Man Harassed Actress : హీరోయిన్లకు ఎంతటి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంటుందో, అదే రేంజ్ లో ఇబ్బందులు కూడా ఉంటాయి. ముఖ్యంగా సెల బ్రిటీలు కన్పిస్తే చాలు వాళ్ళతో కలిసి సెల్ఫీ దిగడానికి, వీడియోలు తీసుకోవడానికి ఎగబడతారు. అదే హీరోయిన్ అయితే కొంత మంది ఏకంగా హద్దులు దాటి ప్రవర్తిస్తారు. ఇలాంటి ప్రవర్తన వల్ల ఎంతోమంది హీరోయిన్లు ఇప్పటి దాకా ఇబ్బందులు పడ్డ సంగతి తెలిసిందే. ఇదంతా ఒక ఎత్తైతే, తాజాగా జరిగిన షాకింగ్ ఘటన మరొక ఎత్తు. ఓ వ్యక్తి ఏకంగా హీరోయిన్ ముందే ప్యాంటు విప్పి, ఆ పాడు పని చేస్తూ కనిపించాడట. దీంతో షాక్ అయిన హీరోయిన్ వాడికి జన్మలో ఇంకోసారి అలాంటి పని చేయకుండా ఝలక్ ఇచ్చింది.
అసలేం జరిగిందంటే?
గోవాలోని పనాజీలో ఒక దుండగుడు బైక్ పై నటితో పాటు ఆమె స్నేహితురాలని వెంబడించి వేధించిన సంఘటన దిగ్భ్రాంతికరంగా మారింది. సదరు వ్యక్తి ఆదివారం రాత్రి పనాజీలో టూ వీలర్ పై వెళ్తుండగా నటితో సహా ఇద్దరు మహిళలను లైంగికంగా వేధించాలని తెలుస్తోంది. పట్టోలోని ఒక బ్యాంక్ సమీపంలో రాత్రి 10 : 15 గంటల ప్రాంతంలో ఈ ఘటన జరిగినట్టు తెలుస్తోంది. సదరు వ్యక్తి స్కూటర్ పై వెళ్తూ, మహిళలపై అసభ్యకర కామెంట్స్ చేసినట్టు సమాచారం. పైగా ఆ టైమ్ లో అతను ప్యాంట్ విప్పి, ఆ పాడు పని చేసుకుంటూ దర్శనం ఇచ్చాడట. అల్మోస్ట్ అర్దరాత్రి, పెద్దగా జనాలు తిరగని టైమ్… అలాంటి టైమ్ లో జరిగిన ఈ ఘటనతో ఒక్కసారిగా హీరోయిన్ తో పాటు ఆమె ఫ్రెండ్ షాక్ అయ్యారు. ఆ తరువాత అతనికి బుద్ధి వచ్చేలా చేయాలని పోలీసులకు కంప్లయింట్ ఇచ్చారు.
నిందితుడు ఎస్కేప్
సదరు నిందితుడి వల్ల ఇబ్బంది పడ్డ బాధితులలో ఒకరైన నటి సోషల్ మీడియా వేదికగా ఈ చేదు అనుభవాన్ని వివరించింది. నడిరోడ్డుపై అలాంటి షాకింగ్ ఘటన అసహ్యాన్ని, భయాన్ని కలిగించాయని ఆవేదన వ్యక్తం చేసింది. అంతేకాకుండా పోలీసులకు కంప్లైంట్ కూడా చేసింది. దీంతో పోలీసులు ఆమె ఫిర్యాదు మేరకు నిందితుడి కోసం సర్చ్ చేశారు. ఎట్టకేలకు సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా నిందితుడిని గుర్తించారు.
అతను టోంకా, కారంజలెం నివాసి అని కనుగొన్నారు పోలీసులు. షాకింగ్ విషయం ఏంటంటే సదరు నిందితుడికి నేర చరిత్ర గట్టిగానే ఉంది. ఇదివరకే అతనిపై లైంగిక వేధింపులు, ఫోక్సో చట్టం కింద కేసులు నమోదు కాగా, కొన్ని రోజుల పాటు అరెస్టు అయ్యి, జైల్లో కూడా ఉన్నాడు. 2024లో బెయిల్ పై అతను బయటకు వచ్చినట్టు తెలుస్తోంది. అయినప్పటికీ కుక్క తోక వంకర అన్నట్టు అతని బుద్ధి మారలేదు. ఇక తాజాగా నిందితుడిని గుర్తించి కనిపెట్టినట్టు పోలీసులు కన్ఫర్మ్ చేశారు. కానీ అతను పోలీసుల నుంచి తప్పించుకొని పారిపోయినట్లు సమాచారం. ప్రస్తుతం పోలీసులు అతనిపై ఎఫ్ఐఆర్ నమోదు చేసి, పట్టుకోవడానికి తీవ్రంగా గాలిస్తున్నారు. ఇలాంటి సంఘటనలు అమ్మాయిల భద్రతపై ఆందోళనను రేకెత్తిస్తాయి.