NTR vs Allu Arjun: టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోలుగా కొనసాగుతున్న వారిలో ఎన్టీఆర్ (NTR) అల్లు అర్జున్ (Allu Arjun)వంటి హీరోలు ఒకరు. ఈ ఇద్దరు హీరోలు కూడా పాన్ ఇండియా స్థాయిలో ఎంతో మంచి సక్సెస్ అందుకున్నారు. ఇక ఎన్టీఆర్ కూడా ఎంతో మంచి సినీ బ్యాగ్రౌండ్ ఉన్న కుటుంబం నుంచి హీరోగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి పాన్ ఇండియా స్థాయిలో నటుడుగా గుర్తింపు పొందారు. అల్లు అర్జున్ కూడా మంచి సినీ నేపథ్యమున్న కుటుంబం నుంచి ఇండస్ట్రీలోకి వచ్చి తన నటనతో ఇండస్ట్రీలో గుర్తింపు పొందారు. ఇక పుష్ప సినిమాతో పాన్ ఇండియా స్థాయిలో ఈయన పేరు మారుమోగిపోతుంది.
శక్తిమాన్ గా అల్లు అర్జున్…
ఇలా టాలీవుడ్ ఇండస్ట్రీ నుంచి పాన్ ఇండియా స్థాయిలో సక్సెస్ అందుకున్న ఈ హీరోలు ప్రస్తుతం వరుస పాన్ ఇండియా సినిమాలకు కమిట్ అవుతూ కెరియర్ పరంగా బిజీగా ఉన్నారు. ఇద్దరు హీరోలకు సంబంధించి కొత్త సినిమాల ప్రకటన వచ్చిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం అల్లు అర్జున్ అట్లీ డైరెక్షన్లో సినిమా చేస్తుండగా ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ డైరెక్షన్లో బిజీగా ఉన్నారు. ఇద్దరు హీరోలు కూడా తదుపరి సినిమాల గురించి వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. అల్లు అర్జున్ మలయాళ స్టార్ డైరెక్టర్ బాసిల్ జోసెఫ్ (Basil Joseph)డైరెక్షన్లో శక్తిమాన్(Sakthi Man) పాత్ర ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్లు ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
కుమారస్వామిగా ఎన్టీఆర్…
ఇక త్రివిక్రమ్ శ్రీనివాస్ (Trivikram Srinivas) దర్శకత్వంలో ఎన్టీఆర్ మరొక సినిమా చేయబోతున్నారని ఈ సినిమాలో ఎన్టీఆర్ కుమార స్వామి(Kumara Swamy) పాత్రలో నటించబోతున్నారంటూ వార్తలు బయటకు వచ్చాయి. అయితే ఈ ప్రాజెక్టులు దాదాపు ఖరారు అయ్యాయని త్వరలోనే అధికారిక ప్రకటన కూడా చేయజేయబోతున్నారని తెలుస్తోంది. ఇలాంటి తరుణంలోనే ఈ ఇద్దరు హీరోల సినిమాల గురించి సోషల్ మీడియా వేదికగా ట్రోల్స్ వస్తున్నాయని చెప్పాలి. సాధారణంగా ఇండస్ట్రీలో ఒక హీరో పై మరొక హీరో అభిమానులు విమర్శలు చేయడం అనేది సర్వసాధారణం.
ఈ క్రమంలోనే ఎన్టీఆర్ అభిమానులు అల్లు అర్జున్ ను ఉద్దేశిస్తూ నువ్వు శక్తిమాన్ సినిమాలో నటిస్తున్నావా అంటూ ట్రోల్స్ చేయగా, నువ్వు కుమారి స్వామిగా చేయడం ఏంటి అంటూ అల్లు అర్జున్ అభిమానులు ఎన్టీఆర్ పై విమర్శలు చేస్తున్నారు. ఇలా ఈ ట్రోల్స్ కి సంబంధించి మీమ్స్ కూడా పెద్ద ఎత్తున చక్కర్లు కొడుతున్నాయి.. నిజానికి ఎన్టీఆర్ అల్లు అర్జున్ మధ్య చాలా మంచి అనుబంధం ఉంది. వీరిద్దరూ ఒకరినొకరు బావ అంటే బావ అని చాలా ప్రేమతో పిలుచుకుంటూ ఉంటారు. ఇలా ఇద్దరి హీరోల మధ్య ఇంత మంచి అనుబంధంగా ఉన్నప్పటికీ సోషల్ మీడియాలో మాత్రం ఈ ఇద్దరి హీరోల సినిమాల మీద వీరి అభిమానులు ఒకరిపై మరొకరు విమర్శలు చేసుకుంటూ వార్ ప్రకటించారనే చెప్పాలి. ప్రస్తుతం ఈ ఇద్దరు హీరోల సినిమాల గురించి సోషల్ మీడియాలో భారీ స్థాయిలో ట్రోల్స్ వస్తున్నాయి.