53, బీజేపీ 27, ఇతరులు 4 స్థానాల్లో ముందంజ
8:35 am – జమ్మూ కాశ్మీర్ లో కాంగ్రెస్ 43, బీజేపీ 25, ఇతరులు 3 స్థానాల్లో ముందంజ
8 : 30 am -హర్యానాలో కాంగ్రెస్ 44, బీజేపీ 21, ఇతరులు 4 స్థానాల్లో ముందంజ
హర్యానాలో కాంగ్రెస్ 42, బీజేపీ 16, ఇతరులు 4 స్థానాల్లో ముందంజ
8:25 am – జమ్మూ కాశ్మీర్ లో కాంగ్రెస్ 34, బీజేపీ 25, ఇతరులు 3 స్థానాల్లో ముందంజ
భారీ భద్రత
కౌంటింగ్ కేంద్రాల చుట్టూ మూడంచెల భద్రత ఏర్పాటు
హర్యానాలో కాంగ్రెస్ 40, బీజేపీ 18, ఇతరులు 4 స్థానాల్లో ముందంజ
8: 20 am – జమ్మూ కాశ్మీర్ లో కాంగ్రెస్ 8, బీజేపీ 15, ఇతరులు 1 స్థానాల్లో ముందంజ
జులానాలో రెజ్లర్ వినేష్ ఫోగాట్ ముందంజ
హర్యానాలో కాంగ్రెస్ 38, బీజేపీ 15, ఇతరులు 4 స్థానాల్లో ముందంజ
జమ్మూ కాశ్మీర్ లో కాంగ్రెస్ 7, బీజేపీ 9 స్థానాల్లో ముందంజ
ముందుగా పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు, అనంతరం ఈవీఎంల లెక్కింపు
జమ్మూ కాశ్మీర్ లో ప్రభుత్వ ఏర్పాటుకు మ్యాజిక్ ఫిగర్ 48
ఉదయం 9 గంటలకు తొలి రౌండ్ ఫలితాలు విడుదల
8 : 15 am – పోస్టల్ బ్యాలెట్ లెక్కింపులో కాంగ్రెస్ ముందంజ
జమ్మూ కాశ్మీర్ లో కాంగ్రెస్ 4, బీజేపీ 2 స్థానాల్లో ముందంజ
హర్యానాలో కాంగ్రెస్ 17, బీజేపీ 5 స్థానాల్లో ముందంజ
హర్యానా, జమ్మూ కాశ్మీర్ లో కాంగ్రెస్ దూకుడు
కౌంటింగ్ స్టార్ట్
8:00 am – ప్రారంభమైన కౌంటింగ్
తేలనున్న భవితవ్యాలు
జమ్మూ కాశ్మీర్ ఎన్నికల బరిలో నిలిచిన 873మంది
హర్యానా ఎన్నికల బరిలో నిలిచిన 1,031 మంది
సర్వం సిద్ధం
జమ్మూ కాశ్మీర్ లో 28 కౌంటింగ్ కేంద్రాలు.. హర్యానాలో 93 కౌంటింగ్ కేంద్రాలు
హర్యానాలో 90, జమ్మూ కాశ్మీర్లో 90 నియోజకవర్గాలకు కౌంటింగ్
7:30 am – కౌంటింగ్ కేంద్రాల వద్ద భారీ భద్ర మోహరింపు, కాసేపట్లో ప్రారంభంకానున్న కౌంటింగ్
7:00 am – జమ్మూ కాశ్మీర్, హర్యానాలో ఓట్ల లెక్కింపుకు సర్వం సిద్ధం
జమ్ము కాశ్మీర్, హర్యనాలో ఎన్నికల ఫలితాల అప్‌డేట్స్.. విశ్లేషణల కోసం మా ‘బిగ్ టీవీ లైవ్’ చూడండి
జమ్ము కశ్మీర్, హర్యానా ఓటర్లు బీజేపీకి షాక్ ఇవ్వనున్నారా? ఈ రాష్ట్రాల్లో కూడా కాంగ్రెస్ హవా కొనసాగనుందా? ఎన్నికల ఫలితాల్లో ఎవరిది పైచేయి? ఏ రాష్ట్రంలో క్లియర్ మెజారిటీ రానుంది? ఎక్కడ హంగ్ వస్తుంది. ఈ ఉత్కంఠకు తెరపడే సమయం వచ్చింది. మరికొన్ని గంటల్లోనే ప్రజా తీర్పు వెలువడనుంది. ప్రతి క్షణం.. ఎన్నికల ఫలితాల అప్‌డేట్స్‌ను మీరు ఇక్కడ తెలుసుకోవచ్చు. ఎన్నికల ఫలితాల్లోకి వెళ్లే ముందు.. అసలు ఎగ్జిట్ పోల్స్‌లో ఎలాంటి ఫలితాలు వచ్చాయో చూద్దాం.
