Manchu Vishnu: మంచు విష్ణు (Manchu Vishnu)కన్నప్ప సినిమా(Kannappa Movie) పనులలో ఎంతో బిజీగా గడుపుతున్నారు. ఇటీవల కాలంలో విష్ణు సినిమాలను పూర్తిగా తగ్గించారని చెప్పాలి. ఒకానొక సమయంలో వరుస సినిమాల ద్వారా ప్రేక్షకుల ముందుకు వస్తున్న మంచు విష్ణు ఈమధ్య సినిమాలను పూర్తిగా తగ్గించడమే కాకుండా ఈయన చేస్తున్న సినిమాలు కూడా పెద్దగా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోతున్నాయి. ఇలాంటి తరుణంలోనే మంచు విష్ణు కన్నప్ప అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధంగా ఉన్నారు. ఈ సినిమా చేయడం తన కల అని, తన డ్రీమ్ ప్రాజెక్ట్ కోసం దాదాపు పది సంవత్సరాలు పాటు కష్టపడుతున్నానని విష్ణు తెలిపారు.
వాయిదా పడిన ట్రైలర్ రిలీజ్..
పరమశివుడి పై భక్తకన్నప్ప అనే భక్తుడు చూపించే భక్తి కథ ఆధారంగా ఈ సినిమా రాబోతుంది.. ఇక ఈ సినిమాని ఈనెల 27వ తేదీ పెద్ద ఎత్తున పాన్ ఇండియా స్థాయిలో ఒకేసారి ఐదు భాషలలో విడుదల చేయబోతున్నారు. ఇక ఈ సినిమా విడుదలకు అన్ని సిద్ధంగా ఉన్నాయని చెప్పాలి. ఇక నేడు ఈ సినిమా నుంచి ట్రైలర్ విడుదల కావాల్సి ఉండగా అహ్మదాబాద్ లో జరిగిన విమాన ప్రమాదం కారణంగా ఈ సినిమా ట్రైలర్ లాంచ్ కార్యక్రమాన్ని వాయిదా వేశారు. ఇక ఇప్పటికే సినిమా నుంచి విడుదల చేసిన అప్డేట్స్ సినిమాపై మంచి అంచనాలనే పెంచేసాయి. ఇక ఈ సినిమాలో ప్రభాస్ నటిస్తున్న నేపథ్యంలో సినిమా పట్ల మరిన్ని అంచనాలు పెరిగిపోయాయి.
స్కిన్ కేర్…
ఇక ఈ సినిమా ఒకేసారి ఐదు భాషలలో విడుదల కాబోతున్న నేపథ్యంలో మంచు విష్ణు కూడా ప్రమోషన్ కార్యక్రమాలను అదే స్థాయిలో నిర్వహిస్తూ వస్తున్నారు. తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న మంచు విష్ణు సినిమాకు సంబంధించిన ఎన్నో విషయాలను అందరితో పంచుకున్నారు. ఇకపోతే ఈ ఇంటర్వ్యూ సందర్భంగా యాంకర్ విష్ణును ఆసక్తికరమైన ప్రశ్న వేశారు. సాధారణంగా సినిమా ఇండస్ట్రీలో ఉండేవారికి స్క్రీన్ కేర్ అనేది చాలా అవసరం. ఎక్కువగా దుమ్ము ధూళిలో ఎండకు షూటింగ్స్ చేయడం వల్ల తొందరగా వారి స్కిన్ డ్యామేజ్ అవుతుంది అందుకే పెద్ద ఎత్తున స్క్రీన్ కేర్ తీసుకుంటూ ఉంటారు.
ఫ్యామిలీ చరిత్రలోనే లేదు…
మీరు కూడా మీ స్క్రీన్ కేర్ కోసం ఏమైనా చేస్తారా అంటూ ప్రశ్నించగా… తనది డ్రై స్కిన్, కేవలం మాయిశ్చరైజ్ మాత్రమే వాడుతానని తెలిపారు. అయితే తాను స్కిన్ కేర్ కంటే కూడా ఎక్కువగా హెయిర్ కేర్(Hair Care) తీసుకుంటానని తెలిపారు. మా ఇంట్లో పెద్దగా ఎవరికి జుట్టు ఉండదు అందుకే జుట్టు రాలిపోకుండా ఉండటం కోసం చాలా కేర్ తీసుకుంటానని తెలిపారు. జుట్టు కోసం ప్రతిరోజు విటమిన్ టాబ్లెట్స్, బయోటిన్స్, షాంపూస్ అన్ని ఉపయోగిస్తూ ఉంటానని విష్ణు తెలిపారు. మా ఫ్యామిలీ హిస్టరీలోనే జుట్టు ఎవరికి పెద్దగా లేదు అందుకే ఉన్నది కాపాడుకోవడం కోసం నేను చాలా కేర్ తీసుకుంటానని ఈయన వెల్లడించారు. ఇలా విష్ణు జుట్టు కోసం తీసుకునే కేర్ గురించి విన్న నెటిజన్స్ ఒక్క సరిగా ఆశ్చర్యపోతున్నారు. అమ్మాయిలు కూడా ఈ రేంజ్ లో జుట్టు గురించి కేర్ తీసుకోరు కదా అంటూ కామెంట్లో చేస్తున్నారు