E-Paper
Advertisement

SSMB29: జక్కన్నా.. రేపు ఒక చిన్న అప్డేట్.. ప్లీజ్

SSMB29: జక్కన్నా.. రేపు ఒక చిన్న అప్డేట్.. ప్లీజ్
Advertisement

SSMB29: సూపర్ స్టార్ మహేష్ బాబు ఫ్యాన్స్ పండగ మొదలెట్టేశారు. రేపు మహేష్ పుట్టినరోజు కావడంతో హడావిడి మొదలయ్యింది. ఇప్పటికే మురారి రీరిలీజ్ కోసం, ఆగస్టు 9 కోసం ఎంతలా ఎదురుచూస్తున్నారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎప్పుడెప్పుడు మురారి థియేటర్ కు వెళ్తామా.. ? అని కళ్ళు కాయలు కాసేలా ఎదురుచూస్తున్నారు.

ఎట్టకేలకు ఆ సమయం వచ్చేసింది. తెల్లారితే సోషల్ మీడియాలో మురారి వీడియోలు తప్ప ఇంకేమి కనిపించవు అని చెప్పడంలో ఆశ్చర్యం లేదు. ఇక ఏ స్టార్ హీరో బర్త్ డే వచ్చినా.. వారి కొత్త సినిమాల అప్డేట్స్ తో, కొత్త సినిమాల పోస్టర్స్ తో సోషల్ మీడియా షేక్ అవుతూ ఉంటుంది. రేపు మహేష్ బర్త్ డే కావడంతో.. రాజమౌళిని ఫ్యాన్స్ బతిమిలాడుకుంటున్నారు.

Advertisement

గుంటూరు కారం సినిమా తరువాత మహేష్ బాబు నటిస్తున్న చిత్రం SSMB29. రాజమౌళి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం ఇంకా సెట్స్ మీదకు వెళ్ళింది లేదు. ఆర్ఆర్ఆర్ వచ్చి రెండేళ్లు అవుతుంది. ఇప్పటివరకు జక్కన్న.. SSMB29 స్క్రిప్ట్ కూడా ఫినిష్ చేయలేదు. ఈ మధ్యనే స్క్రిప్ట్ ఫినిష్ అయ్యిందని వార్తలు రావడంతో కొంత భారం తగ్గిందని ఫ్యాన్స్ సంతోషపడ్డారు.

ఇక దానికి తోడు మహేష్.. తన లుక్ ను మార్చుకొనే ప్రాసెస్ లో ఉన్నాడు. గుబురు గడ్డం, లాంగ్ హెయిర్ పెంచుతూ వస్తున్నాడు. ఇక రేపు మహేష్ బర్త్ డే. ఈ సినిమా నుంచి ఒక అప్డేట్.. ఒక చిన్న అప్డేట్ అయినా పర్లేదు అని అభిమానులు ఆశపడుతున్నారు. ఎంత చిన్న అప్డేట్ అయినా పర్లేదు.. SSMB29 నుంచి ఏదైనా వదిలి మా హీరోకు బర్త్ డే విషెస్ చెప్పు జక్కన్నా అని ఫ్యాన్స్ రాజమౌళికి విజ్ఞప్తి చేస్తున్నారు. మరి ఫ్యాన్స్ వినతిని రాజమౌళి లెక్కలోకి తీసుకుంటాడా.. ? లేదా.. ? అనేది తెలియాలంటే రేపటి వరకు ఆగాల్సిందే.

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×