Poonam Pandey : సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్లు అంటే ప్రత్యేకమైన క్రేజ్ ఉంటుంది. వాళ్లతో కలిసి సెల్ఫీలు దిగాలని, ఒక్కసారైనా వాళ్లతో మాట్లాడాలని కలలు కంటారు అభిమానులు. కానీ కొన్నిసార్లు అభిమానం హద్దులు దాటి హీరోయిన్లను ఇబ్బందులు పెడుతుంది. తాజాగా బాలీవుడ్ హీరోయిన్ పూనమ్ పాండే (Poonam Pandey)ను ఏకంగా రోడ్డుపైనే ఓ అభిమాని ముద్దు పెట్టుకోవడానికి ప్రయత్నించిన వీడియో వైరల్ అవుతుంది.
రోడ్డుపైనే హీరోయిన్ కి ముద్దు
పూనమ్ పాండే తరచుగా వివాదాలతో వార్తల్లో నిలుస్తుంది అన్న సంగతికి తెలిసిందే. అలాగే సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే ఈ అమ్మడు తరచుగా గ్లామర్ ట్రీట్ తో ఫాలోవర్స్ ను ఆకట్టుకుంటుంది. సినిమాల కంటే ఎక్కవగా ఆమె వివాదాలు, ఫోటోలు, వీడియోలతోనే అందరి దృష్టిని ఆకర్షిస్తుంది. తాజాగా ఈ అమ్మడు ఒక రెడ్ డ్రెస్ లో అందంగా ముస్తాబయి ఫోటోలకు ఫోజులిస్తూ రోడ్డుపై కనిపించింది.
అదే టైమ్ లో అటుగా వెళ్తున్న అభిమాని ఆమెకు దగ్గరగా వచ్చి సెల్ఫీ తీసుకుంటానని అడిగాడు. దానికి పూనమ్ పాండే అభ్యంతరం చెప్పకపోవడంతో… దగ్గర కెళ్ళి ఆమెను ముద్దు పెట్టుకోవడానికి ప్రయత్నించాడు. వెంటనే పూనమ్ అతడిని పక్కకు తోసేసి, అక్కడ నుంచి వెళ్ళిపోయింది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా, నెటిజన్లు “నడిరోడ్డు పై హీరోయిన్ కి ముద్దు పెట్టాలనుకున్నాడా… ఇలా ఉన్నాడు ఏంట్రా బాబూ” అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
హీరోయిన్ పై నెటిజన్లు ఫైర్…
అయితే నిజానికి ఈ ఘటనపై హీరోయిన్ పైనే ఎక్కువగా విమర్శలు వెలువెత్తుతున్నాయి. ‘నాన్నా పులి’ అనే కథ మనందరికీ తెలిసిందే. ఒకసారి, రెండుసార్లు ప్రాంక్ చేస్తే, నెక్స్ట్ టైమ్ నిజంగానే ఏదైనా జరిగిన ఎవ్వరూ పట్టించుకోరు. పూనమ్ విషయంలో కూడా ఇదే జరిగింది. ఇదంతా స్క్రిప్ట్ అని అంటున్నారు. పబ్లిసిటీ కోసం ఏమైనా చేస్తారా? సిగ్గుండాలి అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
2024 ఫిబ్రవరిలో పూనమ్ పాండే చనిపోయినట్టు ఆమె సోషల్ మీడియా వేదికగా ప్రకటించింది. కానీ కొన్ని రోజుల తర్వాత పూనమ్ స్వయంగా తన ఇంస్టాగ్రామ్ లో బ్రతికే ఉన్నానని చెప్పి ప్రాంక్ చేసింది. గర్భాశయ క్యాన్సర్ గురించి అవగాహన కల్పించడానికి ఆమె తాను చనిపోయినట్టు ఇలా ప్రాంక్ చేశానని వెల్లడించింది. దీంతో ఆమెపై తీవ్ర విమర్శలు వెల్లువెతాయి.
ఇక ఇటీవల పూనమ్ పాండే మహా కుంభమేళాలో కూడా దర్శనం ఇచ్చింది. జనవరి 29న ప్రయాగ్ రాజ్ లో మహా కుంభమేళాలో పాల్గొంది. అక్కడ పవిత్ర స్నానం ఆచరించి, దానికి సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. అక్కడి వాతావరణం, భక్తి తనను మూగబోయేలా చేశాయంటూ ఎమోషనల్ కామెంట్స్ చేసింది. తరచుగా వివాదాల్లో నిలిచే ఈ బ్యూటీతో ఓ అభిమాని అసభ్యకరంగా ప్రవర్తించాడు అంటూ వైరల్ అవుతున్న ఆ వీడియో ఫేక్ అని ఏకీపారేస్తున్నారు పూనమ్ పాండేని నెటిజన్లు. నెక్స్ట్ టైమ్ ఆమె విషయంలో నిజంగానే ఏదైనా జరిగినా అసలు పట్టించుకునే ఆలోచనలో లేరు జనాలు.
ये वही पूनम पांडे जिनका पिछली साल देहान्त हो गया था मगर बाद में वह ख़बर झूठी निकली थी!
एक जगह पर खड़ी पूनम के पास उनका एक फैन आता है और सेल्फी लेने के बहाने वो पूनम पांडे को Kiss करने की कोशिश करता है!
|#PoonamPandey|#bollywoodnews| pic.twitter.com/r11EVjZEAn
— Omkar Ugale (@Omkarugale2811) February 22, 2025