Chiranjeevi : సినీ ఇండస్ట్రీలో సినిమాలతో ఎంతగా సక్సెస్ అవుతారో.. అంతగా విభేదాలు కూడా వస్తుంటాయి. సినిమాల పరంగానే కాదు. పర్సనల్ గా కూడా ఇండస్ట్రీలోని ఇద్దరి వ్యక్తుల మధ్య గొడవలు మనస్పర్థలు, విభేదాలు రావడం కామన్. కొందరు బయటకు చెప్పుకుంటారు. మరికొందరు మాత్రం మౌనంగా ఉంటారు.. కానీ కొన్ని సందర్భాలలో బయటకు వస్తుంటాయి. తాజాగా మెగాస్టార్ చిరంజీవి, దాసరి నారాయణ రావు మధ్య విభేదాలు ఉన్నట్లు గతంలో వార్తలు ఇండస్ట్రీలో వినిపించాయి.. దాసరి ఎన్నో బ్లాక్ బాస్టర్ సినిమాలు తెలుగు ప్రేక్షకులకు అందించాడు. కానీ మెగాస్టార్ చిరంజీవితో ఒక్క సినిమా మాత్రమే తీశారు. అందుకు పెద్ద కారణమే ఉందట.. అసలేమైందో ఇప్పుడు తెలుసుకుందాం..
తెలుగు చిత్ర పరిశ్రమలో మకుటం లేని మహారాజు, స్టార్ హీరో అంటే టక్కున చిరంజీవి పేరే అందరు చెబుతారు. స్వయం కృషి తో పైకొచ్చిన హీరో కావడంతో ఈయనను ఆదర్శంగా తీసుకుంటారు. అయితే నటుడు మంచి గుర్తింపు పొందిన దాసరి డైరెక్షన్ లో ఒకే ఒక్క సినిమా మాత్రమే తీశారు.. అందుకే కారణం ఇదే అంటూ ఓ వార్త ఇండస్ట్రీలో వినిపిస్తుంది. దాసరి నారాయణ రావు మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించారు .అత్యధిక సినిమాలు తీసిన దర్శకుడిగా దాసరి ప్రపంచ రికార్టు సాధిస్తే. ఈయన 150 చిత్రాల్లో నటించి అందరి చేత ప్రశంసలు పొందాడు. లెజండరి డైరెక్టర్ దాసరి ఎన్నో వందల సినిమాలు చేశాడు. కానీ చిరు తో ఒక్క సినిమాతో సరిపెట్టుకున్నారట.. అసలు నిజాలు ఏంటో ఒకసారి చూద్దాం..
దాసరి, చిరంజీవి మధ్య చిన్న గోడవ జరిగింది. దాసరి 100వ సినిమాగా లంకేశ్వరుడు చిత్రం రాగా, చిరంజీవి సినిమాల్లోకి వచ్చి 11 ఏండ్ల తర్వాత దాసరి దర్శకత్వంలో ఈ సినిమా చేశారుమెగాస్టార్ .1989 అక్టోబర్ 27న ఈ మూవీ విడుదలైంది.ఈ సినిమాకి ముందు దాసరి-చిరంజీవి కాంబినేషన్ మూవీ ఎప్పుడు వస్తుందో అని ఇండస్ట్రీలో టాక్ వినిపించేది.. అయితే షూటింగ్ సమయంలో ఇద్దరి మధ్య గోడవ జరిగిందట… అది కాస్త ప్లాప్ అయ్యింది. ఇక అప్పటినుండి దాసరి, చిరు ల మధ్య అప్పటి నుంచి సరిగ్గా మాటల్లేవని సమాచారం.. ఆ తర్వాత ఇద్దరు కలిసి కనిపించలేదు..
ఇక దాసరి నారాయణ ఇప్పుడు మనమధ్య లేరు. ఆయన తీసిన సినిమాలు ప్రేక్షకుల మనసులో చెరగని ముద్ర వేసుకున్నాయి. ఎన్నో అవార్డులను సొంతం చేసుకున్నాడు. ఈయనకు మోహన్ బాబు మధ్య మంచి స్నేహ బంధం ఉందన్న విషయం తెలిసిందే.. ఇక చిరంజీవి ఇప్పటివరకు ఎన్నో సినిమాలు చేశారు. సెకండ్ ఇన్నింగ్స్ ఆయనకు అంతగా కలిసి రాలేదు. ఆచార్య, భోళా శంకర్ బ్యాక్ టు బ్యాక్ ప్లాప్ అయ్యాయి. ఇప్పుడు విశ్వంభర మూవీతో ప్రేక్షకులను పలకరించేందుకు సిద్ధంగా ఉన్నాడు. ఈ మూవీ అన్నా హిట్ టాక్ ను అందుకుంటుందేమో చూడాలి.. ఈ మూవీ సమ్మర్ కు రిలీజ్ అవుతుంది. ఆ తర్వాత మరో మూవీ అనిల్ రావిపూడి తో చెయ్యనున్నారని టాక్..