Vishal – Dhansika:ప్రముఖ కోలీవుడ్ స్టార్ హీరో విశాల్(Vishal ) గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. తాను తమిళంలో నటించిన ‘పందెంకోడి’ సినిమాను తెలుగులో కూడా డబ్బింగ్ చేసి, తెలుగు ప్రేక్షకులకు పరిచయమయ్యారు. వాస్తవానికి తెలుగు హీరో అయినా కోలీవుడ్లో సెటిల్ అవడంతో అక్కడే పలు సినిమాలు చేస్తూ బిజీగా మారారు విశాల్. ఇక ఇప్పుడు తమిళంలో తాను చేసే ప్రతి సినిమాను తెలుగులో కూడా విడుదల చేస్తూ.. అటు తమిళ్ ఇటు తెలుగు బాక్సాఫీస్ వద్ద మంచి మార్కెట్ ఏర్పాటు చేసుకున్నారు విశాల్. ఇకపోతే విశాల్ ఇండస్ట్రీలోకి వచ్చి చాలా ఏళ్లు అవుతున్నా.. ఇంకా వివాహం చేసుకోకపోవడంతో రోజుకొక వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అసలు విషయంలోకి వెళ్తే.. నిన్న చెన్నై మధుర మీనాక్షిని దర్శించుకున్న విశాల్ నడిగర్ సంఘం భవనం నిర్మాణం పూర్తయిన వెంటనే వివాహం చేసుకుంటానని క్లారిటీ ఇచ్చారు. దీంతో సాయి ధన్సిక పేరు తెరపైకి వచ్చింది.
గాసిప్స్ పై క్లారిటీ.. పెళ్లి డేట్ ఫిక్స్..
ఇక ఇద్దరు వివాహం చేసుకోబోతున్నారు అంటూ గాసిప్స్ చాప కింద నీరులా వ్యాపించడంతో ఎట్టకేలకు ఈ జంట పై వస్తున్న గాసిప్స్ అన్నీ నిజమే అంటూ ప్రకటించారు. అదే కాదు పెళ్లి డేట్ ను కూడా అనౌన్స్ చేశారు. అసలు విషయంలోకి వెళ్తే.. సాయి ధన్సిక (Sai Dhansika) తాజాగా నటిస్తున్న తమిళ్ మూవీ ‘యోగిదా’. చెన్నైలో ఈ మూవీ ఆడియో లాంచ్ ఈవెంట్ ఘనంగా నిర్వహించారు. అదే వేదికపై పెళ్లి గురించి అధికారికంగా ప్రకటించారు ఈ జంట. ఇదే విషయంపై సాయి ధన్సిక మాట్లాడుతూ.. “కొన్ని నెలల క్రితమే మేము ఒకరితో ఒకరం మాట్లాడుకోవడం మొదలు పెట్టాము. ఆగస్టు 29న పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నాము. ఈరోజు మేము దీనిని వెల్లడిస్తామని ఊహించలేదు. ఈ ఉదయం మా పెళ్లిపై మీడియాలో వార్తలు వచ్చాయి. అందుకే ఇకపై దాచకూడదు అనుకున్నాము. అంతా ఓపెన్ గా చెప్పేసాం. ఇప్పుడు ఇక దాచడానికి ఏమీ లేదు.. విశాల్ ఎప్పుడు సంతోషంగా ఉండాలని కోరుకుంటాను” అంటూ సాయి ధన్సిక తెలిపింది. ఇక విశాల్ మాట్లాడుతూ..” సాయి ధన్సిక చాలా మంచి వ్యక్తి. అందుకే ఇద్దరం జీవితాన్ని పంచుకోవాలనుకుంటున్నాము. పెళ్లి తర్వాత కూడా ఆమె సినిమాలలో నటిస్తుంది” అంటూ విశాల్ తెలిపారు.
also read:HBD Jr NTR: తారక్ గురించి ఎవరికీ తెలియని 10 విషయాలివే.!
తొలిసారి ఆరోగ్యంగా కనిపించిన విశాల్..
గత కొద్ది రోజులుగా అనారోగ్య సమస్యలతో సతమతమవుతున్న విశాల్.. ఇటీవల మే 11న తమిళనాడులోని విల్లుపురం లో జరిగిన అందాల పోటీలకు హాజరై.. సడన్గా కుప్పకూలిపోయారు. దాంతో విశాల్ అభిమానులు ఆందోళనకు గురయ్యారు. ఇప్పుడు యోగిదా ఆడియో లాంచ్ ఈవెంట్లో విశాల్ తొలిసారి సంతోషంగా, ఆరోగ్యంగా కనిపించేసరికి అభిమానులు ఫుల్ ఖుషీ అవుతున్నారు. ఏది ఏమైనా గతంలో హీరోయిన్ వరలక్ష్మి శరత్ కుమార్ (Varalakshmi Sarath Kumar) తో ఒకసారి పెళ్లి , మరొకవైపు అభినయ(Abhinaya) తో ఇలా పలువురు హీరోయిన్లతో పెళ్లి అంటూ ప్రచారం జరిగినా.. ఇప్పుడు ఎట్టకేలకు సాయి ధన్సిక తో పెళ్లికి సిద్ధమవుతున్నారు. మొత్తానికైతే చాలా రోజుల తర్వాత హీరో విశాల్ పెళ్లికి సిద్ధమవుతున్నారని చెప్పవచ్చు.
#SaiDhanshika officially announces her marriage with #Vishal ♥️👌👌 pic.twitter.com/B54dCiZ9fU
— SUDHEER MAX (@sudheermax) May 19, 2025