Shyam Benegal: ఇండస్ట్రీలో తీవ్ర విషాదం నెలకొంది. ప్రముఖ డైరెక్టర్, నిర్మాత, సినీ రచయిత శ్యామ్ బెనెగల్(90) కన్నుమూశారు. గత కొంతకాలంగా వయో వృద్ధాప్య సమస్యలతో బాధపడుతున్న ఆయన సోమవారం ముంబైలోని వోకార్డ్ ఆసుపత్రిలో కన్నుమూసినట్లు ఆయన కుమార్తె పియా బెనెగల్ అధికారికంగా ధృవీకరించారు. ” నిజమే. శ్రీ శ్యామ్ బెనెగల్ ఈ సాయంత్రం 6:30 గంటలకు మరణించారు” అంటూ ఆమె తెలిపింది. దీంతో ఇండస్ట్రీలో విషాద ఛాయలు అలముకున్నాయి.
శ్యామ్ ప్రఖ్యాత హిందీ నటుడు, దర్శకుడు గురుదత్ కు దూరపు బంధువు. ఈయన సికింద్రాబాదులోని మహబూబ్ కళాశాలలో చదువుకున్నారు. అంకుర్ (1973), నిషాంత్ (1975), మంథన్ (1976), భూమిక (1977), మమ్మో (1994), సర్దారీ బేగం (1996) మరియు జుబేదా (2001) వంటి హెల్మింగ్ చిత్రాలకు శ్యామ్ బెనగల్ బాగా పేరు తెచ్చుకున్నారు. మిడిల్ క్లాస్ సినిమాలను తీసి .. కొత్త ఒరవడికి నాంది పలికారు.
సినిమా రంగంలో ఈయన చేసిన కృషికి గాను భారత ప్రభుత్వం 1976లో పద్మశ్రీ పురస్కారాన్ని, 1991లో పద్మ భూషణ్ పురస్కారాన్ని ఇచ్చి సత్కరించింది. 2007, ఆగస్టు 8 న భారతీయ చలనచిత్ర రంగంలో అత్యంత ప్రముఖమైన దాదా సాహెబ్ ఫాల్కే పురస్కారాన్ని 2005 సంవత్సరానికి గాను శ్యామ్ అందుకున్నారు.
18 నేషనల్ అవార్డులు అందుకునం డైరెక్టర్ గా రికార్డు సృష్టించారు. చివరగా ఆయన గతేడాది రిలీజ్ అయిన ముజీబ్: ది మేకింగ్ ఆఫ్ ఎ నేషన్ అనే సినిమాకు దర్శకత్వం వహించారు. ఇక శ్యామ్ కు నీరా అనే భార్య పియా అనే కూతురు ఉన్నారు. ఆయన మరణ వార్త విన్న ప్రముఖులు తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తున్నారు.