Pradeep Machiraju: సక్సెస్ ఎవరికీ అంత ఈజీగా రాదు. ముఖ్యంగా ఇండస్ట్రీలో సక్సెస్ ను అందుకోవడం కన్నా నిలదొక్కుకోవడం చాలా అవసరం. లక్ బావుండి ఒక సినిమా హిట్ అయితే అది లెక్కలోకి రాదు. ఆ సినిమా తరువాత్ ఎంచుకొనే కథలు.. వచ్చిన విజయాలను బట్టి సక్సెస్ ను కాలిక్యులేట్ చేస్తారు. అందుకే చాలామంది కొత్త హీరోలు, కుర్ర హీరోలు ఎంతో కష్టపడి ఒక సినిమాతో హీరోగా మారుతున్నారు.. ఆ తరువాత ఇండస్ట్రీలో నిలదొక్కుకోలేక వెనక్కి వెళ్లిపోతున్నారు. ఇప్పుడు ప్రదీప్ మాచిరాజు కూడా అదే. పని చేశాడు. యాంకర్ అనగానే గుర్తొచ్చే పేరు సుమ. ఆమె లేనప్పుడు ఝాన్సీ, స్రవంతి అంటూ చాలామంది పేర్లు వస్తాయి. అదే మేల్స్ లో అయితే అన్ని పేర్లు ఉండవు. ఒకే ఒక్క పేరు ప్రదీప్ మాచిరాజు.
షో ఏదైనా.. కంటెంట్ ఎలాంటిదైనా.. నవ్వించాలన్నా.. ఆటలు ఆడించాలన్నా.. చిన్నపిల్లలతో అల్లరి చేయాలన్నా.. సెలబ్రిటీలతో నిజాలు బయటపెట్టించాలన్నా అన్నింటికీ ప్రదీప్ ఒక్కడు ఉంటే చాలు. తెలుగులో ఛానెల్స్ ఎన్ని ఉన్నాయో.. అన్నింటిలో ప్రదీప్ షో ఒకటి కచ్చితంగా ఉంటుంది. ఒక్క మాటలో చెప్పాలంటే ప్రదీప్ బుల్లితెరకు మహారాజు అని చెప్పొచ్చు. అతని పేరు తెలియని బుల్లితెర ప్రేక్షకుడు ఉండడు. ఎన్నో షోస్ కు యాంకర్ గా చేసి మెప్పించిన ప్రదీప్.. ఎక్కడ ఉంటే అక్కడ నవ్వులే నవ్వులు.
ఇక అంత పాపులారిటీ తెచ్చుకున్నాకా.. బుల్లితెరపైనే ఉండాలని ఎవరు కోరుకుంటారు. అందుకే ఒక స్టెప్ ముందుకేసి సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు చేస్తూ మెప్పించాడు. ఆ తరువాత ఏకంగా హీరోగా టాలీవుడ్ కు ఎంట్రీ ఇచ్చాడు. 30 రోజుల్లో ప్రేమించడం ఎలా.. ? అనే సినిమాతో ప్రదీప్ హీరోగా కెరీర్ ను ప్రారంభించాడు. ప్రదీప్ అందరికీ తెలిసినవాడు.. హీరోగా మారుతున్నాడని ప్రేక్షకులు సైతం అతనిని బాగా ఎంకరేజ్ చేశారు. ఇక సినిమా కథ కూడా కొత్తగా ఉండడంతో ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. ముఖ్యంగా నీలి నీలి ఆకాశం ఇద్దామనుకున్నా సాంగ్ ఇప్పటికీ ఎక్కడో ఒక చోట వినిపిస్తూనేఉంది .
30 రోజుల్లో ప్రేమించడం ఎలా.. ? హిట్ తరువాత మళ్లీ ప్రదీప్ బుల్లితెరపైకి వెళ్ళిపోయాడు. అయితే మళ్లీ ఎందుకు వెనక్కి వెళ్లాడు.. సినిమా ఛాన్స్ లు రాలేదా.. ? కావాలనే గ్యాప్ తీసుకున్నాడా.. ? అనేది ఎవరికీ తెలియదు. ఆ తరువాత ప్రదీప్ కెరీర్ లో చాలా మారులు చోటుచేసుకున్నాయి. ఇక దాదాపు నాలుగేళ్ల తరువాత అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి అంటూ మరో సినిమాతో ఈ ఏడాది ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. మాంక్స్ అండ్ మంకీస్ బ్యానర్‌పై నిర్మించిన ఈ సినిమాకు నితిన్, భరత్ దర్శకత్వం వహించిన ఈ సినిమా ప్రదీప్ ను ముంచేసింది. ఎన్నో అంచనాల మధ్య రిలీజ్ అయిన ఈ చిత్రం ఆశించిన అలితాన్ని అందుకోలేకపోయింది.
ఇక ఇప్పుడైనా ప్రదీప్ ఇండస్ట్రీలో కొత్త ప్రయత్నాలు చేస్తాడు అనుకుంటే.. బ్యాక్ టూ పెవిలియన్ గా మళ్లీ బుల్లితెరపై రీఎంట్రీ ఇవ్వడానికి సిద్దమయ్యాడు. కుక్ విత్ జాతిరత్నాలు అనే షోకు యాంకర్ గా మారాడు. దీంతో ప్రదీప్ ప్లాన్ ఏంటి అనేది ఎవరికీ అర్ధం కావడం లేదు. హీరోగా చేసే ఉద్దేశ్యం ఉంటే ఇక్కడే ప్రయత్నాలు చేస్తూ పోవాలి. కానీ, ప్రదీప్ అలా చేయడం లేదు. ఒక సినిమా.. మధ్యలో గ్యాప్.. ఇంకో సినిమా.. ఇంకొంచెం గ్యాప్ తీసుకుంటూ వస్తున్నాడు. దీంతో అతని కెరీర్ అటు వెండితెరకు.. ఇటు బుల్లితెరకు మధ్యలో లాక్ అయ్యినట్లు తెలుస్తోంది. మరి ఈ యాంకర్ కమ్ హీరో నెక్స్ట్ ఏం ప్లాన్ చేస్తాడో చూడాలి.