Janhvi Kapoor: అందాల అతిలోక సుందరి శ్రీదేవి ముద్దుల తనయగా బాలీవుడ్ ఇండస్ట్రీలో అడుగుపెట్టింది జాన్వీ కపూర్. అందంలో తల్లిని ఏ మాత్రం తీసిపోని జాన్వీ.. అభినయంలో కూడా తల్లిని మించిన కూతురు అనిపించుకోవాలని కష్టపడుతుంది. నిజం చెప్పాలంటే జాన్వీకి ఇప్పటివరకు అంతగా పేరు దక్కలేదనే చెప్పాలి.
ఇక ఈ ముద్దుగుమ్మ దేవర సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇస్తుంది. జాన్వీ.. బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చినప్పటి నుంచి తెలుగులో ఈ చిన్నది ఏ స్టార్ హీరో సినిమాతో ఎంట్రీ ఇస్తుందా.. ? అని ప్రేక్షకులు వెయ్యి కళ్ళతో ఎదురుచూసారు. ఎట్టకేలకు ఎన్టీఆర్ సినిమాతో జాన్వీ ఎంట్రీ షురూ అయ్యింది. ఇక జాన్వీ కూడా .. తనకు ఎన్టీఆర్ తో నటించాలని ఉందని, అతని పక్కన నటించే ఛాన్స్ రావాలని దేవుడిని సైతం మొక్కుకుందంట.
దేవుడు కరుణించి..జాన్వీ మొదటి సినిమానే ఎన్టీఆర్ సరసన నటించే అవకాశం ఇప్పించాడు. దేవర సినిమాలో జాన్వీ నటిస్తుంది అని తెలియగానే.. సినిమాపై హైప్ వేరే లెవెల్ కు వెళ్ళిపోయింది. ఇక ఈ సినిమా నుంచి రిలీజైన పోస్టర్స్ లో తంగం అనే పాత్రలో జాన్వీ కనిపించనుంది. ఒక విలేజ్ అమ్మాయిలా జాన్వీ లంగా వోణిలో ఎంతో అద్భుతంగా కనిపించింది.
జాన్వీ అందాల ఆరబోత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇక డ్యాన్స్ లో కూడా అమ్మడిని తీసిపారేయడానికి లేదు. చుట్టమల్లే సాంగ్ లో కూడా ఎన్టీఆర్, జాన్వీ మధ్య రొమాన్స్ నెక్స్ట్ లెవెల్ లో ఉంది. కానీ, డ్యాన్స్ స్టెప్స్ ఎక్కువగా లేకపోవడంతో అందరి చూపు. దానిమీద పడలేదు. కానీ, ఈరోజు రిలీజ్ అయినా దావూదీ సాంగ్.. ఫ్యాన్స్ కు పూనకాలు తెప్పించింది.
ఎన్టీఆర్ డ్యాన్స్ ఎలా ఉంటుందో తెలుగు ప్రేక్షకులకు చెప్పాల్సిన అవసరం లేదు. టాలీవుడ్ లోనే ది బెస్ట్ డ్యాన్సర్స్ లో ఎన్టీఆర్ ఒకడు. ఇక ఎన్టీఆర్ ఈజ్ గా డ్యాన్స్ చేస్తుంటే.. పక్కన ఎంత అందాల రాశి ఉన్నా ప్రేక్షకుడు ఆమె వంక చూడడు అన్నది నమ్మదగ్గ విషయం.
ప్రస్తుతం దావూదీ విషయంలో కూడా అదే జరిగింది. ఆ లిరిక్స్ కు తగ్గట్టు ఎన్టీఆర్ మాస్ స్టెప్స్ వేస్తుంటే .. జాన్వీ తేలిపోయింది. మెరిసే ముఖంతో ఎన్టీఆర్ మాత్రమే కనిపిస్తున్నాడు అని చెప్పొచ్చు. ఎన్టీఆర్ స్టెప్స్ వేస్తుంటే.. పక్కన జాన్వీ కానీ, వెనుక ఉన్న డ్యాన్సర్లు కానీ తేలిపోయారు అని చెప్పొచ్చు.
అంతేకాకుండా ఈ రేంజ్ లో ఎన్టీఆర్ డ్యాన్స్ చేసి చాలా రోజులు అయ్యిందని అని చెప్పుకొస్తున్నారు. మొత్తానికి చుట్టమల్లే సాంగ్ కన్నా దావూదీ కే డ్యాన్స్ ఓటేస్తున్నారు. మరి ఈ సాంగ్ కు థియేటర్ లో ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో చూడాలంటే సెప్టెంబర్ 27 వరకు ఆగాల్సిందే.