BigTV English
Advertisement

Pushpa 2: అల్లు అర్జున్ నట విశ్వరూపం.. గంగో రేణుకా తల్లి వీడియో సాంగ్ వచ్చేసింది

Pushpa 2: అల్లు అర్జున్ నట విశ్వరూపం.. గంగో రేణుకా తల్లి వీడియో సాంగ్ వచ్చేసింది

Pushpa 2: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, రష్మిక జంటగా స్టార్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం పుష్ప 2. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించిన ఈ సినిమా గత నెల డిసెంబర్ 5 న ప్రేక్షకుల ముందుకు వచ్చి.. భారీ విజయాన్ని అందుకుంది. మూడేళ్ళ క్రితం పుష్ప సినిమాకు సీక్వెల్ గా పుష్ప 2 సినిమాను తెరకెక్కించాడు సుకుమార్. సాధారణంగా టాలీవుడ్ లో సీక్వెల్స్ ఎక్కువగా విజయాన్ని అందుకోవు.


అందులోనూ పుష్ప 2 రిలీజ్ టైమ్ కు ఎన్నో ఆటంకాలు ఎదురయ్యాయి. దీంతో ఈ సినిమాపై నెగెటివిటి వస్తుందని, సినిమా అట్టర్ ప్లాప్ అవుతుందని చెప్పుకొచ్చారు. కానీ, అనూహ్యంగా పుష్ప 2 సినిమా భారీ విజయాన్ని అందుకుంది. కేవలం విజయాన్ని మాత్రమే కాదు.. రికార్డుల మోత మోగిస్తుంది.  సినిమా రిలీజ్ అయ్యి రెండు వారాల్లోనే ఓటీటీకి వస్తున్న ఈ రోజుల్లో.. పుష్ప 2 సినిమా ఇంకా థియేటర్ లో విజయవంతంగా కొనసాగుతోంది.

Daaku Maharaaj : ఓవర్సీస్‌లో డాకు కష్టమే… రిలీజ్ డేట్‌ని సరిగ్గా ప్లాన్ చేయలేదా..?


ఇప్పటివరకు పుష్ప 2 సినిమా రూ.1799 కోట్లను సాధించి ఇండస్ట్రీని షేక్ చేస్తుంది.  ఇక హిందీలో అయితే పుష్ప 2 క్రియేట్ చేసిన రికార్డ్ ను ఇప్పటివరకు ఈ ఖాన్ కూడా సృష్టించలేదు. బాలీవుడ్ లో పుష్ప 2 రూ.800 కోట్లకు పైగా నెట్ కలెక్షన్లు రాబట్టింది. ఒక తెలుగు సినిమా హిందీలో ఈ రేంజ్‌లో ఊచకోత సృష్టించడం ఇదే మొదటిసారి. ఇక ఎప్పుడెప్పుడు ఈ సినిమా ఓటీటీలో వస్తుందా అని అభిమానులు వెయ్యి కళ్ళతో ఎదురుచూస్తున్నారు. నెట్ ఫ్లిక్స్ ఈ సినిమా హక్కులను కొనుగోలు చేసిన విషయం తెల్సిందే.

ఇక గత నెల నుంచి పుష్ప 2 నుంచి వీడియో సాంగ్స్ ఒక్కొక్కటిగా రిలీజ్ చేస్తున్నారు. దీంతో ఓటీటీ ప్రమోషన్స్ కూడా మొదలుపెట్టారేమో అనుకున్నారు. అయితే 56 రోజుల వరకు ఓటీటీలో రావడం జరగదని మేకర్స్ క్లారిటీ ఇచ్చారు. ఇక ఈ వీడియో సాంగ్స్ వలన సినిమాపై మరింత హైప్ క్రియేట్ చేస్తున్నారు.  ఇప్పటికే పుష్ప 2 సినిమాలో ప్రతి వీడియో సాంగ్ ను మేకర్స్ రిలీజ్ చేశారు. తాజాగా సినిమా మొత్తానికి హైలైట్ గా నిలిచిన వీడియో సాంగ్ ను మేకర్స్ రిలీజ్  చేశారు.

Game Changer: ‘గేమ్ ఛేంజర్’పై కన్నడ ప్రేక్షకుల ఫైర్.. బాయ్‌కాట్ చేయాలంటూ డిమాండ్, ఎందుకంటే.?

సినిమా క్లైమాక్స్ లో శ్రీవల్లీ గర్భవతి అని తెలిసినప్పుడు పుష్ప.. చీరకట్టుకొని అమ్మవారిముందు  ఆడతాడు. గంగో రేణుకా తల్లి అంటూ సాగే ఈ బిట్ సినిమా మొత్తానికి హైలైట్ గా నిలిచింది. ఇక ఈ సాంగ్ లో బన్నీ నట విశ్వరూపం చూపించాడు. చంద్రబోస్ లిరిక్స్ అందించిన ఈ సాంగ్ ను సింగర్ మహాలింగం ఎంతో అద్భుతంగా పాడాడు. రాస్తుతం ఈ సాంగ్ నెట్టింట వైరల్ గా మారింది. మరి ఈ సినిమా ఎప్పుడు ఓటీటీలోవస్తుందో  చూడాలి. థియేటర్ లో రచ్చ రచ్చ చేసిన ఈ సినిమా ఓటీటీలో ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.

Tags

Related News

Tejaswini Nandamuri: నందమూరి వారసురాలు వైరల్ యాడ్ డైరెక్టర్ ఎవరో తెలుసా? ఇంత బ్యాక్గ్రౌండ్ ఉందా?

Film industry: ఘనంగా సినిమాటిక్ ఎక్స్ పో 3వ ఎడిషన్!

CM Revanth on Movie Tickets: సినిమా టికెట్ డబ్బుల్లో సినీ కార్మికులకు వాటా… సీఎం సంచలన ప్రకటన

Bandla Ganesh: బండ్ల గణేష్ ఇల్లు చూడండి.. ఎంత అద్భుతంగా ఉందో!

Telugu Heroes : సినిమాలతో పాటు హోటల్స్… లగ్జరీ రెస్టారెంట్స్ ఉన్న హీరోలు వీళ్లే

Salman Khan: పాక్ ను కెలికిన సల్లు భాయ్.. తెలుగు సినిమాలు బాగా చూస్తారంటూ..

Siva Jyothi: బేబీబంప్ తో పెళ్లి పీటలు ఎక్కిన శివ జ్యోతి.. ఇలా కూడా చేస్తారా?

Kantara 2: వైకల్యాన్ని జయిస్తూ.. నోటితోనే కాంతార బిజీఎం!

Big Stories

×