BigTV English

Viswak Sen : ఇలా అయితే కష్టం విశ్వక్… స్టైల్ మార్చాల్సిన టైం వచ్చేసింది..

Viswak Sen : ఇలా అయితే కష్టం విశ్వక్… స్టైల్ మార్చాల్సిన టైం వచ్చేసింది..

Viswak Sen : టాలీవుడ్ యంగ్ డైరెక్టర్ విశ్వక్ సేన్ గురించి అందరికి తెలుసు.. హీరోగా ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చిన అతి తక్కువ కాలంలోనే మాస్ హీరో అని ట్యాగ్ని పొందాడు. ప్రస్తుతం క్రేజీ హీరోలలో విశ్వక్ సేన్ ఒకరు.. గతేడాది బ్యాక్ టు బ్యాక్ చిత్రాలతో ప్రేక్షకులు ముందుకొచ్చి మంచి టాప్ని సొంతం చేసుకున్న ఈ హీరో ఏడాది మొదటి సినిమా లైలా తో ప్రేక్షకులు ముందుకు రాబోతున్నాడు. సినిమా ఈ నెలలో నేను రిలీజ్ కాబోతుంది. అయితే గతంలో మాస్ హీరోగా కనిపించిన ఈ హీరో ఇప్పుడు అమ్మాయి గెటప్ లో కనిపిస్తున్నాడు. దాంతో ఈ సినిమాపై కాస్త ఆసక్తి పెరిగేలా ఉంది.. అయితే విశ్వక్ సేన్ సినిమాలతో పాటుగా యాటిట్యూడ్ కూడా ఎక్కువే.. ఏదొక వార్తలపై స్పందిస్తూ ట్రోల్స్ కూడా వేయించుకుంటాడు. గతంలో ఇలాంటీ వాటిలో ఎక్కువగా ఈయన పేరు వినిపించింది. ఏదేమైన కూడా ఐ డోంట్ కేర్ అంటాడు విశ్వక్.. తాజాగా ఈ హీరో గురించి ఓ వార్త నెట్టింట చర్చనీయాంశంగా మారింది..


విశ్వక్ సేన్ సినిమాలు.. 

తెలుగు మాస్ హీరో విశ్వక్ సేన్ గత ఏడాది రెండు చిత్రాల్లో నటించాడు. గామి, గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి, మెకానిక్ రాఖీ సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.. ఆ సినిమాలు మూడు కూడా బాక్సాఫీస్ వద్ద మంచి టాక్ ని సొంతం చేసుకోవడంతో పాటు కలెక్షన్లను కూడా బాగానే రాబడ్డాయి. ముఖ్యంగా గామి సినిమాకు అనేక అవార్డులు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ ఏడాది ఫస్ట్ మూవీ లైలా మూవీ సినిమాతో ప్రేక్షకులను పలకరించేందుకు రెడీగా ఉన్నాడు. ఈ మూవీలో ద్విపాత్రాభినయం చేస్తున్నాడు. ‘లైలా’గా అమ్మాయి వేషంలో కనిపించబోతున్నాడు. మొదట్లో ఈ మూవీని అనౌన్స్ చేసినప్పుడు విశ్వక్ సేన్ అమ్మాయిగా ఉన్న ఫోటోని రిలీజ్ చేశారు. దీంతో మంచి బజ్ క్రియేట్ అయ్యింది. ఆ తర్వాత ప్రమోషన్లలో భాగంగా ఈ సినిమాలో విశ్వక్ డ్యూయల్ రోల్ పోషిస్తున్నట్టు వెల్లడించారు. మొత్తానికి ఫిబ్రవరి 14న వాలెంటైన్స్ డే కానుకగా ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. అయితే ఈ మూవీ రిలీబ్ టైమ్ దగ్గర పడుతున్నా కూడా ప్రమోషన్స్ లో జోరు లేదు.. ఏదో చప్పగా అలా కానిస్తున్నారు.. మూవీ జనాల్లోకి వెళ్లాలంటే ఇంకాస్త బజ్ ఉండాలి.. అప్పుడే సినిమాకు ఓపెనింగ్స్ దక్కే అవకాశాలు ఉన్నాయని ఫ్యాన్స్ అంటున్నారు.. ఇదిలా ఉండగా మరో న్యూస్ విశ్వక్ గురించి చక్కర్లు కొడుతుంది. అదేంటంటే..


పంథా మార్చుకోకుంటే కష్టమే.. 

హీరో విశ్వక్ సేన్ ఇప్పటివరకు తీసిన సినిమాలన్నీ టైటిల్ వేరైనా కదా ఇంచుమించు ఒకేలా ఉందని టాక్ వినిపిస్తుంది. విశ్వక్ సేన్ తన పంతా మార్చుకోకపోతే కష్టం.. లేకపోతే సీ క్లాస్ హీరో ముద్రపడిపోతుంది.. ఇప్పటివరకు వచ్చిన స్టోరీ లైన్, జానర్ ప్రేక్షకులకు రొటీన్ కథలను చూస్తున్న ఫీలింగ్ కలిగిస్తుందని తెలుస్తుంది.. ఇలాగే ఇలాంటి కథలను సినిమాలుగా తీస్తే విశ్వక్ మార్కెట్ పడిపోతుందని ఆయన ఫ్యాన్స్ తెగ ఫీల్ అయిపోతున్నారు. ఆ స్టైల్ గనుక మార్చుకోకుండా అంటే ఫ్యూచర్లో సినిమాలుకు దూరమయ్యే అవకాశం ఉందని వేరే సినిమాలు తీయాలని కోరుకుంటున్నట్లు వార్తలు సోషల్ మీడియాలో వినిపిస్తున్నాయి. కథలు మారితే విశ్వక్ తీరు కూడా మారుతుందని వాళ్ళు నమ్ముతున్నారు. మరి ఈ వార్తలపై విశ్వక్సేన్ ఎలా స్పందిస్తారో చూడాలి..

Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×