BigTV English

Manchu Manoj Glimpse from Mirai: అన్నా.. ఏంటన్నా ఆ ఫైట్స్.. ఏమన్నా ఉందా గ్లింప్స్.. గూస్ బంప్స్ అంతే!

Manchu Manoj Glimpse from Mirai: అన్నా.. ఏంటన్నా ఆ ఫైట్స్.. ఏమన్నా ఉందా గ్లింప్స్.. గూస్ బంప్స్ అంతే!

Manchu Manoj First Look Glimpses from Mirai: యంగ్ నటుడు తేజ సజ్జ ‘హనుమాన్’ మూవీతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు. ఒక చిన్న సినిమాగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా భారీ రికార్డులను సైతం నెలకొల్పింది. ప్రపంచవ్యాప్తంగా ఈ మూవీ సంచలనం సృష్టించింది. ఈ మూవీతో నటుడు తేజ సజ్జ పేరు మారు మోగిపోయింది. దీంతో అతడికి వరుస ఆఫర్లు వెల్లువెత్తాయి. అందులో ఇప్పుడు ఓ భారీ బడ్జెట్ మూవీ చేస్తున్నాడు.


రవితేజ ‘ఈగల్’ ఫేమ్ కార్తిక్ ఘట్టమనేని దర్శకత్వంలో ‘మిరాయ్’ మూవీ చేస్తున్నాడు. ఈ మూవీపై సినీ ప్రేక్షకాభిమానుల్లో అంచనాలు భారీ స్థాయిలో ఉన్నాయి. అంతేకాకుండా ఇదివరకు రిలీజ్ చేసిన తేజ ఫస్ట్ లుక్ గ్లింప్స్ మరింత హైప్ క్రియేట్ చేశాయి. ఈ గ్లింప్స్‌లో తేజ మాస్ లుక్‌లో కనిపించి అదరగొట్టేశాడు. మాస్ ఫైట్ సీన్లతో ఫుల్ యాక్షన్ మోడ్‌లో ఉన్న తేజను చూసి అంతా షాక్ అయ్యారు.

తేజ సజ్జలో ఈ యాంగిల్ కూడా ఉందా అని అంతా ఆశ్చర్యపోయారు. ఈ గ్లింప్స్‌తో తేజ మరొక బ్లాక్ బస్టర్ హిట్ కొట్టేయడం ఖాయమని అభిమానులు సైతం చర్చించుకుంటున్నారు. ఇదిలా ఉంటే ఈ మూవీ షూటింగ్ ప్రస్తుతం శర వేగంగా జరుగుతోంది. ఇందులో టాలీవుడ్ నుంచి మరొక యంగ్ హీరో నటిస్తున్నాడు. తన భీకర వాయిస్‌తో సినీ ప్రియులను సైతం భయపెట్టే నటుడు మంచు మనోజ్ ఈ మూవీలో నటిస్తున్నాడు.


Also Read: మంచు మనోజ్ ‘మిరాయ్’ కత్తి లుక్ మామూలుగా లేదు భయ్యా..

ఇవాళ మంచు మనోజ్ బర్త్ డే కావడంతో ‘మిరాయ్’ సినిమా నుంచి అదిరిపోయే సర్ప్రైజ్‌ను మేకర్స్ అందించారు. ఇందులో బాగంగా మేకర్స్ ఓ మాస్ గ్లింప్స్‌ను రిలీజ్ చేశారు. ఈ గ్లింప్స్ చూస్తుంటే మావా.. మతిపోతుంది. ఇందులో మనోజ్ లుక్స్, స్టైల్, స్వాగ్, అబ్బో అదిరిపోయాయి. ఇందులో బ్లాక్ స్వార్డ్‌గా ఇందులో కనిపించబోతున్నాడు.

ముందుగా గ్లింప్స్‌లో చూపిన ప్రకారం.. మంచు మనోజ్ కత్తి పట్టుకుని విలన్‌లను హతమార్చిన తీరు చూడవచ్చు. అతడి ఫైట్ సీన్లు చూస్తే మతి పోతుంది. ఒక వైపు నుంచి చూస్తే అచ్చం రామ్ చరణ్ మాదిరిగానే ఉన్నాడు. ఏది ఏమైనా అతడి లుక్, ఫైట్ సీన్లు సినీ ప్రేక్షకుల్ని మంత్రముగ్దులను చేశాయనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇక అన్ని పనులు పూర్తి చేసుకుని ఈ మూవీ వచ్చే ఏడాది ఏప్రిల్ 18న గ్రాండ్‌గా 3డి వెర్షన్‌లో రిలీజ్ కానుంది.

Also Read: Actress Yami Gautham: శుభవార్త.. మగబిడ్డకు జన్మనిచ్చిన స్టార్ హీరోయిన్

Tags

Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×