Director Sukumar : హీరో సినిమా రిలీజ్ అవుతుందంటే… అభిమానుల హాడావుడి ఎంతలా ఉంటుందో అందరికీ తెలిసిందే. కానీ, అన్నీ తానై, కెప్టెన్ ఆఫ్ ది షిప్‌లా ఉండే డైరెక్టర్ గురించి ఎవరూ పెద్దగా ఆలోచించరు. అయితే ఇప్పుడు అలా కాదు. క్రియేటివ్ జీనియస్ డైరెక్టర్ సుకుమార్ సినిమా పుష్ప 2 రిలీజ్ అవుతున్న నేపథ్యంలో ఆయన అభిమానులు మర్చిపోలేని విషెస్ చెప్పారు. ఓ డైరెక్టర్‌కు ఇలా విషెస్ చెప్పడం ఇండియాలోనే మొట్ట మొదటి సారి. అంతటి విషెస్ ఏంటో ఇప్పుడు చూద్ధాం…
సుకుమార్.. కాదు కాదు.. డ్రిజిలింగ్ జీనియస్ డైరెక్టర్… ఓటమి ఎరుగుని 100 పర్సెంట్ సక్సెస్ రేట్ ఉన్న డైరెక్టర్… వీటి అన్నింటి కంటే ఎంతో మందికి సాయం చేసే గ్రేట్ హ్యూమన్ బీయింగ్. తాను ఫేం తెచ్చుకోవడమే కాదు… తన అసిస్టెంట్స్‌ను కూడా డైరెక్టర్స్‌గా మార్చడానికి ఏకంగా సుకుమార్ రైటింగ్స్ అని ఓ నిర్మాణ సంస్థ కూడా పెట్టారు. అలా దాదాపు 20 మందికి డైరెక్టర్‌గా లైఫ్ ఇచ్చారు. ఇంకా ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి.
ఇన్ని ఉన్నాయి కాబట్టే… ఆయనకు సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. డైరెక్టర్లుకు కూడా డై హార్డ్ ఫ్యాన్స్ ఉంటారు అని ఈయనను చూసిన తర్వాతే తెలిసింది. అలాంటి ఫ్యాన్స్ మోస్ట్ అవెయిటెడ్ పుష్ప 2 రిలీజ్ అవుతున్న సందర్భంగా సుకుమార్‌కు ఓ అద్భుతమైన సర్ప్రైజ్ ఇచ్చారు.
సుకుమార్ అభిమానులు హైదరాబాద్‌లో దాదాపు 70 బైక్స్‌తో అద్భుతాన్ని క్రియేట్ చేశారు. ఈ 70 బైక్స్ ను సుకుమార్ పేరు వచ్చేలా క్రమంగా పేర్చి, రాబోయే సినిమా గ్లోబల్ రేంజ్‌లో హిట్ అవ్వాలని వైల్డ్ విషేస్ చెబుతూ తమ అభిమానాన్ని చాటుకున్నారు. సుకుమార్ పేరుతో పాటు పుష్ప2 అని కూడా ఆ బైక్స్‌తో రాసుకొచ్చారు.
సాధారణంగా ఇలాంటివి స్టార్ హీరోలకు కూడా జరగదు. కానీ, ఓ డైరెక్టర్ ఇలాంటి వైల్డ్ విషెస్ ఇండియాలనే ఫస్ట్ టైం అని చెప్పొచ్చు. ఈ వీడియో చూసిన తర్వాత సుకుమార్ అభిమానులు సోషల్ మీడియాలో తెగ షేర్ చేస్తున్నారు.