All India Allu Arjun Fans & Welfare Association : మెగాస్టార్ చిరంజీవి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రస్తుతం ఉన్న చాలా మంది దర్శకులు మాత్రమే కాకుండా యంగ్ డైరెక్టర్స్ కూడా మెగాస్టార్ చిరంజీవికి అభిమానులనే చెప్పాలి. మెగా ఫ్యామిలీ నుంచి దాదాపు పదిమందికి పైగా హీరోలు ఉన్నారు. ఇప్పుడు తనకంటూ సొంత ఫ్యాన్ బేస్ క్రియేట్ చేసుకున్న కూడా ఒకప్పుడు మాత్రం అల్లు అర్జున్ ను కూడా మెగా ఫ్యామిలీ అని చెబుతూ ఉండేవాళ్ళు. గంగోత్రి సినిమాతో తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీకి హీరోగా ఎంట్రీ ఇచ్చాడు అల్లు అర్జున్. ఆ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద సక్సెస్ సాధించిన కూడా దర్శకుడు రాఘవేంద్రరావు ఒక మంచి పేరు వచ్చింది కానీ అల్లు అర్జున్ కు సరైన గుర్తింపు రాలేదు. సుకుమార్ దర్శకత్వం వహించిన ఆర్య సినిమాతో అల్లు అర్జున్ మంచి గుర్తింపును సాధించుకున్నాడు.
ఇక అల్లు అర్జున్ తన కెరియర్ లో ప్రత్యేకమైన సినిమాలు ఎంచుకుంటూ మంచి సక్సెస్ అందుకున్నాడు. ఈ ప్రాసెస్ లో కొన్ని సందర్భాల్లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మెగాస్టార్ చిరంజీవి గురించి మాట్లాడుతూ ఉండేవాడు. ఇక బోయపాటి శ్రీను దర్శకత్వంలో వచ్చిన సరైనోడు సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆ సినిమా ఫంక్షన్లో పవన్ కళ్యాణ్ ప్రస్తావన అభిమానులు తీసుకొచ్చినప్పుడు చెప్పడం బ్రదర్ అంటూ స్ట్రైట్ గా చెప్పేసాడు అల్లు అర్జున్. అక్కడితో అల్లు అర్జున్ మీద నెగిటివిటీ స్టార్ట్ అయింది. హరీష్ శంకర్ దర్శకత్వంలో వచ్చిన దువ్వాడ జగన్నాథం సినిమా ట్రైలర్ కూడా అప్పట్లో డిస్ లైక్స్ వచ్చాయి. ఇక తర్వాత కాలంలో మెగాస్టార్ చిరంజీవి జపం చేయడం మొదలుపెట్టాడు అల్లు అర్జున్.
రీసెంట్ టైంలో కంప్లీట్ గా మెగా ఫ్యామిలీని పక్కన పెట్టేసాడు బన్నీ. ఇప్పుడు బన్నీ ఎప్పుడు స్టేజ్ ఎక్కినా కూడా నా ఫ్యాన్స్ అంటే నాకు పిచ్చి, నాకు ఆర్మీ ఉంది ఎటువంటి మాటలు మాట్లాడటం మొదలుపెట్టాడు. ఇవి చాలామంది మెగా ఫ్యాన్స్ ను హర్ట్ చేస్తున్నాయి అని చెప్పాలి.ఇకపోతే పుష్ప 2 సినిమా విడుదలైన విషయం తెలిసింది. ఈ సినిమాలో కొన్ని డైలాగ్స్ మెగా ఫ్యామిలీ కు అన్వయిస్తున్నారు కొంతమంది అభిమానులు. అంతేకాకుండా చాలా టీవీ ఛానల్స్ లో డిబేట్ కూడా కూర్చుంటున్నారు. అయితే దీనిపై అల్లు అర్జున్ ఫ్యాన్స్ అసోసియేషన్ స్పందించి ఒక క్లారిటీ ఇచ్చింది. అల్లు అర్జున్ గారి తరుపున ఎవరైనా ఫాన్స్ అని చెప్పుకొని టివి మరియు యు ట్యూబ్ ఇంటర్వ్య్స్ ఇచ్చిన అది వారి వ్యక్తిగతం అంతే గాని వారి భావజాలానికి అధికారిక మద్దతు లేదా సపోర్ట్ ఉండదు. ఏ ఇతర హీరోల మీద లేదా రాజకీయం గా ఏ నాయకుల మీద అల్లు అర్జున్ ఫాన్స్ అని చెప్పి చేసే కామెంట్స్ మేము సపోర్ట్ చేయం అలాంటి అభిమానులను దూరంగా ఉంచటం జరుగుతుంది.
It has come to our attention that a few fans of Allu Arjun Garu have been participating in live debates on TV channels. We want to clarify that these individuals are in no way associated with our official fan association. Anyone engaging in such activities is doing so on their…
— All India Allu Arjun Fans & Welfare Association (@AIAFAOnline) December 6, 2024