BigTV English

Mokshagna: పాపం మోక్షజ్ఞ విషయంలోనే ఎందుకిలా.. నిరాశలో ఫ్యాన్స్..!

Mokshagna: పాపం మోక్షజ్ఞ విషయంలోనే ఎందుకిలా.. నిరాశలో ఫ్యాన్స్..!

Mokshagna: తెలుగు చలనచిత్ర పరిశ్రమలో స్టార్ హీరోగా పేరు దక్కించుకున్నారు నందమూరి బాలకృష్ణ.(Nandamuri Balakrishna).ఆరుపదల వయసు దాటినా సరే వరుస సినిమాలు చేస్తూ భారీ బ్లాక్ బస్టర్ విజయాలను అందుకుంటున్నారు. ఇక ఇటీవలే సంక్రాంతి సందర్భంగా ప్రముఖ డైరెక్టర్ బాబీ కొల్లి (Bobby Kolli) దర్శకత్వంలో జనవరి 12వ తేదీన విడుదల చేసిన చిత్రం ‘డాకు మహారాజ్’. సంక్రాంతి బరిలో దిగిన ఈ సినిమా పర్వాలేదు అనిపించుకుంది. ముఖ్యంగా మాస్, యాక్షన్ ఎంటర్టైన్మెంట్ కోరుకునే వారికి ఈ సినిమా మంచి వినోదాన్ని అందించింది అని చెప్పవచ్చు. ఇందులో ప్రగ్యా జైస్వాల్(Pragya Jaiswal), చాందిని చౌదరి(Chandini Chowdary), శ్రద్దా శ్రీనాథ్(Shraddha Shrinath), ఊర్వశి (Urvashi Rautela) కీలక పాత్రలు పోషించారు. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్టైన్మెంట్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్లపై సూర్యదేవర నాగ వంశీ , ప్రముఖ డైరెక్టర్ త్రివిక్రమ్ సతీమణి సాయి సౌజన్య ఈ సినిమాను నిర్మించడం జరిగింది.


త్వరలోనే హీరోగా ఎంట్రీ

ఇకపోతే బాలయ్య వరుస సినిమాలు చేస్తూ బిజీగా దోచుకుపోతుంటే.. మోక్షజ్ఞ(Mokshagna) ఎంట్రీ ఆలస్యం అవడం అభిమానులను నిరాశకు గురిచేస్తోంది. వాస్తవానికి మోక్షజ్ఞ త్వరలోనే హీరోగా ఎంట్రీ ఇవ్వబోతున్న విషయం అందరికీ తెలిసిందే. ప్రశాంత్ వర్మ (Prashanth Varma) దర్శకత్వంలో ఒక సినిమాలో నటిస్తున్నారు. ఇప్పటికే వీరిద్దరి కాంబోలో వస్తున్న ఈ సినిమాకు సంబంధించి మోక్షజ్ఞ లుక్ ఫోటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఇకపోతే అప్పుడెప్పుడో మోక్షజ్ఞ బర్తడే సందర్భంగా గత ఏడాది సెప్టెంబర్ లో ఒక పోస్టర్ రిలీజ్ చేశారు. కానీ ఇప్పటివరకు ఈ సినిమాకు సంబంధించి ఎటువంటి అప్డేట్ కూడా బయటికి రాకపోవడంతో అభిమానులు నిరాశ వ్యక్తం చేస్తున్నారు.


మోక్షజ్ఞ ఎంట్రీ పై ఆలస్యం..

సాధారణంగా సినిమా బ్యాక్ గ్రౌండ్ ఉన్న సెలబ్రిటీల పిల్లలు ఇండస్ట్రీలోకి రావాలి అనుకుంటే పెద్దగా కష్టపడాల్సిన అవసరం లేదు. ఉదాహరణకు టాలీవుడ్ హీరోలు అయిన రామ్ చరణ్(Ram Charan), ప్రభాస్(Prabhas ), అల్లు అర్జున్ (Allu Arjun), పవన్ కళ్యాణ్ (Pawan Kalyan), ఎన్టీఆర్ (NTR ), మహేష్ బాబు (Mahesh Babu) ఇలా ప్రతి ఒక్కరు కూడా తమ తండ్రులు, కుటుంబ సభ్యులు సహకారంతో త్వరగానే ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు. కానీ మోక్షజ్ఞ హీరోగా ఎంట్రీ ఇచ్చేందుకు ఇంత ఆలస్యం అవ్వడం నిజంగా ఆశ్చర్యానికి గురిచేస్తోంది. టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్న బాలయ్య కొడుకుకి ఇండస్ట్రీలోకి అడుగుపెట్టడానికి ఇంత సమయం ఎందుకు పడుతుంది? అని నెటిజన్స్ సైతం ప్రశ్నిస్తున్నారు. మరోవైపు మోక్షజ్ఞ ఎంట్రీ ఇవ్వడం వెనుక చాలా కథ నడుస్తోంది అని వార్తలైతే వినిపిస్తున్నాయి.

మోక్షజ్ఞకే ఎందుకిలా..

ఇకపోతే ప్రశాంత్ వర్మ దర్శకుడిగా, మోక్షజ్ఞ ప్రకటన వచ్చింది కానీ మోక్షజ్ఞను ఇండస్ట్రీకి పరిచయం చేయడం కోసం బాలయ్య ఆచితూచి అడుగులు వేస్తూ.. ఎన్నో కథలు పరిశీలించిన తర్వాతనే ప్రశాంత్ వర్మని దర్శకుడిగా తీసుకొచ్చారు. అయితే ఈ విషయంలో దర్శకుడి నుండీ ఏదో తెలియని అసంతృప్తి మాటలు వినిపించడం, మధ్యలో మోక్షజ్ఞ మొదటి సినిమాపైనే నీలి నీడలు అలుముకోవడం చూస్తుంటే ఏ వారసుడికి ఇలా జరగలేదేమో.. పాపం మోక్షజ్ఞకే ఎందుకిలా జరుగుతోంది అని ఫ్యాన్స్ కామెంట్లు చేస్తున్నారు. ఏది ఏమైనా మోక్షజ్ఞ విషయంలో నందమూరి అభిమానులు కాస్త నిరాశ వ్యక్తం చేస్తున్నారని చెప్పవచ్చు.

Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×