జమ్ము, హర్యానాలో ఇటీవల పోలింగ్ పూర్తయ్యింది. ఆ వెంటనే వచ్చిన ఎన్నికల ఫలితాల్లో కొన్ని ఏజెన్సీలు కాంగ్రెస్ పార్టీదే హవా అంటూ ప్రకటించాయి. మరికొన్ని మాత్రం.. అటుఇటుగా ఫలితాలు ఉంటాయని చెప్పాయి. అయితే, ప్రజా తీర్పు ఎలా ఉంటుందనేది ఫలితాలు వచ్చే వరకు చెప్పలేం. తారుమారయ్యే అవకాశాలు కూడా లేకపోలేదు. ఈ ఎన్నికల ఫలితాలు బీజేపీకి చాలా కీలకం. ఎందుకంటే.. ఇటీవలే చావు తప్పి కన్ను లొట్టపోయినట్లు.. కొద్దిలో అధికారాన్ని అందుకొనే అవకాశాన్ని కోల్పోయేది. కాంగ్రెస్ పార్టీ తిరిగి పుంజుకోవడమే ఇందుకు కారణం. ఈ నేపథ్యంలో కమలదళంలో ఆందోళన మొదలైంది.
హర్యానాలో ఇలా..
హర్యానాలో కూడా హస్తానిదే హవాని అని పేర్కొన్నాయి. హర్యానాలో 90 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరిగాయి. మొత్తం 1031 మంది అభ్యర్థులు పోటీ పడ్డారు. అక్కడ బీజేపీ, కాంగ్రెస్, ఆప్ పార్టీలు విడివిడిగా పోటీ చేశాయి. అందుకే, అక్కడ ఎవరు పాగా వేస్తారనే ఉత్కంఠ నెలకొంది. కొన్ని ఎగ్జిట్ పోల్స్ అక్కడ హంగ్ ఏర్పడే అవకాశం ఉందని చెబుతున్నాయి. బీజేపీకి క్లియర్ మెజారిటీ రాకపోవచ్చని.. ఒక వేళ అటూఇటుగా ఫలితాలు వస్తే ఆమ్ ఆద్మీ.. కాంగ్రెస్‌కే మద్దతు ఇవ్వొచ్చని టాక్. అక్కడ మెజారిటీ సాధించాలంటే కనీసం 46 స్థానాలు రావాలి.
జమ్మూలో అలా..
జమ్ము కశ్మీర్‌లో కాంగ్రెస్ కూటమి (I.N.D.I.A) పాగా వేయనున్నట్లు కొన్ని ఎగ్జిట్ పోల్స్‌లో తేలింది. ఇక్కడ పదేళ్ల తర్వాత జరుగుతున్న ఎన్నికలు కావడంతో యావత్ దేశం చూపు ఇటే ఉంది. జమ్మూ కశ్మీర్‌లో మొత్తం 90 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. అక్కడి పరిస్థితుల నేపథ్యంలో ఒకేసారి కాకుండా మూడు విడతల్లో ఎన్నికలు నిర్వహించారు. ప్రజలు సైతం తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఇక్కడ కాంగ్రెస్ – ఎన్‌సీ, బీజేపీతోపాటు పీడీపీ కూడా బరిలో ఉంది. కాంగ్రెస్ కూటమికే విజయావకాశాలు ఎక్కువ ఉన్నాయని ఎగ్జిట్ పోల్స్ చెబుతున్నాయి.
ఎగ్జిట్ పోల్స్ పూర్తి ఫలితాలు చూసేందుకు.. ఈ కింది లింక్ క్లిక్ చేయండి
బీజేపీకి షాక్.. ఆ రెండు రాష్ట్రాలూ కాంగ్రెస్‌కే, ఎగ్జిట్ పోల్స్ ఫలితాలివే!