Excise duty on petrol and diesel: కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పెట్రోల్, డీజిల్ పై ఎక్సైజ్ డ్యూటీ కేంద్ర ప్రభుత్వం పెంచింది. లీటర్ పై రూ.2 ఎక్సైజ్ డ్యూటీని పెంచుతూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. నేటి అర్థరాత్రి నుంచి పెంచిన ఎక్సైజ్ డ్యూటీ అమలులోకి రానున్నట్లు కేంద్ర ప్రభుత్వం పేర్కొంది.
యూఎస్ఏ పరస్పర సుంకాల వల్ల ప్రపంచ వాణిజ్య యుద్దం వస్తుందనే భయాల నేపథ్యంలో, ప్రపంచ ముడి చమురు ధరలు వాస్తవానికి తగ్గుతున్న సమయంలో కేంద్రం ఈ పెంపు నిర్ణయం తీసుకుంది. ద్రవ్యోల్బణ ఒత్తిళ్లను ఎదుర్కొంటున్న వినియోగదారులపై పెట్రోల్, డీజిల్ రేట్ల పెంపు ప్రభావం చూపనుంది. ఈ ధరల పెంపు పరోక్షంగా అన్ని రంగాలపై ప్రభావం చూపనుంది.
ALSO READ: IDBI Recruitment: డిగ్రీతో ఐడీబీఐలో ఉద్యోగాలు.. ఎలాంటి ఎగ్జామ్ లేదు.. లక్షల్లో జీతాలు భయ్యా..
ధరల్లో ఎలాంటి మార్పులు చేయొద్దు.. ఆయిల్ కంపెనీలకు కేంద్ర సూచన
అయితే పెట్రోల్, డీజిల్ ధరలపై లీటర్ కు రూ.2 చొప్పున విధించిన ఎక్సైజ్ డ్యూటీపై కేంద్ర ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది. ఈ పెంపు భారం ప్రజలపై ఉండదని పేర్కొంది. ఎక్సైజ్ సుంకం ఆయిల్ కంపెనీలే భరిస్తాయని ప్రకటించింది. ఈ మేరకు రిటైల్ ధరల్లో మార్పులు చేయొద్దని ఆయిల్ కంపెనీలకు కేంద్రం ప్రభుత్వం సూచించింది. దీంతో పెట్రోల్, డీజిల్ ధరల్లో ఎలాంటి మార్పులు చోటుచేసుకోవు.
వంట గ్యాస్ సిలిండర్ ధరను కూడా పెంచిన కేంద్రం
మరోవైపు దేశ వ్యాప్తంగా వంట గ్యాస్ సిలిండర్ ధరలను కూడా కేంద్రం ప్రభుత్వం పెంచుతూ నిర్ణయం తీసుకుంది. గృహావసరాలకు వినియోగించే 14.2 కిలోల ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ పై రూ.50 చొప్పున పెంచుతున్నట్లు కేంద్ర పెట్రోలియం, సహాయ వాయువుల శాఖ మంత్రి హర్దీప్‌సింగ్ పురీ వెల్లడించారు. ఈ ధరల పెంపు ఉజ్వల స్కీం లబ్ధిదారులకు సైతం వర్తింపజేస్తున్నట్లు ఆయన తెలిపారు. తాజా పెంపుతో సాధారణ వినియోగదారులు, ఉజ్వల పథకం లబ్ధిదారులు ఇప్పుడు ఒక్కో సిలిండర్ పై చెల్లిస్తున్న దానిపై అదనంగా రూ.50 పే చేయాల్సి ఉంటుంది. లాస్ట్ వీక్ హోటళ్లు, రెస్టారంట్లు సహా వాణిజ్య అవసరాల కోసం వినియోగించే వాణిజ్య సిలిండర్ గ్యాస్ ధరను రూ.41 మేర తగ్గించిన విషయం తెలిసిందే. రాష్ట్రాలను బట్టి ఈ తగ్గింపులో మార్పు ఉండనుంది.
ALSO READ: Stock Market: భారత స్టాక్ మార్కెట్‌కు షాక్ ఇచ్చిన 5 భారీ పతనాలు..కానీ ఇలా చేయండి
ALSO READ: Chicken Pickle: పచ్చళ్లకు వేలకు వేలు ఖర్చు పెట్టడం ఎందుకు? ఇంట్లోనే చికెన్ నిల్వ పచ్చడి ఇలా చేయండి