Mastan Sai Case :గత కొన్ని రోజుల క్రితం రాజ్ తరుణ్ (Raj Tarun) ప్రేయసి అని చెప్పుకుంటున్న లావణ్య (Lavanya) అనే అమ్మాయి.. మస్తాన్ సాయి (Mastan Sai) హార్డ్ డిస్క్ ను పోలీసులకు అప్పగించడంతో పోలీసులు ఆయనను అరెస్టు చేశారు. మూడు రోజులపాటు విచారణ నిర్వహించిన పోలీసులు విస్తుపోయే నిజాలు బయటపెట్టారు. మూడు రోజుల పాటూ మస్తాన్ సాయిని పోలీసులు విచారించగా.. అందుకు సంబంధించిన కన్ఫెషన్ రిపోర్ట్ వైరల్ గా మారింది. విచారణలో భాగంగా హార్డ్ డిస్క్, పార్టీలు, హ్యాక్ సాఫ్ట్వేర్, డ్రగ్స్ ఇలా అన్నింటి గురించి ప్రశ్నించినట్లు సమాచారం. అయితే డ్రగ్స్ పై మాత్రం మస్తాన్ సాయి నోరు విప్పలేదట. ముఖ్యంగా ఎక్కడి నుండి డ్రగ్స్ వచ్చాయి? ఎవరెవరికి సరఫరా చేశారు? అనే ప్రశ్నలకు మస్తాన్ సాయి ఎలాంటి సమాధానం ఇవ్వలేదని తెలుస్తోంది.
విచారణలో నిజం ఒప్పుకున్న మస్తాన్ సాయి..
ఇక హార్డ్ డిస్క్ గురించి పోలీసులు ప్రశ్నించగా.. కొంతమేర వివరణ ఇచ్చినట్లు సమాచారం. ఈ హార్డ్ డిస్క్లో మొత్తం 17 ఫోల్డర్లు ఉండగా.. ఆ 17 ఫోల్డర్లను మస్తాన్ సాయి ముందే పోలీసులు ఓపెన్ చేశారట. హార్ట్ డిస్క్లో మొత్తం ఆరుగురు అమ్మాయిలకు సంబంధించిన వీడియోలను కూడా పోలీసులు గుర్తించినట్లు తెలుస్తోంది. ఇక వీటిలో ఎక్కువగా వాట్స్అప్ వీడియో కాల్ స్క్రీన్ రికార్డింగ్స్ ఉన్నట్లు గుర్తించారు. లావణ్యతో పాటు మస్తాన్ సాయి గర్ల్ ఫ్రెండ్స్ అలాగే మస్తాన్ సాయి భార్యకు సంబంధించిన వీడియోలు కూడా ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. అలాగే కొన్ని నార్మల్ వీడియోలతో పాటు మరికొన్ని ప్రైవేట్ వీడియోలు కూడా ఉన్నాయట. ఇక హార్డ్ డిస్క్లో ఉన్న 17 హోల్డర్లలో సుమారుగా 2500 కు పైగా ఫోటోలు, 505 కి పైగా వీడియోలు, 734 ఆడియో రికార్డింగ్లను గుర్తించారు. అయితే ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే.. ఈ హార్డ్ డిస్క్ లో ఎక్కువగా లావణ్యకు సంబంధించిన ఫైల్స్ ఉన్నట్లు సమాచారం.
Naga Chaitanya – Shobhita: గొప్ప మనసు చాటుకున్న కొత్త జంట.. క్యాన్సర్ పిల్లల కోసం..!
లావణ్య ప్రైవేట్ వీడియోలపై స్పందించిన మస్తాన్ సాయి..
ఇక ఇద్దరికీ సంబంధించిన ప్రైవేట్ వీడియోలు.. వాళ్లకు తెలియకుండా రికార్డు చేసినట్లు మస్తాన్ సాయి ఒప్పుకున్నారు. లావణ్య ఫోన్ నుండి 734 ఆడియో కాల్ రికార్డింగ్స్ను quick Share ద్వారా వచ్చినట్లు గుర్తించారు. పోడు కాస్ట్ ఫోల్డర్లో ఫోన్ హ్యాక్ కు సంబంధించిన సాఫ్ట్వేర్ ని కూడా పోలీసులు గుర్తించినట్లు సమాచారం. ఏది ఏమైనా మస్తాన్ సాయిని మూడు రోజులపాటు విచారిస్తేనే ఇంత సమాచారం వచ్చిందంటే.. ఇంకొన్ని రోజులు విచారణ జరిపితే ఇంకా ఎలాంటి నిజాలు బయటపడతాయో అని అటు ఆడియన్స్ కూడా కామెంట్లు చేస్తున్నారు.
లావణ్య చెప్పిందంతా నిజమేనా..?
గత ఏడాది రాజ్ తరుణ్ తన బాయ్ ఫ్రెండ్ అని , తన దగ్గర డబ్బులు తీసుకున్నాడని, తనను ప్రేమించి, తల్లిని చేసి ఆఖరికి అబార్షన్ చేయించాడు అంటూ లావణ్య తెలిపింది. అంతేకాదు 10 సంవత్సరాల సహాజీవనం చేసిన తర్వాత ఒక హీరోయిన్ ప్రేమలో పడి తనను దూరం పెడుతున్నాడు అంటూ రాజ్ తరుణ్ పై పలు కామెంట్లు చేసింది లావణ్య. ఇప్పుడు మస్తాన్ సాయి హార్డ్ డిస్క్ ను పోలీసులకు అప్పగించి అతడిని అరెస్టు చేయించి పలు విషయాలు బయటపెడుతోంది . దీంతో నెటిజన్స్ అంతా లావణ్య చెప్పింది నిజమేనా అని సందేహాలు వ్యక్తం చేస్తున్నారు