Ashleigh Gardner-Monica Marriage : ఆస్ట్రేలియా మహిళా క్రికెటర్, స్టార్ ఆల్ రౌండర్ ఆష్లీ గార్డనర్ వివాహ బంధంలోకి అడుగు పెట్టింది. తన చిరకాల ప్రేయసి మోనికా రైట్ ను వివాహం చేసుకుంది. ఈ శుభవార్తను సోషల్ మీడయా వేదికగా అభిమానులతో గార్డనర్ పంచుకుంది. 2021 నుంచి డేటింగ్ ఉన్న వీరిద్దరూ గత ఏడాది ఏప్రిల్ లో నిశ్చితార్థం చేసుకున్నారు. ఇప్పుడు పెళ్లి బంధంతో ఒక్కటయ్యారు. ఈ విషయాన్ని సోషల్ మీడియాలో గార్డనర్ వెల్లడించారు. Mrs & Mrs Gadner అంటూ తమ వెడ్డింగ్ కార్డు ఫోటోను పోస్టు చేశారు.
ఆమె ఈ ఏడాది WPL లో గుజరాత్ జేయింట్స్ జట్టుకు కెప్టెన్ గా వ్యవహరించారు. ఈ వివాహానికి ఆస్ట్రేలియా స్టార్ క్రికెటర్లు అలిస్సా హిలీ, ఎల్లీస్ పెర్రి, కిమ్ గార్త్, ఎలీస్ విల్లా వంటి వారు హాజరయ్యారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మహిళల క్రికెట్ లో సేమ్ జెండర్ పెళ్లిల్లు కామన్ అయిపోయాయి.
న్యూజిలాండ్ కి చెందిన అమీ సాటర్ వైట్-తన సహచరి లియా, ఇంగ్లండ్ స్టార్ పేర్లు స్కివర్ -కేథరిన్ బ్రంట్, సౌతాఫ్రికా మాజీ కెప్టెన్ డేన్ వాన్ నికెర్క్ -కాప్, డానియెల్ వ్యాట్, జార్జీ హోడ్జ్ జంటలు ఈ కోవకు చెందిన వారే. ఇక గార్డనర్ విషయానికి వస్తే.. ఆస్ట్రేలియా జట్టులో కీలక ప్లేయర్ గా కొనసాగుతోంది. మహిళల ప్రీమియర్ లీగ్ లో గుజరాత్ జెయింట్స్ కెప్టెన్ ఆమె వ్యవహరిస్తోంది. గార్డనర్ 2017లో న్యూజిలాండ్ తో జరిగిన టీ-20 మ్యాచ్ లో అంతర్జాతీయ అరంగేట్రం చేసింది.
ఇప్పటి వరకు ఈ స్టార్ ఆల్ రౌండర్ ఆస్ట్రేలియా మహిళల జట్టు తరపున 7 టెస్టులు, 77 వన్డేలు, 96 టీ-20లు ఆడింది. మూడు ఫార్మాట్లలో 3000 కి పైగా పరుగులు చేసింది గార్డనర్. 207 వికెట్లను కూడా పడగొట్టింది. అదేవిధంగా 2018, 2020, 2023, టీ 20 ప్రపంచ కప్ లను సొంతం చేసుకున్న ఆస్ట్రేలియన్ మహిళల జట్టులో గార్డరన్ భాగంగా ఉంది. ఆష్లీ గార్డనర్ క్రికెట్ కెరీర్ కూడా చాలా గొప్పగా ఉంది. ఆమె ఫిబ్రవరి 2017లో మెల్ బోర్న్ క్రికెట్ గ్రౌండ్ లో న్యూజిలాండ్ తో జరిగిన టీ 2 మ్యాచ్ లో తన అంతర్జాతీయ ఆరంగేట్రం చేసింది.
ఇక అప్పటి నుంచి ఇప్పటి వరకు గార్డనర్ ఆస్ట్రేలియా తరపున మ్యాచ్ లు ఆడుతుంది. ఆమె కుడి చేతి వాటం ఆఫ్ బ్రేక్ బౌలింగ్ తో పాటు బ్యాటింగ్ లో కూడా తన సమర్థతను చాటుతూ అన్ని ఫార్మాట్లలో కలిపి 3వేలకు పైగా పరుగులు చేసింది. 207 వికెట్లను పడగొట్టింది. ఆస్ట్రేలియా జట్టు ఎన్నో విజయాల్లో గార్డనర్ కీలక పాత్ర పోషించిందనే చెప్పవచ్చు. 2022లో న్యూజిలాండ్ లో జరిగిన వన్డే ప్రపంచ కప్ ను గెలుచుకున్న జట్టులో ఆమె నిలకడగా తన ప్రతిభను చాటింది. ఆల్ రౌండర్ గా ఆమె క్రికెట్ లో చూపిస్తున్న స్థిరత, ఆమె వ్యక్తిగత జీవితం సానుకూలంగా సాగుతున్న తీరు కలిసి గార్డనర్ జీవితాన్ని మరింత స్పూర్తిదాయకంగా మార్చుతున్నాయి. క్రికెట్ మైదానంలో విజయాలు సాధించినట్టే.. ఆమె వ్యక్తి గత జీవితం కూడా సంతోసంగా సాగాలని అభిమానులు కోరుతున్నారు.