BigTV English

OTT Movie : భర్త చేసే ఉద్యోగం తెలిసి భార్య షాక్… సాఫ్ట్వేర్ ఉద్యోగితో ఆ పని కోసం లేచిపోయి…

OTT Movie : భర్త చేసే ఉద్యోగం తెలిసి భార్య షాక్… సాఫ్ట్వేర్ ఉద్యోగితో ఆ పని కోసం లేచిపోయి…

OTT Movie : థియేటర్లలో రిలీజ్ అవుతున్న సినిమాలు ఓటిటి ఫామ్ లోకి వస్తున్న సంగతి తెలిసిందే. అయితే వీటిలో వచ్చే కొన్ని చిన్న సినిమాలు పెద్ద మెసేజ్ ని ఇస్తాయి. మంచి మెసేజ్ ఇచ్చిన ఒక తమిళ్ ఫ్యామిలీ డ్రామా మూవీ, ఓటిటి ప్లాట్ ఫామ్ లో స్ట్రీమింగ్ అవుతుంది. ఆ మూవీ పేరు ఏమిటి? ఎందులో స్ట్రీమింగ్ అవుతుందో వివరాల్లోకి వెళితే…


అమెజాన్ ప్రైమ్ వీడియోలో 

ఈ ఫ్యామిలీ డ్రామా తమిళ్ మూవీ పేరు ‘ఓరు కుప్పై కధై‘ (Oru Kuppai Kadahi). ఈ మూవీలో భర్త చేసే మునిసిపాలిటీ ఉద్యోగం నచ్చకపోవడంతో, వేరొకరిని ఇష్టపడి వెళ్ళిపోతుంది భార్య. హీరో, హీరోయిన్ ఫేస్ చేసే సన్నివేశాలతో మూవీ స్టోరీ రన్ అవుతుంది. ఈ ఫ్యామిలీ డ్రామా మూవీ అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon prime video) లో స్ట్రీమింగ్ అవుతోంది.


స్టోరీ లోకి వెళితే

కుమార్ మున్సిపాలిటీలో చెత్త ఎత్తే ఉద్యోగం చేస్తుంటాడు. ఇతనికి చాలా సంబంధాలు వచ్చినా, అతడు చేసే పని నచ్చకపోవడంతో క్యాన్సిల్ అవుతూ ఉంటాయి. ఒక అమ్మాయికి ఇంట్లో వాళ్ళు క్లర్క్ అని చెప్పి పెళ్లి సంబంధం సెట్ చేస్తారు. ఈ విషయం తెలిసిన కుమార్ పెళ్లికూతురు తండ్రికి నిజం చెప్తాడు. అతని నిజాయితీ మెచ్చుకొని కూతురుని ఇచ్చి పెళ్లి చేస్తాడు. అయితే విషయం పెళ్లి అయిన తర్వాత అమ్మాయికి చెప్తే సరిపోతుందని అంటాడు. ఈ క్రమంలోనే కుమార్, హీరోయిన్ ల పెళ్లి జరుగుతుంది. అత్తగారి ఇంటికి వచ్చిన హీరోయిన్ కి ఆ వాతావరణం నచ్చదు. కొద్ది రోజుల తర్వాత హీరోయిన్ ఒక పిల్లాడిని కంటుంది. ఒకరోజు అనుకోకుండా కుమార్ చెత్త ఎత్తుతూ ఆమె కళ్ళల్లో పడతాడు. అది చూసి భర్తతో గొడవపడి వెళ్ళిపోతానని అంటుంది. తండ్రి ఆమెకు సర్ది చెప్పి అక్కడే ఉండాలని చెప్తాడు. ఆ తర్వాత ఒక మంచి ఇల్లు చూసి భర్త హీరోయిన్ ని  అందులో పెడతాడు. ఆ ఇంటి పక్కన సాఫ్ట్వేర్ ఉద్యోగి హీరోయిన్ ను లైన్ లో పెడతాడు. తన కళలకు దగ్గరగా ఉన్న ఇతన్ని చూసి అట్రాక్ట్ అవుతుంది హీరోయిన్. ఇద్దరూ కలసి ఇంటి నుంచి పారిపోతారు. భార్య కనపడకపోవడంతో సెక్యూరిటీని అడుగుతాడు. సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ తో నీ భార్య క్లోజ్ గా ఉంటుందని చెప్తాడు సెక్యూరిటీని. అయితే హీరోయిన్ సాఫ్ట్వేర్ ఉద్యోగితో పెళ్లి చేసుకోమని అడుగుతుంది.

