BigTV English

Vishnu Manchu: స్పిరిట్ లో ఛాన్స్.. ప్రభాస్ ను బాగా వాడుతున్నారుగా మా ప్రెసిడెంట్ గారు

Vishnu Manchu: స్పిరిట్ లో ఛాన్స్.. ప్రభాస్ ను బాగా వాడుతున్నారుగా మా ప్రెసిడెంట్ గారు

Vishnu Manchu: మంచు వారబ్బాయి విష్ణు.. కన్నప్ప కోసం ప్రభాస్ ను ఓ రేంజ్ లో వాడేస్తున్నాడు. మోహన్ బాబు నటవారసుడుగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన విష్ణు కెరీర్ మొదట్లో మంచి సినిమాలలోనే నటించాడు. అయితే ఉన్నా కొద్దీ మంచు ఫ్యామిలీ విమర్శల పాలు అవ్వడంతో.. అసలు ఆ ఫ్యామిలీ నుంచి వచ్చే సినిమాలు ట్రోల్ ఆవాసం మొదలుపెట్టాయి. చివరికి మోహన్ బాబు నటించిన సినిమా రిలీజ్ అయినా కూడా ట్రోల్ చేయడం మొదలుపెట్టారు. అందుకు కారణం  బయట వారు సొంత డబ్బా కొట్టుకోవడమే. మంచు హీరోల్లో మనోజ్ ఒక్కడే కాస్తా ఈ ట్రోలింగ్ కు దూరంగా ఉన్నాడు.


ఇక చాలా గ్యాప్ తరువాత విష్ణు నటిస్తున్న చిత్రం కన్నప్ప. ముకేశ్ కుమార్ సింగ్ దర్శకత్వం వహించిన ఈ సినిమాను మోహన్ బాబు ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించాడు. ఇక ఈ చిత్రంలో మంచు విష్ణు సరసన ప్రీతీ ముకుందన్ నటిస్తుండగా.. ఇండస్ట్రీలోని స్టార్స్ అందరూ క్యామియోలో నటిస్తున్నారు. మోహన్ బాబు, ప్రభాస్, శరత్ కుమార్, మోహన్ లాల్, అక్షయ్ కుమార్, కాజల్ అగర్వాల్, మధుబాల తదితరులు నటిస్తున్నారు. ఇప్పటివరకు ఈ సినిమా నుంచి రిలీజైన పోస్టర్స్  ట్రోలింగ్ కు గురైనా.. మొదటి సాంగ్ శివ శివ శంకర మంచి పాజిటివ్ టాక్ ను అందుకుంది. 

కన్నప్ప పాన్ ఇండియా లెవెల్లో ఏప్రిల్ 25 న రిలీజ్ కు రెడీ అవుతుంది. రిలీజ్ డేట్ దగ్గరపడుతుండడంతో ప్రమోషన్స్  పెంచిన విష్ణు.. ఈసారి ఏది వదలకుండా ప్రేక్షకుల దగ్గరకు చేరాలా అన్ని ప్రయత్నాలు చేస్తున్నాడు. కన్నప్పకు హైలైట్ అంటే ప్రభాస్ నే. అసలు ఒక పాన్ ఇండియా స్టార్.. మోహన్ బాబు అడగగానే ఒక చిన్న పాత్ర కోసం ఒప్పుకున్నాడు అంటే.. అతను స్నేహానికి ఎంత విలువ ఇస్తాడో  తెలుస్తోంది. అందులోనూ ఈ పాత్రకు డార్లింగ్ ఒక్క రూపాయి కూడా తీసుకోలేదట. 


Brahmanandam: ‘నా మిస్టేక్ కూడా ఉంది’… కొడుకుల కెరీర్‌ విషయంలో తప్పు ఒప్పుకున్న బ్రహ్మీ..!

ప్రభాస్ కోసం అయినా ఫ్యాన్స్ థియేటర్ కు వస్తారని మంచు విష్ణు బాగానే ప్లాన్ చేశాడు. ఇక గత మూడు రోజులుగా ప్రభాస్ నటిస్తున్న కొత్త చిత్రం స్పిరిట్ కోసం క్యాస్టింగ్ కాల్ నడుస్తున్న విషయం తెల్సిందే. అర్జున్ రెడ్డి, యానిమల్ సినిమాలతో ఇండస్ట్రీ మొత్తాన్ని తన అభిమానులుగా మార్చుకున్న సందీప్ రెడ్డి వంగా ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. భద్రకాళీ పిక్చర్స్ నిర్మిస్తున్న ఈ సినిమాలో ప్రభాస్ పోలీసాఫీర్ గా కనిపించనున్నాడు.

స్పిరిట్ లో నటించడానికి నటీనటులు కావాలి అని భద్రకాళీ పిక్చర్స్ సోషల్ మీడియా ద్వారా తెలిపింది. ఆసక్తి ఉన్నవారు రెండు ఫొటోలతో పాటు మీరు ఏమా చెప్పాలనుకుంటున్నారో దాన్ని ఒక వీడియో రూపంలో పంపించమని కోరారు. ఇక ఈ పోస్ట్ కు మంచు విష్ణు స్పందించాడు. ” యో .. నేను కూడా అప్లై చేశాను. ఇప్పుడు నేను కూడా వేచిచూస్తున్నాను” అంటూ రాసుకొచ్చాడు. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట వైరల్ గా మారింది. ఈ పోస్ట్ చూసిన ప్రభాస్ ఫ్యాన్స్.. వద్దులే అన్నా వదిలేయ్.. పాపం హిట్ అయ్యే సినిమా అని కొందరు. అంటే ఏంటి.. కన్నప్ప లో ఛాన్స్ ఇచ్చావని.. స్పిరిట్ లో ఛాన్స్ ఇవ్వమంటావా.. ? అని ఇంకొందరు సరదాగా కామెంట్స్ చేస్తున్నారు.  మరికొంతమంది ఏ వాడకం అయ్యా.. ప్రభాస్ ను బాగా వాడుతున్నావ్ గా అని చెప్పుకొస్తున్నారు.

Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×