Face Pack For Pimple: మొటిమలు అనేది ప్రస్తుతం చాలా సాధారణ సమస్యగా మారిపోయింది. ప్రస్తుతం చాలా మంది మొటిమల సమస్యతో ఇబ్బంది పడుతున్నారు. మొటిమలు రావడానికి అనేక కారణాలు ఉన్నప్పటికీ ఈ సమస్య నుంచి బయట పడటానికి చాలా ప్రయత్నాలు చేయాల్సి ఉంటుంది. కొంత మంది మొటిమలను తగ్గించుకోవడానికి రకరకాల స్కిన్ కేర్ పొడక్ట్స్ వాడుతుంటారు. ఇంకొందరేమో ఇంట్లోనే హోం రెమెడీస్ తయారు చేసుకుని ట్రై చేస్తారు.
మొటిమలు మన ఆత్మవిశ్వాసాన్ని తగ్గిస్తాయి. మొటిమల సమస్యతో ఇబ్బంది పడుతున్న వారు సహజ నివారణ కోసం చూస్తున్నట్లయితే, పటిక , పెరుగుతో తయారు చేసిన ఫేస్ ప్యాక్ గొప్ప ఎంపిక. ఈ రెండింటిని కలిపి తయారు చేసిన ఫేస్ ప్యాక్ మొటిమలను ఎదుర్కోవడంలో చాలా బాగా సహాయపడుతుంది. అంతే కాకుండా ముఖంపై ఉన్న జిడ్డును కూడా తొలగిస్తుంది. మరి ఇన్ని ప్రయోజనాలు ఉన్న పటిక, పెరుగుతో ఫేస్ ప్యాక్ ఎలా తయారు చేయాలో , మొటిమలతో పోరాడడంలో ఇది ఎలా సహాయపడుతుందో ఇప్పుడు తెలుసుకుందాం.
పటిక , పెరుగు ఫేస్ ప్యాక్ ప్రయోజనాలు:
మొటిమలను తొలగిస్తుంది : చర్మ రంద్రాలు అడ్డుపడటం వల్ల మొటిమల సమస్య వస్తుంది. చర్మ రంధ్రాలలో మృతకణాలు, బ్యాక్టీరియా పేరుకుపోవడం వల్ల మొటిమలు వస్తాయి.
పెరుగు, పటిక మొటిమలను నయం చేయడంలో ప్రభావవంతంగా పనిచేస్తాయి.
పటిక , పెరుగులో అనేక పోషకాలు ఉంటాయి. పటికలో క్రిమినాశక, శోథ నిరోధక లక్షణాలు ఉన్నాయి. ఇవి మొటిమలకు కారణమైన బ్యాక్టీరియాను చంపడానికి సహాయపడుతుంది. అంతే కాకుండా వాపును తగ్గించడంలో ఉపయోగపడుతుంది. పెరుగులో లాక్టిక్ యాసిడ్ ఉంటుంది.ఇది సహజమైన ఎక్స్‌ఫోలియంట్ . ఇది చర్మాన్ని మృదువుగా చేస్తుంది. అంతే కాకుండా మృతకణాలను శుభ్రపరుస్తుంది. ఇది చర్మ రంధ్రాలను నిరోధించడాన్ని నివారిస్తుంది. ఫలితంగా మొటిమల ప్రమాదాన్ని తగ్గిస్తుంది.
పెరుగు, పటిక ఫేస్ ప్యాక్ యొక్క ప్రయోజనాలు:
మొటిమలను తగ్గించడం: ఫేస్ ప్యాక్‌లో ఉండే యాంటీసెప్టిక్ లక్షణాలు చర్మ రంధ్రాలలో పెరిగే బ్యాక్టీరియాను నాశనం చేయడంలో సహాయపడతాయి. తద్వారా మొటిమలను తగ్గించే అవకాశాలు పెరుగుతాయి.
మంటను తగ్గిస్తుంది: ఫేస్ ప్యాక్‌లో ఉండే యాంటీ ఇన్‌ఫ్లమేటరీ లక్షణాలు మొటిమల వల్ల కలిగే మంటను తగ్గిస్తుంది.తద్వారా ముఖంపై ఎరుపు, నొప్పిని తగ్గిస్తుంది.
చర్మ ఆకృతిని మెరుగుపరుస్తుంది: పెరుగులో ఉండే లాక్టిక్ యాసిడ్ చర్మాన్ని మృదువుగా చేస్తుంది. అంతే కాకుండా మొటిమల వల్ల ఏర్పడిన మృత చర్మ కణాలను తొలగిస్తుంది. ఇది చర్మ ఆకృతిని మెరుగుపరుస్తుంది.
మచ్చలను పోగొట్టడం: ఫేస్ ప్యాక్‌లో ఉండే యాంటీ ఇన్‌ఫ్లమేటరీ లక్షణాలు మొటిమల వల్ల వచ్చే మచ్చలను పోగొట్టడంలో సహాయపడతాయి.
పటిక, పెరుగు ఫేస్ ప్యాక్ ఎలా తయారు చేయాలి ?
కావలసినవి:
పటిక పొడి- 1 టేబుల్ స్పూన్
పెరుగు- 2 టేబుల్ స్పూన్
నీరు- తగినంత
తయారీ విధానం: పటిక పొడిని ఒక చిన్న గిన్నెలోకి తీసుకోవాలి. అందులో కొన్ని నీళ్లు పోసి బాగా కలపాలి. పటిక పూర్తిగా కరిగిన తర్వాత పెరుగును కలపండి. తద్వారా మృదువైన పేస్ట్ ఏర్పడుతుంది.
Also Read: జుట్టు రాలుతోందా ? ఇలా చేస్తే.. సమస్య దూరం
పెరుగు, పటిక ఫేస్ ప్యాక్ ఎలా అప్లై చేయాలి ?
ముందుగా మీ ముఖాన్ని కడుక్కోండి. తర్వాత మొటిమలు ఎక్కువగా ఉండే ప్రాంతాలపై ఫేస్ ప్యాక్ అప్లై చేయండి. ఫేస్ ప్యాక్ 10 నిమిషాల పాటు ఆరిన తర్వాత మీ ముఖాన్ని చల్లటి నీటితో కడగాలి. అనంతరం శుభ్రమైన టవల్‌తో తుడవండి. ఇలా తరుచుగా చేయడం వల్ల ముఖంపై మొటిమలు రాకుండా ఉంటాయి. అంతే కాకుండా గ్లోయింగ్ స్కిన్ మీ సొంతం అవుతుంది.