BigTV English

Kirak RP : ఆర్పీ ఫ్యామిలీపై సోషల్ మీడియాలో అసత్య ప్రచారాలు…

Kirak RP : ఆర్పీ ఫ్యామిలీపై సోషల్ మీడియాలో అసత్య ప్రచారాలు…

Kirak RP : ఈటీవీలో వచ్చే జబర్దస్త్ షో గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ షో తో ఎంతోమంది కమెడియన్స్ తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి పరిచయమయ్యారు. కేవలం కమెడియన్స్ మాత్రమే కాకుండా చాలామంది నటులు కూడా పరిచయమయ్యారు. బుల్లితెరలో ఈ షో ఒక ప్రభంజనం అని చెప్పాలి. కేవలం నటులు, కమెడియన్స్ మాత్రమే కాకుండా, వేణు లాంటి అద్భుతమైన దర్శకులు కూడా ఈ షో పరిచయమయ్యారు. అయితే ఇదే షోలో హైపర్ ఆది, కిరాక్ ఆర్ పి వంటి వాళ్లు పాపులర్ అయిన తర్వాత రాజకీయాల్లో కూడా తమ వాక్చాతుర్యాన్ని ప్రదర్శిస్తూ చాలామందికి టార్గెట్ గా మారారు.


ఆర్.పి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అందరూ పవన్ కళ్యాణ్ జనసేన పార్టీకి సపోర్ట్ చేస్తూ వస్తున్న తరుణంలో, తాను మాత్రం ఓపెన్ గా తెలుగుదేశం పార్టీకి సపోర్ట్ చేస్తూ చాలా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. అంతేకాకుండా ఏ విషయం దాయకుండా ముక్కుసూటిగా మాట్లాడుతూ చాలామందికి అనవసరమైన టార్గెట్ గా మారారు. ఈ విషయంలోనే కాకుండా చాలా విషయాల్లో ముక్కుసూటిగా మాట్లాడటం అనేది ఆర్పీ లక్షణం. అది చాలా మంచి క్వాలిటీ కానీ అదే కొన్నిసార్లు కొత్త చిక్కులను తెచ్చిపెడుతుంది. కేవలం నటుడు గానే కాకుండా దర్శకుడుగా కూడా ఆర్పి తన ప్రతిభను చూపించుకున్నాడు. అలానే ఫుడ్ బిజినెస్ రంగంలో తన కూడా మార్కును క్రియేట్ చేశాడు.

ఇక 2024 ఎన్నికలలో ఆర్పి చాలామంది తప్పులను ఎత్తి చూపించాడు. అన్యాయాన్ని ప్రశ్నించాడు, ఇలా చేయటం వల్లనే కొంతమంది వ్యక్తులకు కొన్ని రాజకీయ పార్టీలకు ఆర్పి టార్గెట్ అయ్యాడు. ఇలా ఆర్పి టార్గెట్ అవడం వలన వ్యక్తిగతంగా ఆర్పీ ను దూషించడం మొదలుపెట్టారు కొంతమంది వ్యక్తులు. వాస్తవాలు తెలుసుకోకుండా అనేక ఫేక్ వార్తలను క్రియేట్ చేసి, ఆయన పరువు, ఆయన ఫ్యామిలీ పరువు దెబ్బతీసేలా చేస్తున్నారు. అయితే ఆర్పి గురించి తెలిసిన చాలామందికి ఇవి కేవలం గాసిప్స్ మాత్రమే, మామూలుగా ఆర్పిని టచ్ చేయలేక ఇలా పర్సనల్ అటాకింగ్ చేస్తున్నారు అని కొంతమంది భావిస్తున్నారు.


చాలామంది కొంతమంది వ్యక్తులను ముఖస్తుతి చేస్తూ ఉంటారు. వాళ్లు తప్పులు చేసినా కూడా సైలెంట్ గా ఉండిపోతారు. కొన్ని విమర్శలు చేసినా కూడా వాటికి స్పందించరు. అయితే వీటన్నిటికీ కూడా ఆర్పి అతీత అని చెప్పాలి. తాను కంటెస్టెంట్ గా చేసిన జబర్దస్త్ షోలో జడ్జిగా వ్యవహరించిన నటీ రోజాకు పలుమార్లు కౌంటర్ గా మాట్లాడారు ఆర్పి. అలానే గతంలోని అధికార పార్టీను కూడా అనేకమార్లు తన పదునైన మాటలతో ప్రశ్నించడం మొదలుపెట్టారు. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని ఆర్పి ను ఏమి చేయలేక పర్సనల్ టార్గెటింగ్ చేస్తున్నారు.

Tags

Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×