Game Changer Pre Release Event:గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan) తాజాగా నటిస్తున్న చిత్రం గేమ్ ఛేంజర్ (Game Changer). ప్రముఖ కోలీవుడ్ డైరెక్టర్ ఎస్.శంకర్ (S.Shankar) దర్శకత్వంలో సినిమా చేస్తుండడంతో అంచనాలు భారీగా పెరిగిపోయాయి. దీనికి తోడు శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు(Dilraju ) ఏమాత్రం కాంప్రమైజ్ కాకుండా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇందులో రామ్ చరణ్ తండ్రీ కొడుకులుగా ద్విపాత్రాభినయం చేస్తూ ఉండగా.. ప్రముఖ టాలీవుడ్ హీరోయిన్ అంజలి(Anjali), అలాగే బాలీవుడ్ హీరోయిన్ కియారా అద్వానీ (Kiara advani) హీరోయిన్లుగా అవకాశాన్ని దక్కించుకున్నారు. వీరితోపాటు పలువురు భారీ తారాగణం కూడా ఇందులో భాగమైనట్లు తెలుస్తోంది. వచ్చే ఏడాది అనగా సంక్రాంతి సందర్భంగా జనవరి 10వ తేదీన ఈ సినిమా విడుదల కాబోతోంది.
రామ్ చరణ్ కు నేషనల్ అవార్డు గ్యారెంటీ..
ఇప్పటికే ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను అమెరికాలోని డల్లాస్ లో నిర్వహించగా.. అనూహ్యమైన రెస్పాన్స్ లభించింది. మరొకవైపు ఈ కార్యక్రమానికి ‘పుష్ప2’ సినిమాతో ఇండియన్ బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డు క్రియేట్ చేసిన డైరెక్టర్ సుకుమార్ (Sukumar)తో పాటు ‘ఉప్పెన’ డైరెక్టర్ బుచ్చిబాబు సనా(Bucchibabu Sana) కూడా హాజరయ్యారు. అంతేకాదు ఈ వేదికపై మాట్లాడుతూ..ఈ సినిమాను మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) తో కలిసి చూసానని, ఈ సినిమాతో రాంచరణ్ కు నేషనల్ అవార్డు రావడం ఖాయమని తన అభిప్రాయంగా వెల్లడించారు సుకుమార్. దీంతో సినిమాపై అభిమానులలో అంచనాలు మరింత పెరిగిపోయాయి.
గేమ్ ఛేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి సర్వం సిద్ధం..
ఇదిలా ఉండగా.. ఆంధ్రప్రదేశ్ లో కూడా ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను నిర్వహించబోతున్నారు అంటూ గత కొద్ది రోజులుగా వార్తలు వినిపిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు పూర్తి వివరాలు బయటకి వచ్చేసాయి. అసలు విషయంలోకెళితే, ‘గేమ్ ఛేంజర్’ ప్రీ రిలీజ్ ఈవెంట్ ను జనవరి 4వ తేదీన రాజమండ్రిలోని ఓపెన్ గ్రౌండ్లో నిర్వహించబోతున్నారు. అంతేకాదు ఈ కార్యక్రమానికి చీఫ్ గెస్ట్ గా ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) రాబోతున్నారు.
ప్రీ రిలీజ్ ఈవెంట్ ప్రత్యేకతలు..
ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ ప్రత్యేకతల విషయానికి వస్తే.. ఈ కార్యక్రమానికి దాదాపు లక్ష మందికి పైగా ఫ్యాన్స్ ను తరలించడానికి ప్లాన్ లు జరుగుతున్నాయి. ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మొదటిసారి ఓపెన్ గ్రౌండ్లో సినిమా ఈవెంట్ కు పర్మిషన్ లభించింది. అంతేకాదు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గెలిచిన తర్వాత హాజరయ్యే మొదటి సినిమా ఈవెంట్ కూడా ఇదే కావడం గమనార్హం. దీనికి తోడు ఈ ఈవెంట్ ఇటు ‘గేమ్ ఛేంజర్’ మూవీ బృందానికి , అటు రామ్ చరణ్ కి అలాగే పవన్ కళ్యాణ్ తో పాటు కూటమి ప్రభుత్వానికి కూడా ఒక ప్రెస్టేజ్ ఈవెంట్ లా మారిపోయింది. అందుకే ఎక్కడ ఏ విషయంలో కాంప్రమైజ్ కాకుండా ఇప్పటివరకు ఎక్కడ జరగని విధంగా ఈ ఈవెంట్ ని ప్లాన్ చేస్తున్నారు చిత్ర బృందం. మొత్తానికైతే గూస్ బంప్స్ తెప్పించే అప్డేట్స్ తో అభిమానులలో అంచనాలు పెంచేస్తున్నారు మేకర్స్. ఇక ఓపెన్ గ్రౌండ్ లో లక్షమందికి పైగా అభిమానుల మధ్య గేమ్ ఛేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించబోతున్నారని తెలిసి అటు సినీ ఆడియన్స్ లో కూడా ఆసక్తి ఏర్పడింది.