BigTV English
Advertisement

Birthday wishes to Nagarjuna: నాగార్జునపై ఏకంగా వీడియో రిలీజ్ చేసిన ప్రముఖ నిర్మాణ సంస్థ

Birthday wishes to Nagarjuna: నాగార్జునపై ఏకంగా వీడియో రిలీజ్ చేసిన ప్రముఖ నిర్మాణ సంస్థ

Famous Tollywood Suresh productions banner birthday wishes to Nagarjuna: ప్రముఖ టాలీవుడ్ నిర్మాణ సంస్థ సురేశ్ ప్రొడక్షన్స్ హీరో నాగార్జున పుట్టినరోజు సందర్భంగా ఒక వీడియో రిలీజ్ చేశారు. 1964లో సినీ ప్రయాణం మొదలు పెట్టింది సురేశ్ ప్రొడక్షన్స్ బ్యానర్. డా.డి.రామానాయుడు ట్రెండ్ సెట్టింగ్ నిర్మాణ సంస్థగా రూపుదిద్దారు. ఆయన తర్వాత ఆయన వారసుడు దగ్గుపాటి సురేశ్ ఈ బ్యానర్ వ్యవహారాలు చూసుకుంటున్నారు. నాగార్జున ఈ బ్యానర్ లో నటించిన ఒకే ఒక్క చిత్రం చినబాబు. అయితే అక్కినేని నాగేశ్వరరావుతో మాత్రం రామానాయుడు చాలా చిత్రాలే నిర్మించారు. నాగేశ్వరరావు సినీ కెరీర్ ను మలుపుతిప్పిన ప్రేమనగర్ సినిమాను నిర్మించి అప్పట్లో పెద్ద సంచలనమే క్రియేట్ చేశారు. అయితే నాగార్జున హీరో వెంకటేష్ సోదరిని వివాహం చేసుకున్న సంగతి చాలా తక్కువ మందికే తెలుసు.


రామానాయుడుతో బంధుత్వం

నాగచైతన్య వీరికి పుట్టిన కుమారుడే. అంటే రామానాయుడికి స్వయానా మనవడు. కారణాంతరాల వలన నాగార్జున విడాకులు తీసుకున్నారు. తర్వాత అమలను పెళ్లి చేసుకున్నారు. అయినా సురేశ్ ప్రొడక్షన్స్ తో ఉన్న బంధుత్వం కొనసాగుతునే ఉంది. నాగ్ పుట్టినరోజు సందర్భంగా విడుదల చేసిన వీడియోలో ఎప్పటికీ మనోహరమైన రాజును కోరుకుంటన్నాను. నాగార్జునకు పుట్టినరోజు శుభాకాంక్షలు..రాబోయే సంవత్సరం బ్లాక్ బస్టర్ హ్యాపీ బర్త్ డే నాగార్జున అంటూ వీడియో షేర్ చేశారు.


అభిమానం చాటుకున్న దేవిశ్రీ

సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ కూడా నాగార్జున పుట్టిన రోజు సందర్భంగా వీడియో షేర్ చేశారు. దేవిశ్రీ ప్రసాద్ నాగార్జునకు గతంలో మాస్, ఢమరుకం, కింగ్, భాయ్ , మన్మధుడు , సోగ్గాడే చిన్నినాయినా వంటి సినిమాలు వచ్చాయి. త్వరలోనే నాగార్జున, దేవిశ్రీల కలయికలో సోగ్గాడే చిన్నినాయినా మూడో సిరీస్ రాబోతోంది. దానిపై వర్కవుట్ జరుగుతోంది. అయితే నాగార్జున పుట్టినరోజు సందర్భంగా దేవిశ్రీ విడుదల చేసిన వీడియోలో ప్రియమైన కింగ్ కు సూపర్ డూపర్ బర్త్ డే శుభాకాంక్షలు..నాగ్ సార్ ఎప్పడూ మీ అసమానమైన ఆకర్షణ, మరపురాని సినిమాలు సూపర్ కూల్ స్వబావంతో రాకింగ్ చేస్తూ ఉండండి. మీతో అనుబంధం ఎప్పటికీ ఆనందం కలిగివుంటుంది. అంటూ సోషల్ మీడియా వేదికగా విష్ చేశారు దేవిశ్రీ.

మరోసారి మాస్ గా బిగ్ బాస్

ఆగస్టు 28న మాస్ సినిమాను రిలీజ్ చేశారు. నాగ్ పుట్టినరోజు 29 సందర్భంగా…మాస్ లో మైమరపించే పాటలను అందించారు దేవిశ్రీ.నాగార్జున హోస్ట్ గా సెప్టెంబర్ 1 నుంచి స్టార్ మా లో బిగ్ బాస్ 8 గ్రాండ్ ఓపెనింగ్ కాబోతోంది. దాదాపు మూడు నెలల పాటు బుల్లితెర ప్రేక్షకులను అలరించబోతోంది. బిగ్ బాస్ వీక్ ఎండ్ లో శని, ఆదివారాలలో నాగార్జున రాక కోసం ప్రేక్షకులు ఎదురుచూస్తుంటారు. కంటెస్టెంట్లను హుషారెక్కించడానికి, నాగ్ తనదైన స్టయిల్ లో మాట్లాడే సెటైరికల్ డైలాగుల కోసం ఆ ప్రోగ్రామ్ వీక్షిస్తుంటారు. కంటెస్టంట్లను ఆట పట్టిస్తూ..వారికి నిక్ నేమ్స్ పెడుతూ నవ్వులు పూయించడమే కాదు..హౌస్ లో ఎవరైనా తప్పుచేస్తే వారికి క్లాసులు కూడా పీకుతూ ప్రోగ్రామ్ ను రక్తి కట్టిస్తుంటారు నాగార్జున.

 

Related News

Tejaswini Nandamuri: నందమూరి వారసురాలు వైరల్ యాడ్ డైరెక్టర్ ఎవరో తెలుసా? ఇంత బ్యాక్గ్రౌండ్ ఉందా?

Film industry: ఘనంగా సినిమాటిక్ ఎక్స్ పో 3వ ఎడిషన్!

CM Revanth on Movie Tickets: సినిమా టికెట్ డబ్బుల్లో సినీ కార్మికులకు వాటా… సీఎం సంచలన ప్రకటన

Bandla Ganesh: బండ్ల గణేష్ ఇల్లు చూడండి.. ఎంత అద్భుతంగా ఉందో!

Telugu Heroes : సినిమాలతో పాటు హోటల్స్… లగ్జరీ రెస్టారెంట్స్ ఉన్న హీరోలు వీళ్లే

Salman Khan: పాక్ ను కెలికిన సల్లు భాయ్.. తెలుగు సినిమాలు బాగా చూస్తారంటూ..

Siva Jyothi: బేబీబంప్ తో పెళ్లి పీటలు ఎక్కిన శివ జ్యోతి.. ఇలా కూడా చేస్తారా?

Kantara 2: వైకల్యాన్ని జయిస్తూ.. నోటితోనే కాంతార బిజీఎం!

Big Stories

×