JACK Movie : సిద్దు జొన్నలగడ్డ మెయిన్ లీడ్ లో చేసిన జాక్ మూవీ ఈ నెల 10న రిలీజ్ కాబోతుంది. కాసేపటి క్రితమే ఈ మూవీకి సంబంధించిన ట్రైలర్ రిలీజ్ అయింది. కొన్ని బూ*తులు ఉన్నా… ట్రైలర్ కి అయితే పాజిటివ్ మార్కులే పడ్డాయి.
ఫిల్మ్ ఛాంబర్‌లో పంచాయితీ…
ఇదిలా ఉండగా… ఈ సినిమా రిలీజ్‌ను ఆపాలని ఫిల్మీ ఛాంబర్ లో ఓ ఫిర్యాదు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ జాక్ మూవీని నిర్మించిన శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర గతంలో గాండీవధారి అర్జున అనే సినిమా చేశారు. మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ మెయిన్ లీడ్ గా చేసిన ఈ మూవీ బిగ్గెస్ట్ డిజాస్టర్‌గా మిగిలింది. అయితే ఈ గాండీవధారి అర్జున సినిమా వల్ల తాము చాలా లాస్ అయ్యామని, తాము రికవరెబుల్ ఒప్పందంతో ఆ సినిమాను కొనుగోలు చేశామని, అయితే, నష్టాలు వచ్చాయి.. తర్వాత నిర్మాతలకు తమకు రికవరెబుల్ అమౌంట్ ను సెటిల్ చేయలేదు అంటూ ఈస్ట్ & వెస్ట్ గోదావరి రైట్స్ తీసుకున్న బయ్యర్లు ఫిల్మ్ ఛాంబర్ లో ఫిర్యాదు చేశారు.
ఛాంబర్ ఏకపక్ష నిర్ణయం…
ఈస్ట్ & వెస్ట్ గోదావరి రైట్స్ తీసుకున్న బయ్యర్ల ఫిర్యాదుపై ఈ రోజు ఫిల్మ్ ఛాంబర్‌లో విచారణ జరిగింది. ఈ వివాదంపై ఫిల్మ్ ఛాంబర్ నిర్ణయం కూడా తీసుకున్నట్టు తెలుస్తుంది. దీనిపై ఈస్ట్ & వెస్ట్ గోదావరి రైట్స్ తీసుకున్న బయ్యర్లు కూడా తమ సన్నిహితుల దగ్గర చెప్పారట.
అంతే కాదు… ఈ విషయంలో ఛాంబర్ ఏకపక్షంగా వ్యవహరించి… నిర్మాతలకు అనుకూలంగా తీర్పు చెప్పారని, దీని వల్ల తాము నష్టపోతున్నామని ఆ బయ్యర్లు పలువురి దగ్గర చెబుతూ వాపోతున్నారట. దీంతో ఫిల్మ్ ఛాంబర్ వ్యవహారంపై ఇండస్ట్రీలో టాక్ నడుస్తుంది.
రికవరెబుల్ అగ్రిమెంట్ చేసుకున్న తర్వాత ఆ అగ్రిమెంట్ ను పక్కన పెట్టేసి.. బయ్యర్లకు ఎలా అన్యాయం చేస్తారు అని అంటున్నారు.
జాక్ సినిమాపై ప్రభావం…
ఏది ఏమైనా… ఈ బయ్యర్ల వ్యవహరం వల్ల జాక్ సినిమాపై ఎఫెక్ట్ అయితేే పడిందని చెప్పొచ్చు. గాండీవధారి అర్జున రిలీజ్ టైంలోనే బయ్యర్లతో నిర్మాతలు సెటిల్ చేసుకోవాల్సిందని అప్పుడు జాక్ సినిమాకు క్లియరెన్స్ ఉండేదని కూడా ఇండస్ట్రీలో మాటలు వినిపిస్తున్నాయి.