ఒక ఫోటోతో బోలెడు కన్ఫ్యూజన్
ఇకపోతే సోషల్ మీడియాలో అమీర్ ఖాన్ అల్లు అర్జున్ కలిసి ఉన్న ఒక ఫోటో వైరల్ గా మారింది. దీనితో పలు రకాల వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. వీరిద్దరూ కలిసి మల్టీ స్టారర్ సినిమా చేస్తారు అని కొన్ని వార్తలు వచ్చాయి. అల్లు అరవింద్ నిర్మాతగా అమీర్ ఖాన్ తెలుగులో భారీ ప్రాజెక్టు చేయబోతున్నట్లు కూడా వార్తలు కూడా వచ్చాయి. ఇక బాలీవుడ్ లో అల్లు అర్జున్ స్ట్రైట్ ఎంట్రీ ఇవ్వబోతున్నాడు అంటూ కూడా విశ్వసనీయ వర్గాల సమాచారం. ఈ సినిమాకి అమీర్ ఖాన్ ప్రొడ్యూస్ చేస్తారు అంటూ కొంతమంది అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఏదేమైనా వీరిద్దరూ కలిసి ఏ ప్రాజెక్టు కోసం కలిశారు అనేది ఎవరికీ క్లారిటీ లేకుండా పోయింది. మీరు ముగ్గురితో ఉన్న ఫోటో ఇప్పుడు వైరల్ గా మారడంతో పలు రకాల ప్రాజెక్టును వీళ్ళ కంటే ముందు ఆడియన్స్ క్రియేట్ చేస్తున్నారు.
అట్లీ సినిమాతో మరో రేంజ్
ఇప్పుడు కంప్లీట్ గా అల్లు అర్జున్ రేంజ్ మారిపోయింది. అల్లు అర్జున్ నుంచి ఒక సినిమా వస్తుంది అంటే అది ఆల్ టైం ఇండస్ట్రీ హిట్ కలెక్షన్స్ ని కూడా ఎగరేస్తుంది అని కొంతమంది అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అట్లీ ఇదివరకే 1000 కోట్లు సినిమా తన కెరియర్ లో చేశాడు. అల్లు అర్జున్ కూడా అదే స్థాయి మార్కెట్ వచ్చింది. వీరిద్దరూ కాంబినేషన్లో సినిమా రాబోతుంది అంటే అందరి అంచనాలు విపరీతంగా పెరిగిపోయాయి. ఇక ఈ సినిమా తర్వాత త్రివిక్రమ్ తో చేయబోయే సినిమా నెక్స్ట్ లెవెల్ ఉంటుంది అని నాగ వంశీ పలు ఇంటర్వ్యూలో తెలిపాడు. ఏదేమైనా అమీర్ ఖాన్ అల్లు అర్జున్ కలిసి సినిమా చేస్తే మాత్రం అది ఊహకు కూడా అందని రేంజ్ లో ఉంటుంది.