BigTV English

Filim Chanber : కొండా సురేఖ వ్యాఖ్యల పై ఫిలిం ఛాంబర్ అత్యవసర సమావేశం..దీనిపైనే చర్చ.

Filim Chanber : కొండా సురేఖ వ్యాఖ్యల పై ఫిలిం ఛాంబర్ అత్యవసర సమావేశం..దీనిపైనే చర్చ.

Filim Chamber : టాలీవుడ్ హీరోయిన్ సమంత విడాకుల పై మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం చర్చనీయాంశంగా మారాయి.. ఆమె క్షమాపణలు చెప్పిన కూడా ఫిలిం ఇండస్ట్రీలోని ప్రముఖులు దీనిపై కఠిన చర్యలు తీసుకోవాలని, రాజకీయ లబ్ది కోసం సినిమా వాళ్లను కించపరిచే విధంగా వ్యాఖ్యలు చెయ్యొద్దనే వాదన వినిపిస్తున్నారు. టాలీవుడ్ లో ఈ వార్త పెను సంచలనంగా మారింది. తాజాగా ఈ విషయం పై ఈరోజు మధ్యాహ్నం ఫిలిం ఛాంబర్ లో అత్యవసర మీడియా సమావేశన్ని ఏర్పాటు చేశారు సినీ పెద్దలు. అందులో ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనే దానిపై ఉత్కంఠ నెలకొంది. ఇప్పటికే చిరంజీవి, నాగార్జున, ఎన్టీఆర్, అల్లు అర్జున్, నాని సహా పలువురు నటీనటులు కొండా సురేఖ వ్యాఖ్యలపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు.. ఫిలిం ఛాంబర్ ఈ విషయం పై ఒక ప్రెస్ ను నోట్ ను రిలీజ్ చేశారు ప్రస్తుతం ఆ నోట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.


ఫిలిం ఛాంబర్ ప్రెస్ నోట్ లో ఏముందంటే?

మంత్రి కొండా సురేఖ టాలీవుడ్ హీరోయిన్ సమంత, నాగ చైతన్య, సమంత విడాకులు తీసుకోవడానికి కేటీఆర్ కారణం అని చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సినీ ఇండస్ట్రీలోనూ, అటు రాజకీయాల్లోను తీవ్ర దుమారం రేపుతున్న సంగతి తెలిసిందే.. తాజాగా దీనిపై ఫిలిం ఛాంబర్ లో అత్యవసర సమావేశన్ని ఏర్పాటు చేశారు. సినీ పెద్దలు దీని పై క్షుణ్ణంగా చర్చించి ప్రెస్ నోట్ ను రిలీజ్ చేశారు. ఆ నోట్ లో.. రాజకీయాలతో సినిమాలను ముడిపెట్టకండి.. గత కొన్ని రోజులుగా ప్రభుత్వం సినీ ప్రముఖుల పై చిన్న చూపు చూస్తుంది. మీడియాలో అనేక రకాల తప్పుడు ప్రచారాలు వినిపిస్తున్నాయి. మీ రాజకీయ లబ్ది కోసం కేవలం సినిమా వాళ్ల వ్యక్తి గత విషయాలను తీస్తూ మాట్లాడం మంచిది కాదు.. మీరు మాట్లాడే మాటలు జనాలకు వేరేలా అర్థమవుతున్నాయి. ఇలాంటివి మళ్లీ పునరావృతం కాకుండా చూడాలని మేము కోరుకుంటున్నాం.. తెలుగు చలనచిత్ర పరిశ్రమ ఎప్పుడూ మతపరమైన వివక్ష లేకుండా ఒక లౌకిక సంస్థగా ముందంజలో ఉంది. మా సోదరభావం అనేక జాతీయ, అంతర్జాతీయ అవార్డులను తెచ్చిపెట్టింది.. ఇలాంటి వాటికి ఫిలిం ఛాంబర్ వ్యతిరేకంగా ఉంటుంది. భవిష్యత్తులో సభ్యులకు అండగా నిలుస్తుంది. బలమైన తగిన చర్యలు తీసుకోవడానికి వెనుకాడదు అంటూ నోట్ లో రాసుకొచ్చారు..


ఈ వివాదం పై ఇప్పటికే సినీ లోకం గళం విప్పింది.. ఇండస్ట్రీలోని ప్రముఖులు దీనిపై ఖండిస్తున్నారు. మంత్రి కొండా సురేఖపై మూకుమ్మడి దాడిని సోషల్ మీడియాలో మొదలుపెట్టారు. దీంతో ఆమె వెనక్కి తగ్గారు. తన వ్యాఖ్యలను ఉపసంహరించుకున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు ఆమె ట్వీట్ చేశారు. ఇక తాజాగా నాగార్జున షాకిచ్చారు. తన పరువుకు భంగం కలిగించారంటూ నాగార్జున ఆమెపై పరువు నష్టం దావా వేశారు. ఈ మేరకు ఆయన నాంపల్లి కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ వివాదం ఇక ఎంత వరకు వెళ్తుందో చూడాలి..

Related News

Movie Tickets : బుక్ మై షోలో లేని టికెట్స్ డిస్ట్రిక్ట్ యాప్‌లో ఎలా వస్తున్నాయి ?

Save the Tigers 3 : ‘సేవ్ ది టైగర్స్’ మళ్లీ వచ్చేస్తుంది.. ఎమ్మెల్యే గా ఘంటా రవి..

BIG TV Kissik talk Show: ఆ డైరెక్టర్ వల్లే నా కెరీర్ మొత్తం నాశనం.. మండిపడ్డ నటి రాశి

BIG TV Kissik talk Show : పదేళ్లుగా పిల్లలు పుట్టలేదు, చివరికి నా ప్రాణాలు ఫణంగా పెట్టి.. రాశి భావోద్వేగం

Sydney Sweeney: సిడ్నీ స్వీని బాలీవుడ్ ఎంట్రీ.. ఏకంగా రూ.530 కోట్లు ఆఫర్.. కళ్లు తేలేసిన నటి!

BIG TV Kissik talk Show : అతడితో పెళ్లి.. ఇంట్లో చాలా పెద్ద గొడవలు అయ్యాయి – కిస్సిక్ టాక్‌లో రాశి కామెంట్స్

Priyanka Jain: ప్రియాంకకు హ్యాండిచ్చి.. శోభశెట్టితో పులిహోర కలిపిన శివ్, అడ్డంగా బుక్కయ్యాడుగా!

Actress Mohini: అలా చేయాలని బలవంతం చేశారు.. చాలా ఏడ్చాను, బాలయ్య హీరోయిన్ షాకింగ్ కామెంట్స్!

Big Stories

×