Ram Charan: స్టార్ హీరోలు ఏ సినిమా చేసిన.. అంతకుముందున్న రికార్డులే బీట్ చేయడమే టార్గెట్‌గా చూస్తారు. ఒకప్పుడు థియేటర్లో సినిమా ఎన్ని రోజులు ఆడితే.. సినిమా అంత పెద్ద బ్లాక్ బస్టర్. కానీ ఇప్పుడు ఎంత ఎక్కువ కలెక్షన్స్ రాబడితే.. అంత పెద్ద హిట్. డే వన్ నుంచి థియేటర్ నుంచి వెళ్లిపోయేవరకు కలెక్షన్స్ షేర్ చేస్తునే ఉంటారు మూవీ మేకర్స్. ఇక స్టార్ హీరోల అభిమానులు చేసే అరాచకం మామూలుగా ఉండదు. మా హీరో గొప్ప అంటే, మా హీరో గొప్ప అంటూ.. సోషల్ మీడియాలో గొప్పలు పోతుంటారు. ఒకప్పుడు ఆఫ్‌లైన్‌లో కొట్టుకునే వారు.. ఇప్పుడు మాత్రం సోషల్ మీడియా వేదికగా కొట్టుకుంటున్నారు. రికార్డులు మొదలుకొని కటౌట్‌ల వరకు పోటీ పడుతునే ఉన్నారు అభిమానులు. ఇక్కడ కూడా రామ్ చరణ్ కటౌట్ రికార్డ్‌ని బ్రేక్ చేసి కొత్త రికార్డ్ కొట్టేద్దమాని అనుకున్నారేమో.. లేదో తెలియదు గానీ, కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ ఫ్యాన్స్‌కు మాత్రం చేదు అనుభవం ఎదురైంది. అంతేకాదు.. భారీ ప్రమాదం నుంచి తృటిలో తప్పించుకున్నారు.
అజిత్ భారీ కటౌట్.. తప్పిన ప్రమాదం
కోలీవుడ్ స్టార్ అజిత్ కుమార్ (Ajith Kumar) తాజా చిత్రం ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ (Good Bad Ugly) ఏప్రిల్ 10న భారీ ఎత్తున విడుదలకు సిద్ధమవుతోంది. ఈ సినిమాకు యంగ్ డైరెక్టర్ అధిక్ రవిచంద్రన్ దర్శకత్వం వహిస్తున్నారు. టాలీవుడ్‌లో ప్రముఖ నిర్మాణ సంస్థగా పేరుగాంచిన మైత్రీ మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్‌తో నిర్మిస్తోంది. ఈ సినిమా ద్వారా మైత్రీ మూవీస్ తమిళ చిత్రసీమలోకి అడుగుపెడుతోంది. ఇక ఈ సినిమా రిలీజ్ సందర్భంగా.. అజిత్ అభిమానులు భారీ కటౌట్ ఏర్పాటు చేశారు. ఇప్పటికే తమిళ నాట థియేటర్ల దగ్గర బ్యానర్లు, కటౌట్‌లతో సందడి కనిపిస్తోంది. ఈ క్రమంలో.. తమిళనాడులోని తిరునల్వేలిలోని పిఎస్ఎస్ మల్టీప్లెక్స్ వద్ద అజిత్ అభిమానులు 285 అడుగుల అతిపెద్ద కటౌట్‌ను ఏర్పాటు చేశారు. దీని కోసం ఇనుప రాడ్లతో ఎత్తైన నిర్మాణాన్ని తయారు చేశారు. కానీ, ఆ బరువును తట్టుకోలేక కటౌట్ ఒక్కసారిగా కూలిపోయింది. అదృష్టవశాత్తూ, అక్కడ ఉన్నవారు వెంటనే పరుగెత్తడంతో ఎవరికీ గాయాలు కాలేదు.
రామ్ చరణ్‌దే భారీ కటౌట్
రామ్ చరణ్ (Ram Charan) నటించిన గేమ్ ఛేంజర్ సినిమా రిలీజ్ సమయంలో.. విజయవాడలో 256 అడుగుల భారీ కటౌట్ ఏర్పాటు చేసి రికార్డ్ క్రియేట్ చేశారు మెగాభిమానులు. ఇప్పుడు ఈ రికార్డ్‌ను బ్రేక్ చేసేలా అజిత్ 285 అడుగుల భారీ కటౌట్‌ను ఏర్పాటు చేసే ప్రయత్నం చేశారు. కానీ ఈ కటౌట్ కూలిపొవడంతో.. ఫ్యాన్స్ డిసప్పాయింట్ అవుతున్నారు. కానీ ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు. ఇక గుడ్ బ్యాడ్ అగ్లీ సినిమాలో త్రిష కృష్ణన్ అజిత్ సరసన హీరోయిన్‌గా నటిస్తోంది. జీవి ప్రకాష్ సంగీతం అందిస్తున్నాడు. అలాగే.. ఈ చిత్రంలో ప్రభు, ప్రసన్న, అర్జున్ దాస్, సునీల్ వంటి నటులు ముఖ్యమైన పాత్రల్లో కనిపించనున్నారు. ఈ సినిమా పై తల అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. ఇప్పటికే విడుదలైన పోస్టర్స్ సినిమాపై భారీ అంచనాలను కలిగించగా, తాజాగా ట్రైలర్ రిలీజ్ చేయగా మంచి రెస్పాన్స్ వచ్చింది.