Srikrishna Wife’s Names: శ్రీకృష్ణుడికి ఎంత మంది భార్యలంటే ఎవరైనా 16వేల మంది భార్యలు అంటారు. కొంత మందైతే టక్కున ఎనిమిది మందే అని చెప్తారు. కానీ ఆ ఎనిమిది మంది పేర్లు చెప్పమంటే మాత్రం ఓ నలుగురి పేర్లు చెప్పి అక్కడితో ఆలోచనలో పడిపోతారు. నూటికో కోటికో ఒక్కరో.. ఇద్దరో శ్రీకృష్ణుడి భార్యలు పేర్లు మొత్తం తెలిసివాళ్లు ఉంటారు. ఇక ఆ ఎనిమిది మందిని కృష్ణుడు ఎలా పెళ్లి చేసుకున్నాడు. వారి పేర్లేంటో ఈ కథనంలో క్లియర్‌గా తెలుసుకుందాం.
శ్రీకృష్ణుడికి 8 మంది భార్యలు ఉన్నారు. వీరినే అష్ఠ మహిషులు అంటారు. ఇక నరకాసురుడిని సంహరించిన తర్వాత ఆ రాక్షసుడి చెరలో ఉన్న 16వేల మంది గోపికలను విడిపించాడు శ్రీకృష్ణుడు. దీంతో వారంతా మనసా వాచా కర్మనా కృష్ణుడిని తమ భర్తగా భావించారు. గోపీ వల్లభుడు కూడా వారికి తన ప్రేమను పంచాడు. అయితే తాళి కట్టి పెట్టి చేసుకున్నది మాత్రం ఎనిమిది మందిని మాత్రమే. ఇక రాధ కూడా కృష్ణుడి భార్య అంటారు కానీ అది తప్పు వాదన అనే ప్రచారం ఉంది. రాధకు కూడా కృష్ణుడు తన ప్రేమను పంచాడే తప్ప పెళ్లి చేసుకోలేదని పండితులు చెప్తుంటారు.
ALSO READ: నాగసాధువులు, అఘోరీలు ఒక్కటి కాదా? కళ్ళు బైర్లు కమ్మే నిజాలు
రుక్మిణి: శ్రీకృష్ణుడు మొదటిసారి పెళ్లి చేసుకుంది రుక్మిణిదేవినే. రుక్మిణీదేవిని లక్ష్మీదేవి అంశగా చెప్తారు. ఈమె విదర్భరాజు భీష్మకుని కుమార్తె. రుక్మిణిదేవికీ స్వయంవరం జరుగుతుంటే వెళ్లి ఆమెను ఎత్తుకెళ్లి కృష్ణుడు వివాహం చేసుకున్నాడట. అంటే రుక్మిణీ కృష్ణులది ప్రేమ పెళ్లి అన్నమాట.
సత్యభామ: సత్యభామ భూదేవి అంశగా చెప్తారు. ఈమె సత్రాజిత్తు కుమార్తె. సత్రాజిత్తు తను చేసిన తప్పిదానికి కృష్ణుడిని నిందించినందుకు ప్రాయశ్చిత్తంగా తన కూతురైన సత్యభామను ఇచ్చి పెళ్లి చేశాడట. సత్యభామనే గోదాదేవిగా అవతరించిందని కూడా చెప్తుంటారు.
జాంబవతి: జాంబవంతుడి కూతురే జాంబవతి. శమంతకమణి కోసం వెళ్లిన శ్రీకృష్ణుడు అది జాంబవంతుడితో ఉందని తెలుసుకుని యుద్దం చేస్తాడు. 28 రోజులు పాటు జరిగిన ఈ యుద్దంలో జాంబవంతుడు ఓడిపోతాడు. దీంతో మణితో పాటు తన కూతురు జాంబవతిని ఇచ్చి కృష్ణుడితో పెళ్లి చేస్తాడు.