అతడు ఎంజాయ్మెంట్ కోసం చేసుకోవడంతో పెళ్లి మీద ఇంట్రెస్ట్ లేదని చెప్తాడు. కొన్ని రోజుల తర్వాత ఆమెను వదిలించుకోవాలని చూస్తాడు. ఈ క్రమంలో ఫ్రెండ్ కి ఆమెను అప్పజెప్పి మళ్లీ తిరిగి వస్తానని వెళ్ళిపోతాడు సాఫ్ట్వేర్ ఉద్యోగి. అయితే ఆ వ్యక్తి కూడా ఈమెపై కన్ను వేస్తాడు. ఇన్ని రోజులు నీతో ఉన్న అతడు నీ వీడియోలను కూడా మాకు చూపించే వాడని, వాళ్ళిద్దరూ ఏకాంతంగా గడిపిన వీడియోలను చూపిస్తాడు. హీరోయిన్ చాలా బాధపడటంతో పాటు భర్త కూడా గుర్తుకు వస్తాడు. అతడు బలవంతం చేయబోవడంతో దగ్గరలో ఉన్న కత్తిని తీసుకొని పొడి చేస్తుంది. అప్పుడు తను కూడా చచ్చిపోవాలని అనుకుంటుంది. ఈ క్రమంలో డోర్ తెరవగా ఎదురుగా భర్త ఉంటాడు. అక్కడ ఏం జరిగిందో కల్లారా చూస్తాడు. ఆ తర్వాత ఆహత్యను తన మీద వేసుకొని భార్యని ఇంటికి పంపిస్తాడు. చివరకు హీరోయిన్ తన జీవితాన్ని ఎలా సరిదిద్దుకుంటుంది? భర్త జైలు జీవితం గడుపుతాడా? ఈ విషయాలు తెలుసుకోవాలనుకుంటే ఈ ఫ్యామిలీ డ్రామా మూవీని మిస్ కాకుండా చూడండి.

Related News

OTT Movie : ప్రియురాలు పక్కనుండగా ఇవేం పాడు పనులు భయ్యా ? అల్టిమేట్ ట్విస్టులు… ఎక్స్ట్రా ఆర్డినరీ పవర్స్

OTT Movie : స్టూడెంట్ ప్రైవేట్ ఫోటో లీక్… టీచర్ చేసే సైకో పనికి మెంటలెక్కల్సిందే

OTT Movie : స్విమ్మింగ్ పూల్ లో శవం… బర్త్ డే రోజు దిమ్మతిరిగే గిఫ్ట్… ఇలాంటి సర్ప్రైజ్ ఇస్తే డైరెక్ట్ గా పరలోకానికే

OTT Movie : భార్యతో పాటు కోడలినీ వదలని మూర్ఖుడు… కొడుకు రీ ఎంట్రీతో ఫ్యామిలీ టెర్రర్… ట్విస్టులతో అదరగొట్టే సైకో థ్రిల్లర్

OTT Movie : మర్డర్ల చుట్టూ తిరిగే మైండ్ బ్లోయింగ్ స్టోరీ… హత్య కేసులో అనుకోని ట్విస్ట్… IMDbలో 7.9 రేటింగ్

OTT Movie: టీచర్ కి నరకం చూపించే స్కూల్… ఆత్మలుగా మారే పిల్లలు… ఒక్కో ట్విస్టుకు చుక్కలే

Big Stories

×