మిత్రవింద: కృష్ణుడు చేసుకున్న మొదటి మేనరికం పెళ్లి మిత్రవింద. మిత్రవింద కృష్ణుడికి స్వయాన మేనత్త కూతురు. కృష్ణుడికి ఐదుగరు మేనత్తలు. వారిలో కుంతి, శృతదేవ, శృతకీర్తి, శృతశ్రవ, రాజాధిదేవి. చిన్న మేనత్త అయిన రాజాధిదేవి, జయశేనుడిల కూతురే మిత్రవింద. ఇంట్లో వాళ్లకు ఇష్టం లేకపోయినా స్వయంవరంలో కృష్ణుడిని పెళ్లి చేసుకుంది. మిత్రవింద కోరిక మేరకే కృష్ణుడు స్వయంవరంలో మిగతా రాజకుమారులను ఓడించి ఆమెను వివాహం చేసుకున్నాడు.
ALSO READ: జన్మజన్మల్లో వెంటాడే కర్మలు అవేనట – మీరు ఏ కర్మలు చేశారో తెలుసా..?
భద్ర: శ్రీకృష్ణుడి మరో మేనత్త అయిన కేకయ దేశపు పట్టమహిసి అయిన శృతకీర్తి కూతురే భద్ర. ఈమెను కృష్ణుడు పెద్దలందరి సమక్షంలో అందరి ఇష్టంతోనే పెళ్లి చేసుకున్నాడట.
నాగ్నజిత్తి: నాగ్నజిత్తి అసలుపేరు సత్య. నాగ్నజితి కోసల దేశాధిపతియైన నాగ్నజిత్తు కుమార్తె. ఈ రాజు తన నగరంలోని ఏడు ఎద్దులను లొంగదీసుకున్న వాడికే తన కూతురు అయిన సత్యను ఇచ్చి పెళ్లి చేస్తానని చెప్పడంతో.. శ్రీకృష్ణుడు వెళ్లి ఆ ఏడు ఎద్దులను లొంగదీసుకుని సత్యను పెళ్లి చేసుకున్నాడట.
కాళింది: ఈమె సూర్యుని కూతురు. శ్రీ మహా విష్ణువును పెళ్లి చేసుకోవాలని ఘోరంగా తప్పస్సు చేస్తుంది. ఆ తప ఫలితమే శ్రీకృష్ణుడు కాళిందిని పెళ్లి చేసుకున్నాడని చెప్తారు. ఒక సందర్భంలో యమునా నదిలో కృష్ణార్జునులు స్నానం చేయడానికి వెళితే అక్కడ అర్జునుడికి కాళింది కనిపించిందట. ఆవిడ వివరాలు తెలుసుకున్న అర్జునుడే మధ్యవర్తిగా కృష్ణుడిని ఒప్పించాడట. దీంతో కాళిందిని ఇంటికి తీసుకెళ్లిన కృష్ణుడి అందరి ముందు ఆమెను పెళ్లి చేసుకున్నాడట.
లక్షణ: మద్రదేశ రాజకుమారి లక్షణ. నారదుని ద్వారా శ్రీకృష్ణుడి గురించి తెలుసుకుని పెళ్లంటూ చేసుకుంటే కృష్ణుడినే చేసుకోవాలని అనుకుందట. తర్వాత నారదుడి ద్వారానే తన ప్రేమ విషయం కృష్ణుడికి చేరవేయడంతో కృష్ణుడు కూడా స్వయంవరంలో లక్షణను పెళ్లి చేసుకున్నారని చెప్తారు.
ఇలా శ్రీకృష్ణుడు ఎనిమిది భార్యలను పెళ్లి చేసుకున్నాడు. అయితే ఈ మధ్య వచ్చిన మగధీర సినిమాలో హీరోయిన్ కాజల్ పేరు కూడా మిత్రవింద. ఆ సినిమా రిలీజ్ అయ్యాక మిత్రవింద అనే పేరు కూడా చాలా ట్రెండ్ అయ్యింది.
ALSO READ: 2025 లో విపరీతమైన ధనయోగం పట్టబోయే ఐదు రాశులు ఇవే – అందులో మీ రాశి ఉందో లేదో చూసుకోండి